Cheteshwar Pujara: గత కొద్దికాలంగా ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్న టీమిండియా వెటరన్ ఛతేశ్వర్ పుజారా.. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్సులో మెరుగైన ప్రదర్శన చేశాడు.
టీమిండియా నయావాల్ కు ఏమైంది..? పుజారా కెరీర్ ముగిసినట్టేనా..? ఇక ఈ సిరీస్ లాస్ట్.. ఇందులో ఫెయిలైతే అంతే.. గత కొన్నాళ్లుగా టీమిండియా వెటరన్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారాపై వస్తున్న విమర్శలివి. కానీ వాటన్నింటికీ తన బ్యాట్ తోనే సమాధానం చెబుతానంటున్నాడు ఈ నయావాల్.
28
బయట పిచ్చివాగుడు వాగే వాళ్లను తాను పట్టించుకోనని, ఫామ్ లో లేకున్నా తనకు టీమ్ మేనేజ్మెంట్ ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
38
దక్షిణాఫ్రికాతో జరుగతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట అనంతరం పుజారా మాట్లాడుతూ... ‘టీమ్ మేనేజ్మెంట్ నాకు ఎప్పుడూ మద్దతుగా నిలిచింది. నేను ఫామ్ లో లేకున్నా నాకు సపోర్ట్ చేసింది. ఇక నా ఫామ్ గురించి బయటివాళ్లు చేస్తున్న విమర్శలను నేను అస్సలు పట్టించుకోను.
48
టీమ్ మేనేజ్మెంట్ తో పాటు కోచింగ్ స్టాఫ్, కెప్టెన్, ఇతర ఆటగాళ్లు నాకు ఎప్పుడూ మద్దతుగా నిలిచారు. మేము ఎప్పుడూ కష్టపడే ఆడతాం. అయితే ఆ ప్రక్రియలో కొన్నిసార్లు మేము భారీ పరుగులు చేయలేకపోవచ్చు.
58
కానీ క్రికెటర్ గా ముఖ్యమైన విషయం ఏంటంటే.. సరైన దినచర్యను అనుసరించడం.. పని పట్ల నిబద్ధతను కలిగి ఉండి ఆటకోసం పాటుపడటం..’ అని పుజారా తెలిపాడు.
68
దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు పేలవ ఫామ్ తో ఉన్న పుజారా.. ఈ సిరీస్ ను గోల్డెన్ డక్ తో ప్రారంభించాడు. సెంచూరియన్ లో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో అతడు సున్నా పరుగులకే నిష్క్రమించాడు. రెండో ఇన్నింగ్సులో కూడా 16 పరుగులకే ఔటయ్యాడు.
78
ఇక జోహన్నస్బర్గ్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 33 బంతులాడి 3 పరుగులే చేసిన పుజారా.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం ఆకట్టుకున్నాడు. టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు 86 బంతుల్లో 53 రన్స్ చేశాడు.
88
తనతో పాటే ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్న మరో ఆటగాడు అజింక్యా రహానే తో కలిసి వందకు పైగా పరుగులు జోడించి విమర్శకుల నోళ్లు మూయించాడు.