6, 6, 6... రాహుల్ ద్రవిడ్ బ్యాట్ పవర్ కు ఇంగ్లాండ్ బౌలర్‌కు దిమ్మదిరిగిపోయింది.. !

First Published | Jul 5, 2024, 10:45 PM IST

Rahul Dravid Back to Back Sixes : ప్ర‌పంచ క్రికెట్ గొప్ప ఆటగాళ్ళలో భార‌త మాజీ కెప్టెన్ రాహుల్ ద్ర‌విడ్ ఒక‌రు. ఎప్పుడూ ప్ర‌శాంతంగా, సంయమనంతో అనేక గొప్ప ఇన్నింగ్స్ లు ఆడాడు. ఫార్మాట్ ఏదైనప్పటికీ, చాలా మంది బ్యాట్స్‌మెన్ దూకుడు శైలిలో బ్యాటింగ్ చేస్తారు, కానీ రాహుల్ ద్రవిడ్ ఆట తీరు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అతను నిలక‌డగా బ్యాటింగ్ చేయ‌డం మొద‌లు పెట్టి ప‌రుగులు చేస్తుంటే అతడిని అవుట్ చేయడం అంత సులువు కాదు.
 

లెంజెండ‌రీ ప్లేయ‌ర్ రాహుల్ ద్రవిడ్ టెస్టు, వ‌న్డే క్రికెట్ లో త‌న మొత్తం అంతర్జాతీయ కెరీర్‌లో 66 సిక్సర్లు మాత్రమే కొట్టాడు, కానీ ఒక మ్యాచ్‌లో వ‌రుస సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డ్డారు. ఇంగ్లాండ్ బౌల‌ర్ కు దిమ్మ‌దిరిగే షాక్ ఇచ్చాడు. 

రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్‌గా టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ను గెలిపించడంలో విజయం సాధించాడు. ఇటీవల బార్బడోస్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి 2024 టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న టీమ్ ఇండియాకు రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్. రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు 17 ఏళ్ల తర్వాత ఈ ట్రోఫీని కైవసం చేసుకుంది. భారత్ విజయంలో ద్రవిడ్ కూడా కీలక పాత్ర పోషించాడు.  

Latest Videos


క్రికెట్ హిస్టరీలో రాహుల్ ద్ర‌విడ్ ఒక లెజెండ‌రీ బ్యాట్స్ మ‌న్. 344 టెస్టుల్లో 13288 పరుగులు చేశాడు. టెస్టులో అతని అత్యుత్తమ స్కోరు 270 పరుగులు. ద్రావిడ్ రెడ్ బాల్ ఫార్మాట్‌లో 63 అర్ధ సెంచరీలు, 36 సెంచరీలు చేశాడు. ఇక వన్డేల్లో ద్రవిడ్ 344 మ్యాచ్‌లు ఆడి 10889 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో 12 సెంచరీలు, 83 హాఫ్ సెంచరీలు సాధించాడు. ద్ర‌విడ్ తన కెరీర్‌లో ఒక టీ20 అంతర్జాతీయ మ్యాచ్ మాత్ర‌మే ఆడాడు. అందులో 31 పరుగులు చేశాడు.

భారత టెస్టు చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు ద్రవిడ్. సచిన్ టెండూల్కర్ ఈ ఫార్మాట్‌లో 15,000 కంటే ఎక్కువ పరుగులు చేసి టాప్ లో ఉన్నారు. అదే సమయంలో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ద్రవిడ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ ఫార్మాట్‌లో కూడా సచిన్ 18000+ పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉండగా, సౌరవ్ గంగూలీ మూడో స్థానంలో ఉన్నాడు.

Rahul Dravid

ద్రవిడ్ తన కెరీర్‌లో కేవలం ఒక టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ మాత్రమే ఆడాడు. 2011లో ఇంగ్లండ్‌తో ద్రవిడ్ ఈ మ్యాచ్ ఆడాడు. అప్పుడు జట్టు కెప్టెన్సీ మహేంద్ర సింగ్ ధోనీ చేతిలో ఉంది. ఈ మ్యాచ్‌లో మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ద్రవిడ్.. ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో బ్యాటింగ్ కు వ‌చ్చాడు. వ‌స్తువ‌స్తూనే ఇంగ్లాండ్ ఆట‌గాడు సమిత్ పటేల్ బౌలింగ్ ను చీల్చిచెండాడాడు. వరుసగా మూడు బంతుల్లో సిక్సర్లు బాదాడు. ఇది చూసి మైదానంలో ఉన్న అభిమానులు ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. బౌల‌ర్ కు కూడా ఏం జ‌రుగుతుందో అర్థం కాలేదు. ఎందుకంటే ద్రవిడ్ ధ‌నాధ‌న్ బ్యాటింగ్ చేయ‌డం చాలా అరుదు.. అలా చేసినా ఇలా వ‌రుస‌ సిక్స‌ర్లు రాలేదు. ఇది ద్ర‌విడ్ నుంచి చాలా అరుదుగా కనిపించిన బ్యాటింగ్ శైలీ. 

click me!