Top 5 Teams With Most Runs: ఒకే టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 జట్లలో టీమిండియా కూడా ఉంది. భారత జట్టు 2025లో ఇంగ్లాండ్ తో ఆడిన సిరీస్ లో 3809 పరుగులు చేసింది.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో కొన్ని జట్లు ఒకే సిరీస్‌లో అత్యద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనలతో చరిత్రను తిరగ రాశాయి. ఆసీస్, ఇంగ్లాండ్, భారత్ జట్లు మైదానంలో తమ నైపుణ్యాన్ని పూర్తి స్థాయిలో చూపించి పరుగుల వర్షం కురిపించాయి. తాజాగా భారత్ 2025లో ఇంగ్లాండ్ తో జరిగిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో 3809 పరుగులు చేసి ఈ జాబితాలో రెండవ స్థానాన్ని దక్కించుకుంది.
DID YOU KNOW ?
ఒక టెస్టు సిరీస్ లో అత్యధిక పరుగులు కొట్టిన 2వ ప్లేయర్ శుభ్ మన్ గిల్
ఇండియా-ఇంగ్లాండ్ సిరీస్‌లో గిల్ 754 రన్స్ తో రెండవ స్థానంలో ఉన్నారు. మొదటి స్థానంలో సునీల్ గవాస్కర్ ఉన్నారు. 1971లో వెస్టిండీస్‌పై 774 పరుగులు చేశారు. అలాగే, గిల్ భారత కెప్టెన్‌గా ఒకే సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ కూడా.
25
1. 1989 యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా
1989లో ఇంగ్లాండ్ లో జరిగిన యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు మొత్తం 3877 పరుగులు చేసింది. ఆరు టెస్టులున్న ఈ సిరీస్‌లో ఆసీస్ 57.86 సగటుతో ఈ పరుగులు చేసింది.
ఈ అద్భుత ప్రదర్శన క్రికెట్ చరిత్రలో ఒక బిగ్ మార్క్‌గా నిలిచింది. ఇంగ్లాండ్ 2025 సిరీస్ లో భారత్‌కు ఈసారి ఆరో టెస్ట్ ఆడే అవకాశం లభించుంటే, ఈ రికార్డును అధిగమించే అవకాశం ఉండేదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
35
2. 2025 అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భారత్ రికార్డ్
భారత జట్టు, ఇంగ్లాండ్ తో జరిగిన 2025 అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో ఐదు టెస్టులలో మొత్తం 3809 పరుగులు చేసింది. ఇది భారత్‌కు టెస్ట్ సిరీస్ లలో అత్యధిక పరుగుల రికార్డు. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో భారత బ్యాటింగ్ యూనిట్ అద్బుతమైన ఫామ్‌ను ప్రదర్శించింది. సగటు 42.32 ఉండగా, భారత టాప్ ఆర్డర్ నుంచి మిడ్‌లైన్ వరకు ఆటగాళ్లు సమిష్టిగా రాణించారు. కొన్ని ధనాధన్ ఇన్నింగ్స్ లు వచ్చాయి.
ఇంగ్లాండ్ 1928-29లో ఆస్ట్రేలియాలో జరిగిన యాషెస్ సిరీస్‌లో 3757 పరుగులు చేసి మూడవ స్థానంలో నిలిచింది. ఐదు టెస్టుల్లో 43.18 సగటుతో బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్, డాన్ బ్రాడ్‌మన్ వంటి దిగ్గజాన్ని ఎదుర్కొంటూ విభిన్న రీతిలో తమ స్థాయిని చూపించింది. ఆ సిరీస్‌లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ పరంగా గొప్ప రికార్డు అందుకుంది.
55
4. 1993, 1924-25 యాషెస్ సిరీస్‌లు - ఆసీస్
ఆస్ట్రేలియా జట్టు 1993 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ పై 3641 పరుగులు చేసి నాల్గవ స్థానంలో నిలిచింది. ఆరుమ్యాచ్‌ల సిరీస్‌లో 51.28 సగటుతో రాణించిన ఆ జట్టు 4-1 తేడాతో యాషెస్‌ను గెలుచుకుంది. ఈ విజయాన్ని అలన్ బోర్డర్ నేతృత్వంలో సాధించారు.
ఇక 1924-25 యాషెస్ సిరీస్‌లో ఆసీస్ మరోసారి మెరిసి, ఐదు టెస్టుల్లో 3630 పరుగులు చేసి ఐదవ స్థానాన్ని దక్కించుకుంది. సగటు 36.30తో ఆడిన ఆ జట్టు ఆ సిరీస్‌ను 4-1 తేడాతో గెలుచుకుంది.
ఈ రికార్డులు టెస్ట్ క్రికెట్‌లో జట్ల బ్యాటింగ్ స్థాయిని, సుదీర్ఘ ఫార్మాట్‌లో ప్రదర్శించే సహనం, స్థిరతను చాటుతున్నాయి. భారత జట్టు ఇటీవలి సిరీస్‌లో చేసిన 3809 పరుగులు, క్రికెట్ చరిత్రలో భారత బ్యాటింగ్ ప్రభావాన్ని చూపించే చిహ్నంగా నిలిచింది.