తొల‌గించ‌డం స‌రైందే.. ఇషాన్ కిషన్ పై సునీల్ గ‌వాస్క‌ర్ షాకింగ్ కామెంట్స్.. !

First Published Jan 20, 2024, 3:58 PM IST

Sunil Gavaskar on Ishan Kishan: భార‌త జ‌ట్టులోకి ఇషాన్ కిష‌న్ ను తీసుకోక‌పోవడంపై హాట్ హాట్ గా చ‌ర్చ‌సాగుతూనే ఉంది. జ‌న‌వ‌రి 25 నుంచి ఇంగ్లాండు తో జ‌ర‌గ‌బోయే టెస్టు సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ లకు భారత జట్టు నుంచి ఇషాన్ కిషన్ ను తప్పించాలన్న బీసీసీఐ నిర్ణ‌యాన్ని క్రికెట్  దిగ్గజం సునీల్ గవాస్కర్ సమర్థించాడు.

Sunil Gavaskar, Ishan Kishan

Sunil Gavaskar on Ishan Kishan: టీమిండియా యంగ్ ప్లేయ‌ర్ ఇష‌న్ కిష‌న్ పై భార‌త క్రికెట్ దిగ్గ‌జం సునీల్ గ‌వాస్క‌ర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇషాన్ ను జ‌ట్టు నుంచి త‌ప్పించ‌డం స‌రైన నిర్ణ‌యంగా పేర్కొన్నారు.  ఇంగ్లాండ్ తో జరగనున్న టెస్టు సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ ల‌కు వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ను భారత జట్టు నుంచి తప్పించాలన్న బీసీసీఐ నిర్ణయాన్ని సునీల్ గవాస్కర్ సమర్థించారు. ఇటీవ‌ల భార‌త్ ఆడిన సిరీస్ ల‌కు ఇషాన్ కిష‌న్ ను జ‌ట్టులోకి తీసుకోక‌పోవ‌డంపై స్పందించిన ప్ర‌ధాన కోచ్ రాహుల్ ద్రవిడ్.. ఇషాన్ కిష‌న్ దేశ‌వాళీ క్రికెట్ మ్యాచ్ లు ఆడిన త‌ర్వాత జ‌ట్టులోకి వ‌స్తాడ‌ని చెప్పారు.

దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా జట్టులో చోటుద‌క్కించుకున్న ఇషాన్ కిష‌న్.. టెస్టు, వ‌న్డే సిరీస్ ముగిసిన త‌ర్వాత భారత టెస్టు జట్టులో ఆడాల్సి ఉంది. అయితే తొలి టెస్టు ప్లేయింగ్ ఎలెవన్ లో అతనికి అవకాశం దక్కలేదు. రెండో టెస్టుకు ముందు వ్యక్తిగత కారణాలతో దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చాడు. అప్ప‌టి నుంచి ఇషాన్ కిష‌న్ వ్య‌వ‌హారం హాట్ టాపిక్ గా మారింది. ఇదే క్ర‌మంలో అత‌నికి అఫ్గానిస్థాన్ తో జ‌రిగిన‌ మూడు టీ20ల సిరీస్ లో భార‌త జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు.

Latest Videos


ishan

ఇక ఇంగ్లాండు తో జ‌ర‌గ‌బోయే టెస్టు సిరీస్ కోసం ఇప్ప‌టికే బీసీసీఐ టీమ్ ప్ర‌క‌టించింది. ఇంగ్లాండ్ తో జరిగే తొలి రెండు మ్యాచ్ ల‌కు భారత జట్టులో కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, ధృవ్ జురెల్ కు చోటు దక్కింది. అయితే ఇషాన్ కిషన్ 2023-24 రంజీ ట్రోఫీలో జార్ఖండ్ తరఫున ఆడుతున్నాడు. ఇషాన్ కిషన్ ను టీమిండియా నుంచి తప్పించడాన్ని సునీల్ గవాస్కర్ సమర్థించారు. క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు ఇషాన్ కిషన్ ను భారత జట్టు నుంచి తప్పించినట్లు అఫ్గానిస్థాన్ తో టీ20 సిరీస్ కు ముందు రాహుల్ ద్రవిడ్ చెప్ప‌క‌నే చెప్పారు.

Ishan Kishan-Rahul Dravid

'దక్షిణాఫ్రికా పర్యటనలో ఇషాన్ కిషన్ ను స్వదేశానికి తిరిగి రావడానికి ఎవరు అనుమతించారు? ఆ తర్వాత భారత జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. ఇషాన్ కిషన్ కు సంబంధించిన ప్రశ్నకు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలివిగా సమాధానమిచ్చాడు. రంజీ ట్రోఫీ ఆడి ఫామ్ ను కనుగొని జాతీయ జట్టులోకి రావాలని కిషన్ కోరుకున్నాడు' అని గవాస్కర్ తెలిపాడు.

Sunil Gavaskar

క్రమశిక్షణ నియమావళి ప్రకారం ఇషాన్ కిషన్ ను జాతీయ జట్టు నుంచి తప్పించినట్లు వచ్చిన ఊహాగానాలను రాహుల్ ద్రవిడ్ తోసిపుచ్చారు. ఇషాన్ కిషన్ విషయంలో హాట్ టాపిక్ కూల్ అవుతుంద‌ని ఆశిస్తున్నాను. కానీ వాస్తవాలను ధృవీకరించకుండా వివాదాస్పద వార్తలను ప్రచురించడం ద్వారా అత‌ని పేరుకు చెడ్డపేరు తీసుకురావద్దు' అని సునీల్ గవాస్కర్ అన్నారు.

Team India

ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కు భార‌త జ‌ట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మ‌న్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్( వికెట్ కీపర్), కేఎస్ భరత్(వికెట్ కీపర్), ధృవ్ జురెల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, ఆర్ జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, అవేశ్ ఖాన్.

click me!