హార్దిక్ ధరించిన వాచ్ లు ప్రపంచంలో 50 మాత్రమే ఉన్నాయి !
ఈ చేతి గడియారం ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారులు క్రిస్టియానో రొనాల్డో, రాఫెల్ నాదల్ చేతులకు కూడా కనిపించింది. హార్దిక్ పాండ్యా ధరించిన వాచ్ దానికంటూ ప్రత్యేక లక్షణాలు, డిజైన్ ను కలిగి ఉంటుంది. గొప్ప డిజైన్ మాత్రమే కాదు.. ఇది లిమిటెడ్ ఎడిషన్. ప్రపంచవ్యాప్తంగా కేవలం 50 మాత్రమే ఉన్నాయి. అందుకే దీనిని ధరించాలనేది చాలా మంది ఔత్సాహికుల కల అవుతుంది.
ఈ గడియారం కలర్ ఫుల్ ఎలాస్టిక్ బ్యాండ్‌తో, ప్రత్యేకమైన తెల్లటి క్వార్ట్జ్ కేసును కలిగి ఉంటుంది. దీంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. తెల్లని క్వార్ట్జ్ బెజెల్, సిల్వర్-టోన్ చేతులు, ఇండెక్స్ మార్కర్లతో కూడిన సొగసైన నలుపు డయల్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ వాచ్ లో రిచర్డ్ మిల్లె కాలిబర్ CRMA7 ఆటోమేటిక్ మూవ్‌మెంట్ ఉంది. దీనిపై ఎలాంటి గీతలు కూడా పడవు. ఈ వాచ్ ప్రారంభ ధర ఒక కోటి రూపాయల నుంచి రూ. 7 కోట్ల వరకు ఉంటుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.