సచిన్ టెండూల్కర్
టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. టెండూల్కర్ తన కెరీర్‌లో 15,921 పరుగులు చేశాడు. అయితే, రెడ్ బాల్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 యాక్టివ్ బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో విరాట్ కోహ్లీ ఒక్కడే ఉన్నాడు. జాబితాలో ఇంకెవరెవరు ఉన్నారో చూద్దాం...
జో రూట్
1. ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ జో రూట్ రెడ్ బాల్ క్రికెట్‌లో అద్భుతమైన ఆటతో పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ 33 ఏళ్ల క్రికెటర్ ప్రస్తుతం ఈ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ 32 సెంచరీలతో సహా 12,131 పరుగులు చేశాడు. 10,000 పరుగుల క్లబ్‌లోకి ప్రవేశించిన ఏకైక యాక్టివ్-క్రికెటర్ ఇతడే. అత్యధిక టెస్టు క్రికెట్ పరుగుల సచిన్ రికార్డును బద్దలు కొడతాడని చాలామంది భావిస్తున్నారు.
స్టీవ్ స్మిత్
2. ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్ టెస్ట్ క్రికెట్‌లో 32 సెంచరీలతో సహా 9,685 పరుగులు చేశాడు. అద్భుతమైన బ్యాటింగ్ శైలి ఉన్న ఈ 35 ఏళ్ల క్రికెటర్ ప్రస్తుతం ఈ జాబితాలో ఉన్న ఆటగాళ్లలో అత్యధికంగా 57 సగటు కలిగి ఉన్నాడు.
విరాట్ కోహ్లీ
3. విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరు. ఇప్పటికే అనేక రికార్డులను బద్దలు కొట్టిన ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 యాక్టివ్ క్రికెటర్ల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడు. ఈ 35 ఏళ్ల క్రికెటర్ టెస్టుల్లో 29 సెంచరీలతో సహా 8,848 పరుగులు చేశాడు. అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 254* పరుగులు. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ఫిట్‌నెస్ ఉన్న ఆటగాళ్లలో ఇతను ఒకడు. మరో 3-4 సంవత్సరాలు ఈ ఫార్మాట్‌ను ఆడే అవకాశం ఉంది.
కేన్ విలియమ్సన్
4. న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ అత్యంత కాంపాక్ట్ బ్యాటింగ్ స్టాన్స్‌ని కలిగి ఉన్నాడని చెప్పవచ్చు. ఈ 34 ఏళ్ల క్రికెటర్ న్యూజిలాండ్ ప్లేయర్లలో అత్యుత్తమ సమకాలీన బ్యాట్స్‌మన్‌లలో ఒకరు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ ఇప్పటివరకు టెస్టు క్రికెట్ లో 32 సెంచరీలతో సహా 8748 పరుగులు చేశాడు.
ఏంజెలో మాథ్యూస్
5. శ్రీలంకకు చెందిన ఏంజెలో మాథ్యూస్ ప్రస్తుతం టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 యాక్టివ్ బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో 5వ స్థానంలో ఉన్నాడు. ఈ 37 ఏళ్ల క్రికెటర్ ఇప్పటివరకు 7,608 పరుగులు చేశాడు. ఈ ఆల్ రౌండర్ తన క్రికెట్ కెరీర్‌లో చివరి దశలో ఉన్నాడని చెప్పవచ్చు.