IPL లో గత 3 సీజన్లలో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్ 5 ప్లేయర్లు వీరే

Published : Jun 17, 2025, 07:55 PM IST

Top 5 IPL players with most sixes : ఐపీఎల్ లో గత 3 సీజన్లలో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్ 5 ఆటగాళ్లలో నికోలస్ పూరన్ టాప్ లో ఉన్నాడు. ఈ లిస్టులో ఉన్న టాప్ 5 ప్లేయర్లు ఎవరో ఇప్పుడు గెలుసుకుందాం.

PREV
16
ఐపీఎల్ లో అత్యధిక సిక్సర్ల రికార్డు

IPL most sixes, top IPL batsmen: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో ఫోర్ల, సిక్సర్ల వర్షం కురిపించిన ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. ఐపీఎల్ లో చాలా వరకు పిచ్‌లు స్కోరింగ్‌కు అనుకూలంగా ఉండటంతో, ఆటగాళ్లు బంతిని ఆకాశంలోకి లేచేలా కొట్టేందుకు వెనుకాడరు. IPL చివరి మూడు సీజన్లను పరిశీలిస్తే, కొంతమంది బ్యాట్స్‌మెన్ సిక్సర్లతో క్రికెట్ లవర్స్ కు మంచి వినోదాన్ని పంచారు.

26
1. నికోలస్ పూరన్ (Nicholas Pooran)

వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్నాడు. గత మూడు సీజన్లలో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్ల లిస్టులో టాప్ లో ఉన్నాడు. 

నికోలస్ పూరన్ 2023, 2024, 2025 సీజన్లలో మొత్తం 102 సిక్సర్లు కొట్టి ఈ ఘనతను సాధించాడు. ఆడే ఫస్ట్ బాల్ నుంచే దాడిని మొదలు పెట్టే పూరన్.. 2025 సీజన్ లో కూడా పరుగుల వరద పారించాడు. 

36
2. హెన్రిక్ క్లాసెన్ (Heinrich Klaasen)

దక్షిణాఫ్రికా స్టారా్ బ్యాటర్ హెన్రిక్ క్లాసెన్ ఈ లిస్టులో రెండో స్థానంలో నిలిచాడు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ తరఫున ఆడే క్లాసెన్.. గత మూడేళ్లలో మొత్తం 88 సిక్సర్లు బాదాడు. క్లాసెన్ మిడిలార్డర్‌లో ధాటిగా ఆడే ఆటగాడిగా గుర్తింపు పొందాడు.

46
3. సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)

స్టార్ బ్యాటర్, టీమిండియా మిస్టర్ 360 డిగ్రీ బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచిన సూర్యకుమార్ యాదవ్..  ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. అతను 2023 నుంచి 2025 వరకు ఐపీఎల్ లో 84 సిక్సర్లు కొట్టాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఆడే సూర్య కుమార్.. తన సూపర్ ఇన్నింగ్స్ లతో ఆ జట్టుకు అద్భుతమైన విజయాలు అందించాడు.

56
4. శివమ్ దూబే (Shivam Dube)

మరో భారత ఆటగాడు శివమ్ దూబే కూడా సూర్యకుమార్‌తో సమానంగా 84 సిక్సర్లు కొట్టి నాల్గో స్థానంలో నిలిచాడు. అతని బ్యాటింగ్ స్టైల్ అదిరిపోయేలా ఉంటుంది. స్పిన్నర్లను ఎదుర్కొనడంలో అతను స్పెషలిస్ట్ బ్యాటర్. తన బ్యాట్ తో ఎప్పుడైనా  మ్యాచ్ స్వరూపాన్ని మార్చే దుబే ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు.

66
5. అభిషేక్ శర్మ (Abhishek Sharma)

టీమిండియా యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ కూడా గత మూడు ఐపీఎల్ సీజన్లలో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్ 5 ప్లేయర్ల లిస్టులో చోటుదక్కించుకున్నాడు. ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్న అభిషేక్ శర్మ.. గత 3 ఐపీఎల్ సీజన్లలో మొత్తం 76 సిక్సర్లు కొట్టాడు. అతను మొదటి బంతి నుంచే అటాక్ మోడ్‌లోకి వెళ్లిపోయే బ్యాట్స్‌మెన్ గుర్తింపు పొందాడు.

Read more Photos on
click me!

Recommended Stories