ఎందుకంటే ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ 2008 నుండి 2024 వరకు మొత్తం 17 సీజన్లు ఆడాడు, కానీ ఒక్కసారి కూడా ఛాంపియన్‌గా నిలిచే అవకాశం అతనికి రాలేదు. అతని జట్టు అద్భుత ప్రదర్శనలు చేసినా టైటిల్ ను గెలవలేకపోయింది. ప్రతి సీజన్ లోనూ స్టార్ ప్లేయర్లతో భారీ అంచనాలతో బరిలోకి దిగినా ఐపీఎల్ టైటిల్ రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు (ఆర్సీబీ) అందని ద్రాక్షగానే మిగిలింది.
అలాగే, 2013 వరకు ఒక్క ఐసీసీ ఈవెంట్‌ను కూడా గెలవనందున కోహ్లీని ఐపీఎల్, భారత క్రికెట్ చరిత్రలో దురదృష్టకర ఆటగాడిగా కూడా పలువురు పేర్కొన్నారు. అయితే, 2024లో టీ20 ప్రపంచ కప్‌తో అతని నుదిటిపై నుండి ఈ దురదృష్టకర మరక తొలగిపోయింది.
భారత్ అద్భుతమైన ఆటతో ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా విజయవంతంగా టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ లో గెలిచి ఛాంపియన్ గా నిలిచింది. దీంతో ఇప్పుడు మరో కొత్త ప్లేయర్ ఐపీఎల్, భారత క్రికెట్ చరిత్రలో అత్యంత దురదృష్టకరమైన ఆటగాడిగా తెరమీదకు వచ్చాడు.