Virat Kohli: రిటైర్మెంట్ పై కోహ్లీ ఎమోషనల్ కామెంట్స్ !

Published : May 14, 2026, 12:57 PM IST

Virat Kohli: ఐపీఎల్ 2026లో సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ, తన రిటైర్మెంట్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. అలాగే టీ20ల్లో 14 వేల పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు.

PREV
14
ఎప్పటికైనా ముగియాల్సిందే.. రిటైర్మెంట్‌పై విరాట్ కోహ్లీ ఎమోషనల్ కామెంట్స్

విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2026లో మరోసారి తన క్లాస్ చూపించారు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయ సెంచరీ బాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును విజయతీరాలకు చేర్చారు. అయితే, మ్యాచ్ తర్వాత ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

"నేను ఆడుతున్న ఈ ఆట ఏదో ఒకరోజు కచ్చితంగా ముగిసిపోతుంది.. అందుకే మైదానంలో ఉన్న ప్రతి సెకనును మనస్ఫూర్తిగా ఆస్వాదించాలనుకుంటున్నాను" అని కోహ్లీ ఉద్వేగానికి లోనయ్యారు. 37 ఏళ్ల వయసులో కూడా కుర్రాడిలా క్రీజులో పరుగెత్తుతున్న కోహ్లీ, ప్రతి ఇన్నింగ్స్‌ను తన చివరి ఇన్నింగ్స్‌లాగే భావిస్తూ ఆడుతున్నానని చెప్పడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

24
రికార్డుల వేటలో యూనివర్స్ బాస్ నే దాటేసిన కోహ్లీ

విరాట్ కోహ్లీ కేవలం ఎమోషనల్ మాటలతోనే ఆగలేదు, గణంకాలతో కూడా ప్రకంపనలు సృష్టించారు. టీ20 క్రికెట్ చరిత్రలో 14,000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ బ్యాటర్‌గా రికార్డు సృష్టించారు. ఈ క్రమంలో వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ రికార్డును కోహ్లీ తుడిచిపెట్టేశారు.

గేల్ 423 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా, విరాట్ కేవలం 409 ఇన్నింగ్స్‌ల్లోనే 14 వేల మార్కును అందుకుని 'ఫాస్టెస్ట్ బ్యాటర్'గా నిలిచారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక టీ20 పరుగులు చేసిన వారి జాబితాలో కోహ్లీ ఆరో స్థానంలో ఉన్నప్పటికీ, ఆయన ఫామ్ చూస్తుంటే త్వరలోనే క్రిస్ గేల్ (14,562) ఆల్ టైమ్ రికార్డు కూడా బద్దలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

34
భారత బ్యాటర్లలో కోహ్లీకి దరిదాపుల్లో ఎవరూ లేరు

టీ20ల్లో భారత బ్యాటర్ల ప్రదర్శనను గమనిస్తే విరాట్ కోహ్లీ ఒక ప్రత్యేకమైన లీగ్‌లో ఉన్నారని చెప్పొచ్చు. కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ 12,491 పరుగులతో రెండో స్థానంలో ఉన్నారు. రోహిత్ 469 మ్యాచ్‌లు ఆడితే, కోహ్లీ కేవలం 426 మ్యాచ్‌ల్లోనే 14 వేల మైలురాయిని దాటడం ఆయన నిలకడకు నిదర్శనం.

శిఖర్ ధావన్, సూర్యకుమార్ యాదవ్ వంటి వారు ఈ రేసులో చాలా వెనుకబడి ఉన్నారు. కెప్టెన్సీ భారం దిగిపోయాక కోహ్లీ తన సహజ సిద్ధమైన ఆటను మరింత స్వేచ్ఛగా ఆడుతున్నారు. "బ్యాట్ మధ్యలో బంతి తగిలినప్పుడు వచ్చే ఆ శబ్దం నాకు ఇప్పటికీ కొత్త ఎనర్జీని ఇస్తుంది" అని కోహ్లీ తన సంతోషాన్ని పంచుకున్నారు.

44
సవాళ్లే నాకు ఇష్టం..

కోహ్లీ తన రిటైర్మెంట్ గురించి మాట్లాడుతూనే, తనలోని పోరాట పటిమ ఇంకా తగ్గలేదని స్పష్టం చేశారు. "మైదానంలోకి వెళ్ళిన ప్రతిరోజూ నాకంటూ ఒక కొత్త లక్ష్యం ఉంటుంది. మ్యాచ్ ఒత్తిడిని అనుభవించడం, నన్ను నేను పరీక్షించుకోవడం నాకు ఇష్టం. క్లిష్ట పరిస్థితుల్లో గెలిచి బయటపడినప్పుడే ఒక మంచి వ్యక్తిగా మనం ఎదుగుతాం" అని కోహ్లీ చెప్పుకొచ్చారు.

టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు ఇప్పటికే వీడ్కోలు పలికిన కోహ్లీ, ఐపీఎల్‌లో మాత్రం తన మార్క్ చూపిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. క్రికెట్ అనేది కేవలం ఆట మాత్రమే కాదు, అది తన జీవితమని, అందుకే ప్రతి బంతిని తన ఆత్మను పెట్టి ఆడుతున్నానని కింగ్ కోహ్లీ అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories