జింబాబ్వే చేతిలో ఓటమితో భారత్ పేరుపై అనేక చెత్త రికార్డులు నమోదయ్యాయి. ఐపీఎల్ లో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన యంగ్ ప్లేయర్లకు భారత జట్టులో చోటుకల్పించింది సెలక్షన్ కమిటీ. కానీ, ఒక్క ప్లేయర్ కూడా రాణించలేకపోయారు. దీంతో భారత్ ఓటమి నుంచి తప్పించుకోలేక పోయింది.
జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 102 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీ20 ఇంటర్నేషనల్‌లో భారత్‌కు ఇది 5వ అత్యల్ప స్కోరుగా నిలిచింది. గత 8 ఏళ్లలో ఒక జట్టు చేసిన చిన్న ఆల్ అవుట్ టోటల్ కూడా ఇదే.
Shubman Gill
జింబాబ్వే బ్యాట్స్‌మెన్‌ల మధ్య చివరి వికెట్ భాగస్వామ్యం భారత్‌కు తీవ్ర నష్టం కలిచింది. 90 పరుగుల స్కోరు వద్ద 9 వికట్లు కోల్పోయింది జింబాబ్వే. అయితే, క్లైవ్ మదాండే, టెండై చతారా 10వ వికెట్‌కు 25 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యాన్ని భారత బౌలర్లు ఛేదించి ఉంటే, భారత్ మ్యాచ్ గెలిచి ఉండేది. కానీ, చివరి వికెట్ కు భారత్ భారీగా పరుగులు సమర్పించుకుంది. టీమిండియా మాత్రం 102 పరుగులకే ఆలౌట్ అయింది.
తొలి ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలిన టీమిండియా బ్యాట్స్‌మెన్ ఒత్తిడిని తట్టుకోలేక వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. దీంతో భారత జట్టు 47 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ గిల్ సహా టాప్-5 బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు చేరుకున్నారు. రితురాజ్ గైక్వాడ్ 7 పరుగులు చేయగా, రింకూ సింగ్ ఖాతా కూడా తెరవలేదు. అరంగేట్ర ఆటగాడు ధ్రువ్ జురెల్ 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
Most sixes in the season
అరంగేట్రం మ్యాచ్ ఆడుతున్న అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ అంచనాలను అందుకోలేకపోయారు. ఈ ఇద్దరు ప్లేయర్లు ఐపీఎల్ 2024లో బ్యాట్‌తో విధ్వంసం సృష్టించారు. దీని కారణంగానే వారికి భారత టీ20 జట్టులో చోటుదక్కింది. కానీ తొలి మ్యాచ్‌లోనే ఫ్లాప్ షో చూపించారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఓపెనింగ్‌కు వచ్చిన అభిషేక్ శర్మ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. అదే సమయంలో మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రియాన్ పరాగ్ కూడా 2 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు.
Riyan Parag
భారత్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వే 116 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుంది. దీంతో టీ20 ఇంటర్నేషనల్‌లో భారత్ ముందు అతిచిన్న లక్ష్యాన్ని కాపాడుకున్న జట్టుగా జింబాబ్వే చరిత్ర సృష్టించింది. అంతకుముందు, న్యూజిలాండ్ 2016లో భారత్‌పై 127 పరుగులను డిఫెండ్ చేసింది.