T20 World Cup 2024 : టీ20 ప్రపంచ కప్ 2024 లో ఆఫ్ఘనిస్తాన్ తో పాటు ఇంకా చిన్న జట్లు కూడా అద్భుతం చేశాయి. దెబ్బకు మాజీ ఛాంపియన్ జట్లు సైతం ఇంటిదారి పట్టాయి. ఇలా ఈ ప్రపంచ కప్ లో ఏవరూ అనుకోని విధంగా వివిధ జట్లకు షాకిచ్చిన ఘటనలు గమనిస్తే..
ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 148 పరుగులు చేసింది. అనంతరం టార్గెట్ ఛేదనలో ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ 21 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
అంతర్జాతీయ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ జట్టు తొలిసారి ఆస్ట్రేలియాను ఓడించింది. ఇంతకు ముందు 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. కానీ, ఈ సారి సక్సెస్ అయింది. అఫ్గాన్ జట్టు కూడా గతేడాది వన్డే ప్రపంచకప్ లో అద్భుతమైన ఆటతో ముందుకు సాగింది కానీ, కొన్ని తప్పిదాల కారణంగా ఓడిపోయింది. గ్లెన్ మాక్స్‌వెల్‌కు లైఫ్ సపోర్టు లభించింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న అతను డబుల్ సెంచరీ సాధించి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
మాజీ ఛాంపియన్‌కు షాకిచ్చిన అమెరికా
ఈ ప్రపంచ కప్ లో సంచలనాలకు మారుపేరు అమెరికా క్రికెట్ జట్టు. కెనడాపై గెలిచిన తర్వాత అమెరికా మాజీ ఛాంపియన్ పాకిస్థాన్‌ను ఓడించింది. పాక్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. అనంతరం అమెరికా 20 ఓవర్లలో 3 వికెట్లకు 159 పరుగులతో మ్యాచ్ ను సూపర్ ఓవర్ కు తీసుకెళ్లింది. సూపర్ ఓవర్‌కు చేరుకున్న ఈ మ్యాచ్‌లో అమెరికా ఉత్కంఠ విజయం సాధించింది. ఈ ఓటమి పాక్ జట్టుకు భారంగా పడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. 2009లో చాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు అమెరికా కారణంగా టోర్నీ నుంచే నిష్క్రమించింది.
న్యూజిలాండ్ సైతం..
పాకిస్థాన్ తర్వాత న్యూజిలాండ్ జట్టు కూడా అనూహ్యంగా మెగా టోర్నీ నుంచి ఔట్ అయింది. టీ20 ప్రపంచ కప్ 2024 14వ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ చేతిలో ఓడిపోయింది. న్యూజిలాండ్‌పై 5 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆఫ్ఘన్ జట్టు సాధించిన తొలి విజయం ఇది. ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు చేసింది. అనంతరం 15.2 ఓవర్లలో కివీస్ జట్టు 75 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో 84 పరుగుల తేడాతో ఓడిపోయింది. టీ20 ప్రపంచకప్‌లో పరుగుల పరంగా ఇది అతిపెద్ద ఓటమి. మాజీ ఛాంపియన్ జట్టు ఇలా ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
మాజీ చాంపియన్ శ్రీలంక కూడా..
మాజీ చాంపియన్ శ్రీలంక చూడా ఓటములతో టోర్నీ నుంచి ఔట్ అయింది. బంగ్లాదేశ్-శ్రీలంక మధ్య గత కొన్నేళ్లుగా పోటీ చాలా ఉత్కంఠభరితంగా గేమ్ ఉంటుంది. ఈసారి డల్లాస్‌లో బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకకు షాకిచ్చింది. దీంతో శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 124 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్ 19 ఓవర్లలో 8 వికెట్లకు 125 పరుగులు చేసి విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్‌లో 2014 ఛాంపియన్ టీమ్‌ను ఓడించి బంగ్లాదేశ్ భారీ విజయాన్ని అందుకుంది. ఈ ఓటమి కారణంగా లంక జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.