IPL 2025 - Dinesh Karthik : అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా మాజీ క్రికెట్ దినేష్ కార్తీక్.. ఐపీఎల్ తో పాటు పలు క్రికెట్ లీగ్ లలో మాత్రం ఆడుతూ వచ్చారు. అయితే, ఈ ఏడాదిలో అన్ని రకాల క్రికెట్ కు డీకే వీడ్కోలు పలికాడు.
క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత దినేష్ కార్తీక్ కొత్త అవతారమెత్తాడు. 2024 లో ఆర్సీబీ తరఫున చివరి ఐపీఎల్ సీజన్ ఆడిన డీకే.. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సబీకీ)కి బ్యాటింగ్ కోచ్, మెంటార్‌గా నియమితులయ్యారు.
దీంతో దినేష్ కార్తీక్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రధాన కోచ్ ఆండీ ఫ్లవర్, బౌలింగ్ కోచ్ ఆడమ్ గ్రిఫిత్, డైరెక్టర్ మో బోబాట్‌లతో కలిసి ఆర్సీబీ కోసం పనిచేయనున్నాడు.
Dinesh Karthik
ధనాధన్ ఇన్నింగ్స్ లను ఆడే ఈ 39 ఏళ్ల క్రికెటర్.. 2022 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఐపీఎల్ లో ఆడుతున్నాడు. 2015 సీజన్ లో కూడా ఆర్సీబీ జట్టులో భాగంగా ఉన్నాడు.
Dinesh Karthik
జట్టుకు అనేక విజయాలు, అద్భుతమైన సపోర్టు అందించిన తమ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ ఇప్పుడు మళ్లీ సరికొత్త అవతారంలో ఆర్సీబీలోకి వచ్చాడని ఫ్రాంఛైజీ ప్రకటించింది. ఆర్సీబీ జట్టుకు డీకే బ్యాటింగ్ కోచ్ గా, మెంటర్‌గా ఉంటారని పేర్కొంది.
Dinesh Karthik
దీనేష్ కార్తీక్ ఆర్సీబీ తరఫున 60 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 24.65 సగటు, 162.95 స్ట్రైక్ రేట్‌తో 937 పరుగులు సాధించాడు. విరాట్ కోహ్లి తర్వాత ఐపీఎల్ లో ఆర్సీబీ తరఫున అత్యధిక పరుగులు చేసిన భారతీయ ప్లేయర్ దినేష్ కార్తీక్. అలాగే, ఆర్సీబీ కోసం 36 క్యాచ్‌లు, 9 స్టంపింగ్‌లు కూడా చేశాడు.
మొత్తం తన ఐపీఎల్ కెరీర్ లో దినేష్ కార్తీక్ 257 మ్యాచ్ లను ఆడి 135.36 స్ట్రైక్ రేటుతో 4842 పరుగులు చేశాడు. 22 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఐపీఎల్ లో తన వ్యక్తిగత అత్యధిక స్కోరు 97* పరుగులు.