టెస్టు క్రికెట్‌లో అత్యధిక విజయాలు సాధించిన టాప్-10 జట్లు

First Published | Oct 11, 2024, 6:50 PM IST

Most Wins in Test Cricket : మొదటి అధికారిక టెస్ట్ మ్యాచ్ 1877లో ఎంసీజీలో ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య జరిగింది. ప్ర‌స్తుతం 12 జ‌ట్లు టెస్టు క్రికెట్ ఫార్మాట్ ఆడుతున్నాయి. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఇప్పటివరకు అత్యధిక మ్యాచ్‌లు ఆడాయి. టెస్టు క్రికెట్ లో అత్య‌ధిక మ్యాచ్ లు గెలిచిన టాప్-10 జ‌ట్లు ఏవి? ఆ వివ‌రాలు మీ కోసం. 
 

Rohit Sharma, Virat Kohli,

10. జింబాబ్వే - 13

జింబాబ్వే 1983లో  టెస్టు క్రికెట్ లోకి అడుగుపెట్టింది. 1992లో హరారేలో భారత్‌తో తమ మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఈ దేశం టెస్టు మ్యాచ్ ల‌ను రెగ్యులర్‌గా ఆడటం లేదు. అయితే, ఇప్పటి వరకు మొత్తం 118 మ్యాచ్‌లు ఆడిన జింబాబ్వే 13 విజ‌యాలు అందుకుంది. 76 మ్యాచ్‌లలో ఓడిపోగా, 29 మ్యాచ్ లు డ్రాగా ముగిశాయి.

9. బంగ్లాదేశ్ - 21

2000లో బంగ్లాదేశ్ టెస్టు క్రికెట్ ఆడే 10వ దేశంగా అవతరించింది. అదే సంవత్సరం ఢాకాలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో టెస్టు ఫార్మాట్‌లో అరంగేట్రం చేసింది. ఇప్ప‌టికీ బ‌ల‌మైన జ‌ట్ల‌కు సైతం గ‌ట్టిపోటీనిస్తూ ముందుకు సాగుతోంది. సంచ‌ల‌న విజ‌యాలను సైతం న‌మోదుచేసింది. బంగ్లాదేశ్ ఇప్ప‌టివ‌ర‌కు 146 మ్యాచ్‌లు ఆడి 21 విజ‌యాలు అందుకుంది. 107 ఓడిపోయింది. మ‌రో 18 మ్యాచ్ లు డ్రాగా ముగించింది. 

8. శ్రీలంక - 106

టెస్టు క్రికెట్ లో ఒక ఇన్నింగ్స్ అత్య‌ధిక ప‌రుగులు (952) చేసిన రికార్డును క‌లిగిన శ్రీలంక జ‌ట్టు ఈ లిస్టులో ఎనిమిదో స్థానంలో ఉంది. శ్రీలంక ఒకప్పుడు టెస్టు ఫార్మాట్‌లో అగ్ర జట్టుగా కొన‌సాగింది. అయితే, ఆ టీమ్ లెజెండ‌రీ ప్లేయ‌ర్లు, టాప్ పెర్ఫార్మర్స్ రిటైర్మెంట్ కావ‌డంతో వారి వార‌స‌త్వాన్ని కొన‌సాగించ‌లేక‌పోయింది. అన్ని ఫార్మాట్ల‌లో ఆ జ‌ట్టు విన్నింగ్ ట్రాక్ రికార్డును కొన‌సాగించ‌డంలో క‌ష్ట‌ప‌డుతోంది. అయితే, వారి దేశంలో శ్రీలంక ఏ దేశానికి అయినా గ‌ట్టి పోటీనిస్తుంది. ఇప్ప‌టివ‌ర‌కు శ్రీలంక ఆడిన 321 టెస్టు మ్యాచ్ ల‌లో 106 విజ‌యాలు అందుకుంది. 123 మ్యాచ్ ల‌ను ఓడిపోగా, 92 గేమ్స్ డ్రాగా ముగిశాయి. 

7. న్యూజిలాండ్ - 115

టెస్టు క్రికెట్ లో న్యూజిలాండ్ టాప్ జట్లలో ఒకటి. అందుకే న్యూజిలాండ్ టీమ్ ఐసీసీ వ‌రల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ప్రారంభ ఎడిషన్‌ను గెలుచుకుంది. బ్లాక్ క్యాప్స్ స్వదేశంలో అనేక‌ గొప్ప రికార్డును కలిగి ఉంది.  విదేశాలలో కూడా  అద్భుత‌మైన విజ‌యాలు సాధించింది. మొత్తం 472 మ్యాచ్‌లు ఆడి 115 మ్యాచ్‌లు గెలిచింది. 187 గేమ్‌లలో ఓడిపోగా, 170 మ్యాచ్ లు డ్రా చేసుకుంది. 


6. పాకిస్తాన్ - 148

పాకిస్తాన్ 1952లో ఐసీసీ నుంచి టెస్ట్ క్రికెట్ హోదాను సంపాదించింది. భార‌త విభజన తర్వాత  టీమిండియాతో తన మొదటి మ్యాచ్ ఆడింది. వారు తమ ప్రారంభ గేమ్‌లో ఓడిపోయారు, కానీ వారి తదుపరి మ్యాచ్‌లో గెలిచారు. ఈ ఫార్మాట్‌లో ఆసియా అగ్రగామి జట్లలో పాకిస్థాన్ ఒకటి. పాకిస్తాన్ ఇప్ప‌టివ‌ర‌కు టెస్టు క్రికెట్ లో 458 మ్యాచ్‌లు ఆడ‌గా, ఇందులో 166 డ్రా అయ్యాయి. 148 మ్యాచ్ ల‌లో గెల‌వ‌గా, 145 మ్యాచ్ ల‌ను ఓడిపోయింది.

5. దక్షిణాఫ్రికా – 179

టెస్టు క్రికెట్ ఆడిన మూడో జట్టు దక్షిణాఫ్రికా. 1909లో టెస్ట్ హోదాను పొందిన సౌతాఫ్రికా సెయింట్ జార్జ్‌లో ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్ మ్యాచ్ ను ఆడింది. అప్ప‌టి నుంచి టెస్ట్ క్రికెట్ లో అసాధార‌ణ ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో ముందుకు సాగుతోంది. 1970-1991 మధ్య దక్షిణాఫ్రికా 21 సంవత్సరాల నిషేధాన్ని ఎదుర్కొన్నప్పటికీ అత్య‌ధిక టెస్టు విజ‌యాలు అందుకున్న టీమ్ గా ఐదో స్థానంలో ఉన్నారు. దక్షిణాఫ్రికా 466 టెస్టులు ఆడగా, 179 గెలిచి, 161 ఓడిపోయింది. 126 మ్యాచ్‌లు డ్రాగా అయ్యాయి.

India , Cricket,

4. భారతదేశం - 180

1926లో టెస్ట్ హోదా పొందిన తొలి ఆసియా జట్టుగా టీమ్ ఇండియా నిలిచింది. 1932 జూన్ లో లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన ఫార్మాట్‌లో  భార‌త్ త‌న తొలి టెస్టు మ్యాచ్ ను ఆడింది. అంత‌ర్జాతీయ క్రికెట్ లో అద్భుత‌మైన ఆట‌తో అగ్ర‌జట్టుగా కొన‌సాగుతోంది. భారత జట్టు మొదటి రెండు ప్ర‌పంచ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ (WTC) ఎడిషన్‌లలో ఫైనలిస్ట్‌గా నిలిచింది. అత్యంత ధ‌న‌వంత‌మైన క్రికెట్ బోర్డుగా కూడా భార‌త్ ముందుకు సాగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 581 టెస్టులు ఆడిన భార‌త్ 180 విజ‌యాలు అందుకుంది. 178 ఓడిపోగా, ఒక మ్యాచ్ టై, 222 గేమ్ లు డ్రాగా ముగించింది. 

3. వెస్టిండీస్ – 183

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడిన నాలుగో జట్టు వెస్టిండీస్. కరీబియన్ జట్టు 1926లో టెస్టు క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 1928లో లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్టుతో టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేసింది. మొత్తంమీద వెస్టిండీస్ 580 మ్యాచ్‌లు ఆడగా, 183 గెలిచింది. 214 మ్యాచ్ ల‌ను  ఓడిపోయింది. ఒక మ్యాచ్ టైగా, 182 డ్రాగా ముగించింది. ఒకానొక స‌మ‌యంలో వెస్టిండీస్ యావ‌త్ ప్ర‌పంచ క్రికెట్ ను శాంసించి అజేయ జ‌ట్టుగా ముందుకు సాగింది. 

2. ఇంగ్లాండ్ - 398

అద్భుతమైన ఆటను ప్రపంచానికి పరిచయం చేసింది ఇంగ్లండ్. క్రికెట్ ఆడిన పురాతన దేశం గొప్ప చ‌రిత్ర‌ను క‌లిగి ఉంది. 1877లో ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ఆడింది. కొన్నేళ్లుగా ఇంగ్లండ్ ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసింది. మొత్తంగా 1077 టెస్టు మ్యాచ్‌లు ఆడ‌గా, 398 గెలిచారు. 325 మ్యాచ్ ల‌లో ఓడిపోయారు. 355 గేమ్‌లను డ్రాగా ముగించారు. ఈ ఫార్మాట్‌లో 1000 కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ఏకైక జట్టు ఇంగ్లాండ్.

1. ఆస్ట్రేలియా - 414

టెస్టు క్రికెట్ లో అత్యుత్త‌మ జట్టుగా ఆస్ట్రేలియా త‌న స‌త్తా చూపించింది. ప్ర‌పంచంలోని అన్ని ప్రాంతాలలో అద్భుత‌మైన విజయాలు సాధించి త‌న ఆధిపత్యం చూపించింది. ఆస్ట్రేలియా ఇప్పటివరకు ఆడిన 866 మ్యాచ్‌ల్లో 414 మ్యాచ్‌ల‌ను గెలుచుకుంది. 232 ఓటములు, 2 టైలు, 218 మ్యాచ్ ల‌ను డ్రాగా ముగించింది.

Latest Videos

click me!