India Vs South Africa: సుమారు ఏడాదిన్నరగా ఫామ్ లేమితో తంటాలు పడుతున్న టీమిండియా వెటరన్లు ఎట్టకేలకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేశారు. చివరి అవకాశాలు కూడా ముగిశాయని హెచ్చరికలు వినిపిస్తున్న నేపథ్యంలో వాళ్లలోని పాత ఆటగాళ్లను బయటకు తీశారు.
గత కొద్దికాలంగా ఆ ఇద్దరిపై తీవ్ర విమర్శలు.. ఇక వాళ్ల సేవలు చాలని, జట్టు నుంచి తప్పుకుంటే బెటరని, టీమ్ కు భారంగా మారారని, పురానే (పాతబడిపోయిన) అయ్యారని.. ఇలా రకరకాలుగా విమర్శల జడవాన కురిసింది.
29
వాటిని నిజం చేయడానికి అన్నట్టు.. ఆ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు ఛటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే లు కూడా వరుస టెస్టులలో పేలవమైన ఆటతీరుతో జట్టులో స్థానం కూడా కోల్పోయే ప్రమాదంలో పడ్డారు.
39
కానీ అవసరమున్న సమయంలో వారిలోని అసలు ప్రతిభ బయటపడింది. జోహన్నస్బర్గ్ లోని వాండరర్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఈ ఇద్దరు వెటరన్ ఆటగాళ్లు టీమిండియాను ఆదుకున్నారు.
49
విరాట్ కోహ్లీ గైర్హాజరీ నేపథ్యంలో కచ్చితంగా ఆడాల్సిన బాధ్యత వారి భుజాల మీద పడింది. దీంతో ఈ ఇద్దరూ నిలకడగా ఆడి అభిమానులకు టెస్టు క్రికెట్ మజాను పంచడమే గాక తలో హాఫ్ సెంచరీ సాధించి భారత్ కు ఆధిక్యాన్ని పెంచారు.
59
తొలి టెస్టుతో పాటు రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో విఫలమైన ఛటేశ్వర్ పుజారా.. 85 బంతులాడి 53 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు కూడా ఉండటం విశేషం
69
ఇక ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ అయి తీవ్ర విమర్శల పాలైన రహానే కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేసి ఫర్వాలేదనిపించాడు. 78 బంతులాడిన రహానే.. 58 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, ఒక సిక్సర్ కూడా ఉంది.
79
ఈ ఇద్దరూ కలిసి అబేధ్యమైన మూడో వికెట్ కు 111` పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అయితే హాఫ్ సెంచరీలు పూర్తి చేసి భారీ స్కోరు దిశగా కన్నేసిన ఈ జోడీని రబాడా విడదీశాడు.
89
రబాడా బౌలింగ్ లో రహానే.. వికెట్ కీపర్ వెరెన్నేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అదే రబాడా.. పుజారాను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. ఏదేమైనా గత కొద్దికాలంగా ఫామ్ లేమితో తంటాలు పడుతూ.. జట్టులో స్థానం కోల్పోయే ప్రమాదంలో పడ్డ ఈ ఇద్దరికీ రెండో ఇన్నింగ్స్ ఆట ఊపిరి పోసిందని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.
99
ఇదదిలాఉండగా.. రెండో ఇన్నింగ్స్ లో 37 ఓవర్లు ఆడిన టీమిండియా.. 4 వికెట్లు కోల్పోయి163 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా ఆధిక్యం 136 పరుగులుగా ఉంది. హనుమా విహారి (1 నాటౌట్), రిషభ్ పంత్ (0 నాటౌట్) క్రీజులో ఉన్నారు.