Top 6 Test Six Hitters in 2025: టెస్ట్ క్రికెట్ ను సైతం 2025లో వన్డే, టీ20 క్రికెట్ లా ఆడేస్తూ సిక్సర్ల మోత మోగిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లలో రిషబ్ పంత్ టాప్ లో ఉన్నారు.
టెస్ట్ క్రికెట్ 2025లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్ 6 ప్లేయర్లు ఎవరు?
టెస్ట్ క్రికెట్ 2025 లో ఇప్పటివరకు పలువురు ప్లేయర్లు అద్భుతమైన ఆటతో సిక్సర్ల వర్షం కురిపిస్తున్నారు. టెస్టు క్రికెట్ ను టీ20ల ఆడుతూ బౌలర్లకు చెమటలు పట్టిస్తున్నారు. ముఖ్యంగా భారత వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించేందుకు మరో రెండు సిక్సుల దూరంలో ఉన్నాడు. ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్ 6 ఆటగాళ్ల జాబితాలో పంత్ టాప్ లో ఉన్నారు.
27
1. రిషబ్ పంత్
భారత వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ 2025లో టెస్ట్ క్రికెట్‌లో ఇప్పటి వరకు 20 సిక్సర్లు బాదాడు. ఇది ఈ ఏడాది టెస్ట్ ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్ గా టాప్ లో కొనసాగుతున్నాడు.
మరో రెండు సిక్సర్లు బాదితే భారత వికెట్ కీపర్‌గా అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్ గా పంత్ రికార్డు సృష్టించనున్నాడు. మంచి ఫామ్‌లో ఉన్న పంత్.. ఇంగ్లాండ్ తో మాంచేస్టర్ లో జరిగే టెస్టులో ఈ రికార్డును బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది.
37
2. శుభ్‌మన్ గిల్
భారత టెస్ట్ జట్టుకు తొలిసారిగా శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అద్భుతమైన ఆటతో ఇంగ్లాండ్ పై పరుగులు వర్షం కురిపిస్తున్నాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇప్పటి వరకు 12 సిక్సర్లు బాదాడు. బలమైన బ్యాటింగ్‌తో పాటు అతని నాయకత్వం కూడా ప్రశంసలందుకుంటోంది. ఈ సిరీస్‌ను గెలిపించి చరిత్ర సృష్టించాలని గిల్ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాడు.
ఇంగ్లాండ్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ జేమీ స్మిత్ అద్భుతంగా రాణిస్తున్నాడు. మంచి ఫామ్ లో ఉన్న అతను 2025లో టెస్ట్ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శనతో బౌండరీల మోత మోగిస్తున్నాడు.
ఇప్పటి వరకు 11 సిక్సర్లు బాదిన స్మిత్, ఇంగ్లాండ్ జట్టుకు కీలక ఆటగాడిగా నిలిచాడు. భారత్ తో జరుగుతున్న సిరీస్‌లో అతని కంటిన్యూ హిట్టింగ్ ఆ జట్టుకు బలంగా మారింది.
57
4. షమర్ జోసెఫ్
వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షమర్ జోసెఫ్ ప్రధాన బౌలర్ అయినప్పటికీ బ్యాటింగ్ చేసే ఛాన్స్ వస్తే బౌండరీలతో అదరగొడతాడు. 2025లో టెస్ట్ క్రికెట్‌లో బ్యాటింగ్‌లోనూ సత్తా చాటుతున్నాడు. 6 ఇన్నింగ్స్‌లలో 9 సిక్సర్లు బాదిన జోసెఫ్.. టెస్ట్ ఫార్మాట్‌లో రఫ్ హిట్టింగ్ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించాడు. వెస్టిండీస్‌కు ఉన్న బ్యాటింగ్ లోటుని కొంతమేర భర్తీ చేస్తూ అద్భుతమైన ఆటతీరు కనబరుస్తున్నాడు. బౌలర్ అయివుండి బ్యాట్ తోనూ రఫ్ఫాడిస్తున్నాడు.
67
5. లువాన్ డ్రే-ప్రిటోరియస్
దక్షిణాఫ్రికా యువ క్రికెటర్ సంచలనం లువాన్ డ్రే-ప్రిటోరియస్. అద్భుతమైన ఆటతో ఆకట్టుకుంటూ ప్రశంసలు అందుకుంటున్నాడు. అతను 2025లో ఇప్పటివరకు కేవలం మూడు టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లోనే 7 సిక్సర్లు బాదాడు. జింబాబ్వేతో జరిగిన డెబ్యుట్ మ్యాచ్‌లోనే సెంచరీ కొట్టి సంచలనం రేపాడు. దక్షిణాఫ్రికా తరఫున డెబ్యుట్‌లో సెంచరీ కొట్టిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. అతని ధైర్యమైన ఆటతీరు యువతలో స్పూర్తిని నింపుతోంది.
77
6. హ్యారీ బ్రూక్
ఇంగ్లాండ్ యంగ్ బ్యాట్స్‌మన్ హ్యారీ బ్రూక్ ఈ ఏడాది టెస్ట్ క్రికెట్‌లో ఇప్పటి వరకు 7 సిక్సర్లు బాదాడు. ఇండియాతో జరిగిన రెండో టెస్ట్‌లో భారీ సెంచరీ కొట్టాడు. ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓడినప్పటికీ, తన ఇన్నింగ్స్‌తో ప్రశంసలు పొందాడు. అతని బ్యాటింగ్ శైలి, పెద్ద షాట్లు ఆడుతూ తడబడకుండా పరుగులు రాబట్టడంతో గుర్తింపు పొందాడు. ధనాధన్ ఇన్నింగ్స్ లను ఆడగల ప్లేయర్.
2025లో టెస్ట్ క్రికెట్ సీజన్ ఇప్పటి వరకు బ్యాట్స్‌మన్‌లు చూపిన ధైర్యవంతమైన ఆటతీరు ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా రిషబ్ పంత్ మరికొన్ని సిక్సర్లు బాది చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాడు. టెస్ట్ క్రికెట్‌ను ఆసక్తికరంగా మలుస్తూ, వీరు చూపుతున్న ఆటతీరు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తోంది.