Tilak Varma Revenge on Arshdeep Singh:ఐపీఎల్ 2026లో తెలుగు తేజం తిలక్ వర్మ తనను నల్లోడు అని అవమానించిన దానికి బ్యాట్‌తో రివేంజ్ తీర్చుకున్నాడు. పంజాబ్ కింగ్స్‌ను చిత్తు చేస్తూ 75 పరుగులతో వీరవిహారం చేశాడు. అర్ష్‌దీప్ నోటికి బ్యాట్‌తో సమాధానం ఇచ్చాడు.
సిక్స్ ప్యాక్ చూపిస్తూ స్వీట్ రివేంజ్.. తిలక్ వర్మ దెబ్బకు పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలు అవుట్ !
క్రికెట్ గ్రౌండ్ లో స్లెడ్జింగ్ సహజమే కానీ, అది వ్యక్తిగత దూషణలకు దారితీస్తేనే అసలు సమస్య. ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌కు ముందు ఇలాంటి ఒక అవాంఛనీయ సంఘటనే జరిగింది. పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్, మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాయి. అయితే, తిలక్ వర్మ దీనికి నోటితో సమాధానం చెప్పలేదు.. తన బ్యాట్‌తోనే అర్ష్‌దీప్‌కు సినిమా చూపించాడు. ధర్మశాలలో జరిగిన ఈ హై-వోల్టేజ్ పోరులో ముంబై 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
24
అసలేం జరిగింది? “నల్లోడా” వివాదం వెనుక కథ ఇదే
మ్యాచ్ ప్రారంభానికి ముందు సరదాగా సాగిన ఒక వీడియో షూట్‌లో అర్ష్‌దీప్ సింగ్ హద్దులు దాటాడు. తిలక్ వర్మను ఉద్దేశించి హిందీలో "ఓయ్ అంధేరే" (అంటే నల్లోడా అని అర్థం) అంటూ పిలిచాడు. అంతేకాకుండా, పక్కనే ఉన్న నమన్ ధీర్‌ను చూపిస్తూ.. ఇతను పంజాబ్ అసలైన వెలుగు, నీ ముఖం చూసుకో అంటూ వెటకారంగా మాట్లాడాడు. ఈ వీడియో వైరల్ కావడంతో క్రికెట్ లవర్స్, ముఖ్యంగా సౌత్ ఇండియా అభిమానులు అర్ష్‌దీప్ తీరుపై ఫైర్ అవుతున్నారు. ఫ్రెండ్లీగా ఉన్నా కూడా రంగును ఉద్దేశించి కామెంట్ చేయడం సరైంది కాదని నెటిజన్లు క్లాస్ పీకుతున్నారు.
అవమానానికి పరాకాష్ట అనిపించేలా ఉన్న ఆ కామెంట్స్‌కు తిలక్ వర్మ కేవలం 24 గంటల్లోనే బదులిచ్చాడు. పంజాబ్ నిర్దేశించిన 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తిలక్ శివతాండవం చేశాడు. కేవలం 33 బంతుల్లోనే 6 ఫోర్లు, 6 సిక్సర్లతో విరుచుకుపడి అజేయంగా 75 పరుగులు చేశాడు. ముఖ్యంగా తనను విమర్శించిన అర్ష్‌దీప్ బౌలింగ్‌లోనే భారీ షాట్లు ఆడి గాలి తీసేశాడు. యజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో ఏకంగా 106 మీటర్ల సిక్సర్ కొట్టి స్టేడియం బయట పడేశాడంటే తిలక్ ఏ రేంజ్‌లో కసిగా ఆడాడో అర్థం చేసుకోవచ్చు.
సిక్స్ ప్యాక్ సెలబ్రేషన్.. పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు
మ్యాచ్ ముగిసిన తర్వాత తిలక్ వర్మ తన జెర్సీ విప్పి సిక్స్ ప్యాక్ చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్న తీరు అర్ష్‌దీప్‌కు ఒక స్ట్రాంగ్ కౌంటర్ లాగా అనిపించింది. "నన్ను అన్నందుకు ఇగో తీసుకో" అన్నట్లుగా తిలక్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో షేక్ చేస్తున్నాయి. ఈ ఓటమితో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ రేసు నుండి దాదాపు అవుట్ అయ్యే పరిస్థితికి వచ్చింది. వరుసగా ఐదో పరాజయంతో పంజాబ్ డీలా పడగా, తెలుగోడి పవర్‌కు ముంబై అభిమానులు ఫిదా అవుతున్నారు.