ఇషాన్ కిషన్-శ్రేయాస్ అయ్యర్ లు బీసీసీఐ కాంట్రాక్టులను ఎందుకు కోల్పోయారు?

First Published | Feb 29, 2024, 12:12 PM IST

Why did Ishan-Iyer lose BCCI contracts: బీసీసీఐ వార్షిక కాంట్రాక్టుల‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జ‌స్ప్రీత్ బుమ్రా, ర‌వీంద్ర‌ జడేజాలు ఏ+ కేటగిరీలో కొనసాగ‌నున్నారు. అయితే, ఇద్ద‌రు స్టార్ ప్లేయ‌ర్లు ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌లను ప‌క్క‌నపెట్టింది. ఎందుకు ఇద్ద‌రు ప్లేయ‌ర్లు బీసీసీఐ కాంట్రాక్టుల‌ను కోల్పోయారు? 
 

Shreyas Iyer, Ishan Kishan,

Why did Ishan-Iyer lose BCCI contracts: భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండలి  (బీసీసీఐ) రాబోయే సీజ‌న్ల కోసం కాంట్రాక్టుల వివ‌రాలు వెల్ల‌డించింది. 2023-24 సీజన్ అంటే అక్టోబర్ 1, 2023 నుంచి సెప్టెంబర్ 30, 2024 వరకు టీమిండియా (సీనియర్ మెన్) వార్షిక ప్లేయర్ కాంట్రాక్ట్‌లను బీసీసీఐ ప్రకటించింది. అయితే, స్టార్ ప్లేయ‌ర్లు ఇషాన్ కిష‌న్, శ్రేయాస్ అయ్య‌ర్లు బిగ్ షాక్ త‌గిలింది. ఈ ఇద్ద‌రు ప్లేయ‌ర్లు త‌మ కాంట్రాక్టుల‌ను కోల్పోయారు. ఎందుకు ఇషాన్, శ్రేయాస్ త‌మ కాంట్రాక్టుల‌ను కోల్పోయారు? అనేది క్రికెట్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

BCCI , Ishan Kishan

దక్షిణాఫ్రికా పర్యటనలో వ్యక్తిగత కారణాలతో క్రికెట్ నుంచి విరామం తీసుకున్న ఇషాన్ కిషన్ ఈ వారం ప్రారంభంలో డీవై పాటిల్ టీ20 టోర్నమెంట్లో మాత్రమే బరిలోకి దిగాడు. ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్ రెండో అర్ధభాగానికి ఎంపిక కావడానికి ముందు అయ్యర్ ఫిట్ గా ఉన్నాడని ఎన్సీఏ స్పష్టం చేసింది. అయితే, అత‌ను అనారోగ్య కార‌ణాల‌ను చూపుతూ టీమిండియాకు, దేవ‌వాళీ క్రికెట్ కు అందుబాటులో ఉండ‌లేదు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని సమయాల్లో అథ్లెట్లందరూ దేశవాళీ క్రికెట్ లో పాల్గొనడానికి ప్రాధాన్యమివ్వాలని బీసీసీఐ పేర్కొంది. ఈ క్ర‌మంలోనే ప‌లువురు ప్లేయ‌ర్ల‌కు హెచ్చ‌రిక‌లు చేసింది. 


Jay Shah warned Ishan Kishan

దేశవాళీ క్రికెట్, జాతీయ క్రికెట్ కంటే ఐపీఎల్ కు ఎక్కువ‌ ప్రాధాన్యం ఇవ్వొద్దని బీసీసీఐ కార్యదర్శి జై షా రెండు వారాల క్రితం సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్లకు లేఖ రాశారు. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని లేఖలో హెచ్చరించారు. దీనికి ముందు, భార‌త్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ క్ర‌మంలో టీమిండియా ప్ర‌ధాన కోచ్ ఇషాన్ కిష‌న్ దేశ‌వాళీ క్రికెట్ లో ఆడిన త‌ర్వాత జ‌ట్టులోకి వ‌స్తాడ‌ని చెప్పాడు. అలాగే, త‌న అందుబాటులో ఉండే విష‌యం గురించిన వివ‌రాలు కూడా అందించ‌లేద‌ని తెలిపాడు. బీసీసీఐ సైతం ఇషాన్ కిష‌న్ ను దేశవాళీ క్రికెట్ లో ఆడాల‌ని సూచించింది. అయితే, ఇషాన్ వీటిని పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోవ‌డంతో బీసీసీఐకి కోపం తెప్పించింది. 

ఈ క్ర‌మంలోనే మ‌రోసారి వార్నింగ్ ఇస్తూ లేఖ‌లు పంపింది. జైషా నేరుగా వారి గురించి ప్ర‌స్తావించారు. ఇంగ్లాండ్ సిరీస్ కు సిద్ధంగా లేన‌ని చెప్ప‌డం, ద‌క్షిణాఫ్రికా టూర్ లో మధ్య‌లోనే వ‌చ్చి బీసీసీఐ స‌మాచారం ఇవ్వ‌కుండా ఇత‌ర పార్టీల‌లో పాలుపంచుకోవ‌డం వంటివి  చేయ‌డంతో బీసీసీఐ ఇప్పుడు ఇషాన్ కు బిగ్ షాక్ ఇచ్చింది. ఇషాన్ కిష‌న్ అందుబాటులో లేక‌పోవ‌డంతో ధృవ్ జురెల్ టీమిండియా త‌ర‌ఫున అరంగేట్రం చేశాడు.

Ishan Kishan

శ్రేయాస్ అయ్య‌ర్ కూడా బీసీసీఐ సూచ‌న‌లు పాటించ‌కుండా దేశ‌వాళీ క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. దీనికి త‌న ఫిట్ నెస్, ఆరోగ్య ప‌రిస్థితుల‌ను ప్ర‌స్తావించాడు. కానీ, అయ్యర్ గైర్హాజరుకు ఎన్సీఏ చేసిన ఫిట్ నెస్ అంచనాతో విభేదాలు తలెత్తినట్లు స‌మాచారం. రెండో టెస్టు అనంతరం సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు అయ్యర్ వెన్నులో నొప్పి, అసౌకర్యం వ్యక్తం చేశాడని, అయితే వైద్య సిబ్బంది అతడికి ఎలాంటి గాయం కాలేదని తెలిపిన‌ట్టు ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో క‌థ‌నం పేర్కొంది. దీంతో మూడు, నాలుగో టెస్టులకు అయ్యర్ను పక్కనపెట్టినప్పుడు బీసీసీఐ ఎలాంటి కారణం చెప్పలేదు. వచ్చే వారం జరిగే రంజీ ట్రోఫీ మ్యాచ్ లో అతను ముంబైకి రాకపోవడంతో వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు ముంబై క్రికెట్ అసోసియేషన్ వర్గాలు తెలిపాయి. దీంతో కావాల‌నే ఇషాన్ ఆట‌కు దూరంగా ఉన్నాడని బీసీసీఐ అగ్రహం వ్య‌క్తం చేసింది.

మ‌రో అంశం ఈ ఇద్ద‌రు ప్లేయ‌ర్లు దేశ‌వాళీ, టీమిండియా మ్యాచ్ ల‌కు దూరంగా ఉంటూ రాబోయే ఐపీఎల్ కు సిద్ధం కావ‌డం కూడా బీసీసీఐ కి ఆగ్ర‌హం తెప్పించింది. సిరీస్ మ‌ధ్య‌లోనే త‌ప్పుకున్న ఇషాన్ కిష‌న్.. ముంబై ఇండియాన్స్ ఐపీఎల్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో కలిసి బరోడాలో శిక్షణకు వెళ్లాడు. అలాగే, శ్రేయాస్ అయ్యర్ కోల్ కతా నైట్ రైడర్స్ ప్రీ-సీజన్ క్యాంప్ లో ఉన్నాడని మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. ఇలా మొత్తంగా దేశవాళీ క్రికెట్ ను నిర్ల‌క్ష్యం చేయ‌డంతో పాటు బీసీసీఐ సూచ‌న‌లు పాటించ‌క‌పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ల‌ను మ‌రోసారి కాంట్రాక్టుల ర‌ద్దు రూపంలో పంపింది.

Latest Videos

click me!