రోహిత్ శర్మ కాదు, ఎంఎస్ ధోనీ కాదు - గౌతమ్ గంభీర్ క్రికెట్ 'షాహెన్‌షా' ఎవ‌రో తెలుసా?

First Published | Sep 12, 2024, 11:09 AM IST

Cricket Emperor : ఢిల్లీ ప్రీమియర్ లీగ్ టీ20లో టీ టైమ్ లో టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ క్రికెట్‌కు బాలీవుడ్ ఫ్లేవర్ జోడించి ఆటగాళ్లకు బిరుదులు ఇచ్చాడు. యాంకర్ షెఫాలీ బగ్గా టీమ్ ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది. 
 

Rohit Sharma, Virat Kohli, Gautam Gambhir

Virat Kohli - Gautam Gambhir : భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అనుసరించే క్రికెటర్లలో ఒకరు. జెంటిల్‌మెన్ గేమ్‌లో అద్భుత‌మైన రికార్డులు బ‌ద్ద‌లు కొడుతూ అనేక కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. అత‌ని క్రికెట్ నైపుణ్యం కోట్లాది అభిమానులను సంపాదించి పెట్టింది. 

అందుకే అత‌ని కింగ్ కోహ్లీ, రన్ మిషన్ అంటూ పిలుచుకుంటారు. 2008లో శ్రీలంకపై కోహ్లి అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అప్ప‌టినుంచి త‌న ప‌రుగుల ప్ర‌వాహం కొన‌సాగుతూనే ఉంది. క్రికెట్ లో ర‌న్ మిష‌న్ గా గుర్తింపు పొందిన విరాట్ కోహ్లీ ప్ర‌స్తుతం టాప్ ప్లేయ‌ర్ గా కొన‌సాగుతున్నాడు. ఇక కోహ్లీ-గౌత‌మ్ గంభీర్ అన‌గానే వారిద్ద‌రి ఐపీఎల్ ఫైట్ గుర్తుకు వ‌స్తుంది. అప్ప‌ట్లో ఇది పెద్ద ర‌చ్చే చేసింది. 

Rohit Sharma Virat Kohli Gautam Gambhir

అయితే, క్రికెట్ లో విరాట్ కోహ్లీ సాధించిన విజ‌యాల‌కు గౌత‌మ్ గంభీర్ కూడా ఫిదా అయ్యాడు. ప్రస్తుతం భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్న గౌతమ్ గంభీర్ కోహ్లీని క్రికెట్ 'షాహెన్‌షా'గా పేర్కొన్నాడు. వివ‌రాల్లోకెళ్తే.. క్రికెట్-బాలీవుడ్ మధ్య సంబంధం చాలా పాతది, చాలా చోట్ల క్రికెట్ బాలీవుడ్‌తో ముడిపడి ఉంటుంది. ఇదే క్ర‌మంలో ఇటీవల ఢిల్లీ ప్రీమియర్ లీగ్ సందర్భంగా యాంకర్ షెఫాలీ బగ్గా టీం ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్‌ని ఇంటర్వ్యు చేశారు. 

టోర్నమెంట్‌లో భాగంగా ఢిల్లీ ప్రీమియర్ లీగ్ టీ20 సోషల్ మీడియా పేజీతో ఎంగేజ్ చేస్తున్నప్పుడు గంభీర్ 'బాలీవుడ్ x క్రికెట్' గేమ్‌లో పాల్గొన్నాడు. ఈ గేమ్‌లో, సినిమా టైటిల్ లేదా క్యారెక్టర్‌కి బాగా సరిపోయే ప్రస్తుత లేదా మాజీ క్రికెటర్‌కి పేరును ఇవ్వాల‌ని యాంక‌ర్ షెఫాలీ కోరారు. 

Latest Videos


Dale Steyn & Gautam Gambhir Virat Kohli

క్రికెట్‌కు బాలీవుడ్ ఫ్లేవర్ జోడించి ఆటగాళ్లకు బిరుదులు ఇవ్వాలని కోరగా, భారత కోచ్ గంభీర్ అద్భుతమైన సమాధానాలు ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే కింగ్ కోహ్లీని షాహెన్‌షా అనీ, యువరాజ్ సింగ్‌ను బాద్షా అని పేర్కొన్నాడు. గౌతమ్ గంభీర్ యాంగ్రీ యంగ్ మ్యాన్ అనే బిరుదును తన‌కు తానే సంపాదించుకున్నాడు. గంభీర్ ను ప్ర‌శ్న‌లు ఆడ‌గ‌డం, అత‌ని స‌మాధానాల‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. 

గౌతమ్ గంభీర్‌తో పాటు, షెఫాలీ బగ్గా కూడా ఈ ప్రశ్నలను టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను అడిగారు. కింగ్ ఆఫ్ క్రికెట్ బిరుదును టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కు అందించారు. 2007-2011 ప్రపంచ కప్‌లను భారత్ గెలవడంలో యువీ ముఖ్యమైన పాత్ర పోషించాడు, ఆ తర్వాత అతను తనను తాను యాంగ్రీ యంగ్ మాన్‌గా అభివర్ణించాడు. గంభీర్ ఈ సమాధానం విని యాంకర్ కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు.

ఈ చర్చలో గౌతమ్ గంభీర్ సచిన్ టెండూల్కర్‌కు ద‌బాంగ్, విరాట్ కోహ్లీని షాహెన్‌షా అని పిలిచాడు. అతను జస్ప్రీత్ బుమ్రాను 'కిలాడి ప్లేయర్' అని అభివర్ణించాడు. అతను చాలా ముఖ్యమైనవాడని కూడా చెప్పాడు. ఇక రాహుల్ ద్రావిడ్ కచ్చితత్వం, విశ్వసనీయత కారణంగా గంభీర్ అతడిని 'మిస్టర్ పర్ఫెక్షనిస్ట్'గా అభివర్ణించాడు. 

అయితే, ఆశ్చర్యకరంగా, ఈ సెగ్మెంట్‌లో రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ పేర్లు కనిపించలేదు. ఇది ఇప్పుడు క్రికెట్ వ‌ర్గాల్లో మ‌రో చ‌ర్చ‌కు దారితీసింది. భారత కొత్త ప్రధాన కోచ్‌గా నియమితులైన గౌతమ్ గంభీర్ ఇప్పటికే విరాట్ కోహ్లీతో తనకున్న సంబంధాల గురించి వ‌రుగా కామెంట్స్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. 

Virat Kohli, MS Dhoni, Sachin Tendulkar

ప్రధాన కోచ్‌గా తన మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో, గంభీర్ భారతదేశాన్ని గర్వించేలా చేయాలనేది మొద‌టి టార్గెట్ అనీ, త‌మ భాగస్వామ్య లక్ష్యం విషయానికి వస్తే తాను-కోహ్లీ ఒకే పేజీలో ఉన్నామని చెప్పాడు. త‌మ‌ ఉద్రిక్తతలు కేవ‌లం ఆ మ్యాచ్ గ్రౌండ్ వ‌ర‌కే ప‌రిమిత‌మ‌ని తెలిపాడు. కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిన తర్వాత గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా బాధ్యతలు తీసుకున్నాడు. శ్రీలంక పర్యటనలో తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు.

కాగా, సెప్టెంబరు 19 నుండి ప్రారంభమయ్యే బంగ్లాదేశ్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు భారత్ సిద్ధమవుతున్న వేళ, టెస్ట్ జట్టులోకి విరాట్ కోహ్లీ ఎంతో ఆసక్తిగా తిరిగి రావడంపై అందరి దృష్టి ఉంది. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌కు దూరమ‌య్యాడు కోహ్లి.  కోహ్లీతో పాటు దాదాపు 20 నెలల తర్వాత స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట్స్ మ‌న్ రిషబ్ పంత్ తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చాడు. 

click me!