Virat Kohli, RohitSharma
Most Fours by batters: టీ20 ప్రపంచ కప్ 2024 కు అమెరికా, వెస్టిండీస్ లు సంయుక్త వేదికలుగా ఉన్నాయి. అమెరికా పిచ్ లపై ఆటగాళ్లు బ్యాటింగ్ చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం సూపర్-8 మ్యాచ్ లు వెస్టిండీస్ లో జరుగుతున్నాయి.
ఇక టీ20 ప్రపంచకప్‌లో మొత్తంగా అత్యధిక ఫోర్లు కొట్టిన బ్యాటర్ల లిస్టులో శ్రీలంక స్టార్ ప్లేయర్ మహేల జయవర్ధనే టాప్ లో ఉన్నాడు. జయవర్ధనే అత్యధికంగా 111 ఫోర్లు కొట్టాడు.
టీ20 ప్రపంచ కప్ లో అత్యధిక ఫోర్లు కొట్టిన జాబితాలో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. కింగ్ కోహ్లీ ఇప్పటి వరకు 105 ఫోర్లు కొట్టాడు.
టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ 102 ఫోర్లు కొట్టాడు. ఈ జాబితాలో వార్నర్ భాయ్ మూడో స్థానంలో ఉన్నాడు.
టీ20 ప్రపంచ కప్ లో శ్రీలంక మాజీ ప్లేయర్ తిలకరత్నే దిల్షాన్ కూడా అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టాడు. అతను ఈ మెగా టోర్నీలో 101 ఫోర్లు కొట్టాడు. ఈ లిస్టులో నాల్గో స్థానంలో ఉన్నాడు.
Rohit Sharma
టీమిండియా స్టార్, కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు 100 ఫోర్లు కొట్టాడు. దీంతో హిట్ మ్యాచ్ టీ20 ప్రపంచ కప్ లో అత్యధిక ఫోర్లు కొట్టిన ప్లేయర్ల జాబితాలో టాప్-5 లో చోటుసంపాదించాడు.
అలాగే, టీ20 ప్రపంచకప్‌లో జోస్ బట్లర్ 81 ఫోర్లు, క్రిస్ గేల్ 78 ఫోర్లు, బంగ్లాదేశ్ దిగ్గజ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ 74 ఫోర్లు బాదారు. న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్లు కేన్ విలియమ్సన్ 71, బ్రెండన్ మెకల్లమ్ 67 ఫోర్లు కొట్టారు.