PKL , Haryana Steelers, Jaipur Pink Panthers, PKL , PKL 10, Pro Kabaddi League 10,
Pro Kabaddi League 10 : ప్రొ కబడ్డీ లీగ్ 10వ సీజన్ ఫైనల్ దశకు చేరుకుంది. హైదరాబాద్ వేదికగా జరిగిన పీకేఎల్ సీజన్ 10లో రెండో సెమీఫైనలో హర్యానా స్టీలర్స్ 4 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ (31-27)పై విజయం సాధించింది. తొలి సెమీఫైనల్‌లో పుణెరి పల్టాన్, పాట్నా పైరేట్స్, రెండో సెమీస్‌లో జైపూర్ పింక్ పాంథర్స్, హర్యానా స్టీలర్స్ తలపడ్డాయి.
PKL,Haryana Steelers,Jaipur Pink Panthers,PKL,PKL10,Pro Kabaddi League 10,
హైదరాబాద్‌లో జరిగిన తొలి సెమీస్‌లో 3 సార్లు చాంపియన్ పాట్నా పైరేట్స్, పుణెరి పల్టాన్ తలపడ్డాయి. ఇందులో ఆరంభం నుంచి అద్భుతంగా ఆడిన పుణెరి పల్డాన్ జట్టు ఆటగాళ్లు వరుస పాయింట్లు సాధించి జట్టును ముందుకు నడిపించారు. పుణెరి పల్టాన్ తరఫున అష్లామ్ ముస్తాబా, అభినేష్ నటరాజన్, సంగత్ సవాద్, మోహిత్ ఖయాత్, పంకజ్ మోహిత్ పాయింట్లు సాధించారు. చివరకు పుణెరి పల్టాన్‌కు 37 పాయింట్లు లభించాయి.
Haryana Steelers,Jaipur Pink Panthers,PKL,PKL10,Pro Kabaddi League 10, PKL,
అలాగే, సచిన్, బాబు, మంజీత్, సుధాకర్, సబ్‌స్టిట్యూట్ ఆటగాడు సందీప్ కుమార్‌లు వరుసగా పాయింట్లు సాధించారు. చివరకు పాట్నా పైరేట్స్ 21 పాయింట్లు మాత్రమే సాధించింది. దీంతో పుణెరి పల్డాన్ 16 పాయింట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.2వ సెమీఫైనల్‌లో జైపూర్ పింక్ పాంథర్స్, హర్యానా స్టీలర్స్ తలపడ్డాయి. ఇందులో హర్యానా స్టీలర్స్ 4 పాయింట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.
Haryana Steelers,Jaipur Pink Panthers,PKL,PKL10,Pro Kabaddi League 10, PKL,
జైపూర్ ఆడిన 22 మ్యాచ్‌ల్లో 16 మ్యాచ్‌లు గెలిచి నేరుగా సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది. అయితే హర్యానా స్టీలర్స్ 22 మ్యాచ్‌ల్లో 13 విజయాలతో సహా 70 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచింది. ఎలిమినేటర్‌లో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించి సెమీఫైనల్‌కు చేరుకుంది. ఇందులో జైపూర్ జట్టును ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. మార్చి 1న పుణెరి పల్టాన్, హర్యానా స్టీలర్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
Haryana Steelers,Jaipur Pink Panthers,PKL,PKL10,Pro Kabaddi League 10, PKL,
ఫైనల్లో హరియాణా స్టీలర్స్, పుణెరి పల్టాన్ జట్లు తలపడనుండటంతో ఈసారి కొత్త పీకేఎల్ ఛాంపియన్ బరిలోకి దిగనుంది. ఆరో సీజన్ తర్వాత టాప్-2లో లేని జట్టు (లీగ్ దశ ముగిసే సమయానికి) ఫైనల్లో ఆడటం ఇదే తొలిసారి.