500 ప‌రుగులు చేసినా ఓడిపోయిన క్రికెట్ మ్యాచ్ లు ఇవి

First Published | Oct 11, 2024, 4:10 PM IST

team losing after scoring 500 runs: క్రికెట్ లో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా కొన్ని సంఘ‌ట‌లు జ‌రుగుతుంటాయి. ఒక్కోసారి భారీ స్కోర్ చేసినా ఓట‌మి పాల‌వుతుంటాయి. అలాగే, ప‌క్కా ఓడిపోతామ‌నే సంద‌ర్బంలో కూడా విజ‌యాన్ని అందుకున్న సంద‌ర్భాలున్నాయి. ఇదే విధంగా టెస్టు క్రికెట్ లో 500+ ప‌రుగులు చేసినా కొన్ని జ‌ట్లు ఓట‌మి నుంచి త‌ప్పించుకోలేక‌పోయాయి. ఆ వివ‌రాలు మీకోసం 
 

team losing after scoring 500 runs: ఒక జట్టు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో 500 ప‌రుగులు చేసిందంటే ప్ర‌త్యేక ప్ర‌శంస‌లు అందుకుంటుంది. అలాగే, మ్యాచ్ మీద ప‌ట్టును నిలుపుకుంటుంది. ఇలాంటి సంద‌ర్భాల్లో మ్యాచ్ ను గెలిచే అవకాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. లేదా మ్యాచ్ డ్రా కావ‌చ్చు. కానీ, 500 పరుగుల మార్కును దాటి ఓడిపోయిన అనూహ్యంగా సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. ఇది టెస్టు క్రికెట్ లో చాలా అరుదైన సంఘటన అని చెప్పాలి. ఎందుకంటే 147 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక జట్టు తమ ఇన్నింగ్స్‌లో 500 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన తర్వాత ఓడిపోవ‌డం కేవ‌లం 18 మ్యాచ్ ల‌లో జ‌రిగింది. 

టెస్ట్ క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 500కి పైగా పరుగులు చేసిన తర్వాత ఆస్ట్రేలియా మూడుసార్లు ఓడిపోయింది. ఇలాంటి భారీ స్కోర్ చేసిన తర్వాత కూడా టెస్టు క్రికెట్‌లో ఓడిపోవడానికి జట్టుకు సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి. పిచ్ ప్రత్యర్థి జట్టుకు మరింత అనుకూలంగా మార‌డం. బ్యాటింగ్ చేసినప్పుడు బౌలింగ్ ప‌నిచేయ‌క‌పోవ‌డం. ప‌దునైన బౌలింగ్ ను సైతం ఎదురునిలిచి బ్యాటింగ్ చేసే బ్యాట‌ర్లు ఉన్న సంద‌ర్భాలు స‌హా ప‌లు విష‌యాలు ప్ర‌భావం చూపుతాయి. 

ఒక ఇన్నింగ్స్‌లో 500 పరుగులు చేసినప్పటికీ టెస్టు మ్యాచ్‌లో ఓడిపోవడమ‌నేది ఘోర అవ‌మానంగా చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే బ్యాట‌ర్లు భారీ ప‌రుగులు చేసిన‌ప్పుడు బౌల‌ర్లు ప్ర‌ద‌ర్శ‌న ప‌నిచేయ‌న‌ప్పుడు కూడా ఇది జ‌రుగుతుంది. ప్ర‌పంచ టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఒక ఇన్నింగ్స్‌లో మొత్తం 500 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు నమోదు చేసిన తర్వాత కూడా ఒక జట్టు టెస్ట్ మ్యాచ్‌లో ఓడిపోయిన సంద‌ర్భాలు 18 సార్లు క‌నిపించాయి. ఈ మ్యాచ్ ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. 

Latest Videos


ఒక ఇన్నింగ్స్ లో 500 ప‌రుగులు చేసిన ఓడిపోయిన తొలి మ్యాచ్ 1894లో జ‌రిగింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టీమ్ తొలి ఇన్నింగ్స్ లో 580, రెండో ఇన్నింగ్స్ లొ 166 ప‌రుగులు చేసింది. అయితే, ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 325 ప‌రుగులు, రెండో ఇన్నింగ్స్ లో 437 ప‌రుగులు చేసింది. ఆసీస్ 10 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. ఇక 1911 లో మెల్‌బోర్న్ లో జ‌రిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా (506 & 80) ఆస్ట్రేలియా  ( 348 & 327 ) చేతిలో 89 పరుగుల తేడాతో ఓడిపోయింది. అలాగే, 1929 లో మెల్‌బోర్న్ లో జ‌రిగిన మ‌రో మ్యాచ్ లో ఇంగ్లండ్ ( 519 & 257 ) ఆస్ట్రేలియా ( 491 & 287/5 ) చేతితో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 1953లో లో మెల్‌బోర్న్ జ‌రిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా ( 520 & 209 ) 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది.

1967 లో లీడ్స్ లో జ‌రిగిన మ్యాచ్ లో భారత్ (164 & 510 ) ఇంగ్లాండ్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో 1968 లో వెస్టిండీస్ ( 526/7 డిక్లేర్ & 92/2డిక్లేర్ ) ఇంగ్లండ్ ( 404 & 215/3 ) చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మెల్‌బోర్న్ లో 1973 పాకిస్థాన్ ( 574/8d & 200 ) ఆస్ట్రేలియాతో ( 441/5d & 425 ) చేతిలో 92 పరుగుల తేడాతో ఓడిపోయింది. కొలంబో 1992లోశ్రీలంక ( 547/8d & 164 ) ఆస్ట్రేలియాతో ( 256 & 471 ) చేతిలో  16 పరుగుల తేడాతో ఓడిపోయింది. అడిలైడ్ లో 2003 లో ఆస్ట్రేలియా ( 556 & 196 ) భారత్ ( 523 & 233/6 ) చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. లీడ్స్ లో 2006లో జ‌రిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ ( 538 & 155 ) 168 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ( 515 & 345) చేతితో ఓడిపోయింది. 

Image credit: PTI

ది ఓవల్ లో  2006 లో జ‌రిగిన మ‌యాచ్ లో పాకిస్థాన్ (504, DNB) vs ఇంగ్లండ్ ( 173 & 298/4 ) మ్యాచ్ లో  మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు, అంపైర్ల నిర్ణ‌యంతో పాకిస్థాన్ ఓడిపోయింది. అడిలైడ్ లో 2006 జ‌రిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ ( 551/6d & 129 ) ఆస్ట్రేలియా ( 513 & 168/4 ) చేతిలో  6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. సిడ్నీ లో 2008 లో జ‌రిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా ( 463 & 401/7 డిక్లేర్ ) చేతిలో భార‌త్ ( 532 & 210 ) 122 పరుగుల తేడాతో ఓడిపోయింది. 

మిర్పూర్ లో 2012 లో బంగ్లాదేశ్ ( 556 & 167 ) వెస్టిండీస్ ( 527/4d & 273) చేతిలో 77 పరుగుల తేడాతో ఓడిపోయింది. లార్డ్స్ లో 2015 లో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ ( 523 & 220 ) ఇంగ్లండ్ ( 389 & 478 ) చేతిలో  124 పరుగుల తేడాతో ఓడిపోయింది.  2017 లో వెల్లింగ్టన్ లో బంగ్లాదేశ్ ( 595/8d & 160 ) న్యూజిలాండ్ ( 539 & 217/3 ) చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 2022 నాటింగ్‌హామ్ టెస్టులో న్యూజిలాండ్ ( 553 & 284 ) ఇంగ్లాండ్ ( 539 & 299/5) చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. రావల్పిండి లో 2022 లో పాకిస్థాన్ (579 & 268 ) 74 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ( 657 & 264/7d ) చేతిలో ఓడిపోయింది.

click me!