టెస్టు క్రికెట్ లో అత్య‌ధిక సార్లు 5 వికెట్లు తీసిన టాప్-5 భార‌త బౌల‌ర్లు వీరే !

First Published | Feb 29, 2024, 5:11 PM IST

Top-5 Indian bowlers: అంత‌ర్జాతీయ క్రికెట్ కు భార‌త్ అద్భుత‌మైన ప్లేయర్లను అందించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుతాలు చేసిన భార‌త ప్లేయ‌ర్లు చాలా మంది ఉన్నారు. ఇక బౌలింగ్ విష‌యానికి వ‌స్తే అత్య‌ధిక సార్లు 5 వికెట్లు తీసిన టాప్-5 బౌల‌ర్ల‌లో అనిల్ కుంబ్లే, ర‌విచంద్ర‌న్ అశ్విన్ లు స‌మంగా నిలిచాడు. టెస్టు క్రికెట్ లో అత్య‌ధిక సార్లు 5 వికెట్లు తీసిన ఇండియ‌న్ బౌల‌ర్ల జాబితా ఇలా ఉంది.. 

Ravichandran Ashwin, anil kumble

ర‌విచంద్ర‌న్ అశ్విన్ : 

భార‌త స్టార్ బౌల‌ర్ల‌లో ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఒక‌రు. అశ్విన్ ఇప్ప‌టివ‌ర‌కు త‌న టెస్టు క్రికెట్ కెరీర్ లో 35 సార్లు 5 వికెట్లు తీసుకున్నాడు. దీంతో టెస్టు క్రికెట్‌లో అత్యధిక 5 వికెట్లు తీసిన భారత ఆటగాడిగా అనిల్ కుంబ్లేను సమం చేశాడు. దీని కోసం 187 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు.

Ashwin

అనిల్ కుంబ్లే : 

భార‌త టెస్టు క్రికెట్ లో అత్య‌ధిక వికెట్లు తీసుకున్న దిగ్గ‌జ బౌల‌ర్ అనిల్ కుంబ్లే. ఒంటిచేత్తో అనేక మ్యాచ్ ల‌ను గెలిపించారు. అనిల్ కుంబ్లే టెస్టుల్లో 35 సార్లు ఐదు వికెట్లు తీసుకుని చ‌రిత్ర సృష్టించాడు.

Latest Videos


Harbhajan Singh

హ‌ర్భజన్ సింగ్ : 

అశ్విన్ కంటే ముందు భారత అత్యుత్తమ ఆఫ్ స్పినీర్, హర్భజన్ సింగ్ 103 మ్యాచ్‌లలో (190 ఇన్నింగ్స్‌లు) 25 సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు. 

క‌పిల్ దేవ్ : 

భార‌తదేశపు గొప్ప ఆల్ రౌండర్ క‌పిల్ దేవ్. కపిల్ దేవ్ ఒకప్పుడు అత్యధిక ఐదు వికెట్లు తీసిన రికార్డును కలిగి ఉన్నాడు. క‌పిల్ త‌న టెస్టు కెరీర్ లో 23 సార్లు 5 వికెట్లు తీసుకున్నాడు. 131 మ్యాచ్‌లలో (227 ఇన్నింగ్స్) దీనిని సాధించాడు. 

బీఎస్ చంద్ర‌శేఖ‌ర్ 

భారతదేశ ప్రసిద్ధ స్పిన్-బౌలింగ్ క్వార్టెట్‌లో బీఎస్ చంద్రశేఖర్ ఒక‌రు. ఆయ‌న త‌న కెరీర్ లో 58 మ్యాచ్‌లలో 16 సార్లు 5 వికెట్లు తీసుకున్నారు. 97 ఇన్నింగ్స్‌లలో దీనిని సాధించాడు. 

click me!