కేఎల్ రాహుల్ టీమ్ మాస్ట‌ర్ ప్లాన్.. లెజెండ‌రీ బౌల‌ర్ ను రంగంలోకి దింపిన ల‌క్నో సూపర్ జెయింట్స్

First Published | Aug 28, 2024, 4:43 PM IST

IPL 2025 - lsg : ఐపీఎల్ 2025 కోసం వివిధ ఫ్రాంఛైలు జ‌ట్ల‌లో మార్పులు చేసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలోనే మాస్టర్ ప్లాన్ తో  కేఎల్ రాహుల్ టీమ్, లక్నో సూపర్ జెయింట్స్ ఒక లెజెండ‌రీ బౌల‌ర్ ను రంగంలోకి దింపింది. 
 

Zaheer Khan, KL Rahul, LSG, IPL 2025,

IPL 2025 - lsg : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ( ఐపిఎల్ 2025) కి ముందు మెగా వేలం నిర్వ‌హించ‌నున్నారు. ఈ క్ర‌మంలోనే 10 ఐపీఎల్ జ‌ట్ల‌లో భారీ మార్పులు మొద‌ల‌య్యాయి. రాబోయే ఐపీఎల్ ఎడిష‌న్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) ట్రోఫీ గెల‌వ‌డ‌మే ల‌క్ష్యంగా ఇప్ప‌టినుంచే వ్యూహాలు ర‌చిస్తోంది. త‌మ మాస్ట‌ర్ ప్లాన్ లో భాగంగా ఒక లెజెండ‌రీ బౌల‌ర్ ను రంగంలోకి దింపింది. 

KL Rahul , India,

ఐపీఎల్ 2025 సీజ‌న్ కోసం భారత మాజీ క్రికెటర్, స్టార్ బౌల‌ర్ జహీర్ ఖాన్‌ను తమ మెంటార్‌గా నియమించింది లక్నో సూపర్ జెయింట్స్. ఇంత‌కుముందు గౌతమ్ గంభీర్ ఐపీఎల్ 2023 వ‌ర‌కు ల‌క్నో టీమ్ కు మెంటర్‌గా ఉన్నాడు. గంభీర్ అదే హోదాలో కోల్‌కతా నైట్ రైడర్స్‌లో చేరి ఐపీఎల్ 2024 లో ఆ జ‌ట్టును ఛాంపియ‌న్ గా నిల‌బెట్టాడు. ఇప్పుడు టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్య‌త‌లు స్వీకరించాడు.


Zaheer Khan, LSG, IPL 2025,

జ‌హీర్ ఖాన్ ను త‌మ మెంట‌ర్ గా నియామ‌కం గురించి తెల‌ప‌డానికి ఎల్‌ఎస్జీ యజమాని సంజీవ్ గోయెంకా కోల్‌కతాలో ఈ రోజు ప్ర‌త‌యేక స‌మావేశం నిర్వ‌హించారు. జహీర్ ఖాన్ కూడా ఈ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యాడు.

రాబోయే ఐపీఎల్ 2025 సీజ‌న్ ముందు జ‌రిగే మెగా వేలంలో భారత మాజీ క్రికెటర్ కూడా కీలక పాత్ర పోషించవచ్చు. "ఎల్‌ఎస్జీని తదుపరి స్థాయికి తీసుకువెళ్లేందుకు అవసరమైన ప్రక్రియ ఉండేలా చూసుకుంటాను. వచ్చే సీజన్ ప్రత్యేకంగా ఉంటుంది" అని జహీర్ పేర్కొన్నాడు.

దేశంలోని ప్రతిభను గుర్తించడంలో సహాయపడే అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లకు చాలా ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్న నిబంధ‌న‌ల‌ను కొనసాగించాలని జహీర్ అభిప్రాయపడ్డాడు. "నేను ఇంపాక్ట్ ప్లేయర్ నియమానికి మద్దతు ఇస్తున్నాను, ఎందుకంటే ఇది అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లకు చాలా అవకాశాలను ఇస్తోంది" అని జహీర్ తెలిపాడు. 

Zaheer Khan,Rohit Sharma

జహీర్ భార‌త స్టార్ బౌల‌ర్. ఒంటిచేత్తో భార‌త్ కు అనేక విజ‌యాలు అందించాడు. 2018 నుండి 2022 వరకు ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో మొదట క్రికెట్ డైరెక్టర్‌గా, త‌ర్వాత‌ గ్లోబల్ డెవలప్‌మెంట్ హెడ్‌గా ఉన్నాడు. అతను ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ (ఢిల్లీ డేర్‌డెవిల్స్) మూడు జట్ల త‌ర‌ఫున ఐపీఎల్ లో ఆడాడు. మొత్తం 100 మ్యాచ్‌లలో 7.58 ఎకానమీతో 102 వికెట్లు తీశాడు.

Latest Videos

click me!