Champions Trophy: ఆర్మీ ట్రైనింగ్.. కొండలెక్కించారు.. గోడలు దూకించారు.. చివరకు భారత్ దెబ్బకు టఫా కట్టిన పాక్

Published : Feb 24, 2025, 07:07 PM ISTUpdated : Feb 24, 2025, 07:08 PM IST

Champions Trophy 2025: భార‌త్ పై గెల‌వ‌డానికి పాకిస్తాన్ చేసిన ప‌నంటూ లేదు. పాక్ ప్లేయ‌ర్ల‌ను  కొండలెక్కించారు.. గుట్టలు తిప్పారు.. గోడలు దూకించారు.. ఏకంగా ఆ దేశ ఆర్మీతో శిక్ష‌ణ ఇప్పించారు. అయితే, చివ‌ర‌కు భారత్ ఒక్క‌ దెబ్బతో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుంచి పాకిస్తాన్ జ‌ట్టు టఫా కట్టింది.   

PREV
13
Champions Trophy: ఆర్మీ ట్రైనింగ్.. కొండలెక్కించారు.. గోడలు దూకించారు.. చివరకు భారత్ దెబ్బకు టఫా కట్టిన పాక్
Pakistan cricket team, pak army, pak

Champions Trophy 2025: ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 ఐదో మ్యాచ్ లో భార‌త్-పాకిస్తాన్ జ‌ట్లు తల‌ప‌డ్డాయి. ఈ హై వోల్టేజీ మ్యాచ్ కోసం ఇరు జ‌ట్లు చాలానే ప్రాక్టీస్ చేశాయి. గెలుపు కోసం చాలానే క‌ష్ట‌ప‌డ్దాయి. అయితే, ఈ మ్యాచ్ లో భార‌త్ దెబ్బ‌కు పాకిస్తాన్ టోర్నీ అవ‌త‌ల ప‌డింది. బౌలింగ్, బ్యాటింగ్ లో అద‌ర‌గొడుతూ పాకిస్తాన్ కు షాక్ ఇచ్చింది భార‌త్. మ‌నోళ్ల దెబ్బ‌కు అతిథ్య దేశం లీగ్ ద‌శ‌లోనే టోర్నీ నుంచి బ‌య‌ట‌కు దొబ్బేశారు.

23
Pakistan cricket team, pak army, pak

ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ టాస్ గెలిచి మొద‌ట బ్యాటింగ్ చేసింది. మొద‌ట‌ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంద‌ని పాక్ తెగ సంబ‌ర‌ప‌డింది. అయితే, మ‌న బౌల‌ర్ల దెబ్బ‌కు మ్యాచ్ ప్రారంభ‌మైన‌ కొద్దిసేప‌టికే ఇదేంది సామి అనేలా పాక్ నెత్తికి చేతులు పెట్టుకుంది. కుల్దీప్ యాద‌వ్, హార్దిక్ పాండ్యా, అక్ష‌ర్ ప‌టేల్, జ‌డేజా, హ‌ర్షిత్ రాణా దెబ్బ‌కు పాక్ ట‌పా క‌ట్టేసింది. పూర్తి ఓవ‌ర్లు అయిపోక ముందే 241 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్య‌ర్, శుభ్ మ‌న్ గిల్ అద్భుత ఇన్నింగ్స్ ల‌తో భార‌త్ మ‌రో 7 ఓవ‌ర్లు మిగిలి ఉండ‌గానే విజ‌యాన్ని అందుకుంది. 

అయితే, భార‌త్ పై గెల‌వ‌డానికి పాకిస్తాన్ చాలా రోజుల నుంచి భారీ కసర్తులే చేసింది. గత టీ20 ప్రపంచ కప్ కు ముందు నుంచే బిగ్ మ్యాచ్ కోసం చూస్తున్న పాక్.. ఆ జట్టు ప్లేయర్ల కొండలెక్కించారు... గోడలు దూకించారు... మామూలుగా అయితే కుదరదని ఏకంగా పాకిస్తాన్ ఆర్మీ తోనే ట్రైనింగ్ ఇచ్చారు. అయితే, టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భార‌త్ పాక్ ను గ‌ట్టిగానే దెబ్బ‌కొట్టింది. మ‌నోళ్లు ఛాంపియ‌న్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. 

33
Pakistan cricket team, pak army, pak

ఇప్పుడు ఛాంపియ‌న్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్‌లో అడుగు పెట్టేది లేదంటూ పంతం పట్టి దుబాయ్‌లోనే మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధ‌మైంది భారత్. దీంతో పాక్, ఐసీసీ అంగీక‌రించ‌క త‌ప్ప‌లేదు. దీనికి దుబాయ్ లో భారత్‌ను ఓడించి తీరాలంటూ శపథం చేసి మరీ వచ్చిన పాకిస్థాన్ టీమ్‌ ఘోర పరాజయంతో టఫా కట్టింది. భార‌త్ పై పాకిస్తాన్ బ్యాట్ పెద్ద‌గా ప‌నిచేయ‌లేదు.. బౌలింగ్ కూడా అదిరిపోలేదు. మొత్తంగా పాక్ జ‌ట్టుకు ఆర్మీ ట్రైనింగ్ అంతా ఏమైనట్లో మ‌రి.. ! 

పాకిస్తాన్ మ్యాచ్ ఓడిపోయిన త‌ర్వాత పాకిస్తాన్ క్రికెటర్లు, ఆ దేశ సైన్యంతో కలిసి కాకుల్‌లోని ఆర్మీ స్కూల్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్‌ క్యాంప్‌లో శిక్షణ పొందిన వీడియోలు వైర‌ల్ గా మారాయి. క్రికెట‌ర్ల‌కు క్రికెట్ కోచ్ ల‌తో ట్రైనింగ్ ఇవ్వాలి కానీ, ఇలా ఆర్మీతో ట్రైనింగ్ ఇస్తే ఇలానే ఉంట‌ది అంటూ పాక్ ఓట‌మిపై ట్రోల్స్ మొద‌ల‌య్యాయి. స్వ‌యంగా ఆ దేశ నెటిజ‌న్లు సైతం పాకిస్తాన్ జ‌ట్టును ఏకీ పారేస్తున్నారు.

వాటిని ఇక్కడ చూడండి

పాక్ జట్టుపై మొదలైన ట్రోల్స్ 

పాకిస్తాన్ క్రికెట‌ర్ల ఆర్మీ ట్రైనింగ్ వీడియోలు

Read more Photos on
click me!

Recommended Stories