Ind Vs SA: తేడా వచ్చిందో.. రిటర్న్ ఫ్లైట్ ఎక్కడమే.. సీఎస్ఏ నుంచి గ్యారంటీ తీసుకున్న బీసీసీఐ

Published : Dec 22, 2021, 02:09 PM IST

India Tour Of South Africa: ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా దక్షిణాఫ్రికాలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు.. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు నుంచి  పరిపూర్ణ హామీ  తీసుకుంది.  

PREV
17
Ind Vs SA: తేడా వచ్చిందో.. రిటర్న్ ఫ్లైట్ ఎక్కడమే.. సీఎస్ఏ నుంచి గ్యారంటీ తీసుకున్న  బీసీసీఐ

మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడటానికి దక్షిణాఫ్రికా వెళ్లిన విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా.. ఈనెల 26 నుంచి సెంచూరీయన్ వేదికగా మొదలయ్యే టెస్టుతో సిరీస్ వేటను ప్రారంభించనున్నది. అయితే సిరీస్ జరుగుతుండగా పరిస్థితులు చేయి దాటిపోతే మాత్రం అక్కడ్నుంచి బ్యాగులు సర్దుకోని రానుంది. 

27

ఈ మేరకు క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) నుంచి గ్యారంటీ తీసుకున్నాకే.. బీసీసీఐ పర్యటనకు అంగీకారం తెలిపినట్టు సమాచారం. దక్షిణాఫ్రికాలోనే పుట్టిన కరోనా ఒమిక్రాన్ వేరియంట్..  ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ జాగ్రత్తలు  తీసుకుంది. 

37

విశ్వసనీయ వర్గాల ప్రకారం... సిరీస్ మధ్యలో ఉండగా క్రికెటర్లకు గానీ ఇతర సిబ్బందికి  గానీ కరోనా సోకి పరిస్థితి చేయి దాటిపోయిన సందర్భంలో అక్కడ్నుంచి తక్షణమే  ఇండియాకు  తిరిగిరావడానికి అంగీకారం తెలిపితేనే తాము పర్యటనకు వస్తామని చెప్పినట్టు దక్షిణాఫ్రికా క్రికెట్ వర్గాలు తెలిపాయి. 

47

ఆ మేరకు  బీసీసీఐ కూడా.. సీఎస్ఏ నుంచి గ్యారంటీ తీసుకుందట. ఒమిక్రాన్ నేపథ్యంలో ఇప్పటికే వారం రోజుల పాటు వాయిదా పడి.. షెడ్యూల్ కూడా కుదించిన విషయం తెలిసిందే.

57

ఇదే విషయమై సీఎస్ఏ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షుయామ్ మంజ్రా మాట్లాడుతూ.. ‘బీసీసీఐ  కోరిన ప్రతిపాదనకు సౌతాఫ్రికా ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఒమిక్రాన్ నేపథ్యంలో దేశంలో రాకపోకలు లేకపోయినా.. సరిహద్దులను మూసేసినా పరిస్థితులు చేయిదాటితే టీమిండియాను మాత్రం పంపించడానికి అంగీకారం తెలిపింది...’ అని అన్నాడు. 

67

‘అయితే మేము సిరీస్ సజావుగా సాగడానికి చూస్తున్నాం. ఆమేరకు బయో బబుల్ నిబంధనలు కూడా కఠినంగా అమలు చేస్తున్నాం...’ అని తెలిపాడు. కరోనా వ్యాప్తి కారణంగా ప్రేక్షకులు లేకుండానే టెస్టు సిరీస్ జరుపనున్నారు.  జనవరి 3 నుంచి జరిగే రెండో టెస్టులో కూడా  ప్రేక్షకులను అనుమతించబోమని  సౌతాఫ్రికా క్రికెట్ వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. 

77

భారత, దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు ప్రత్యేకంగా ఒక హోటల్ ను బుక్ చేసిన సీఎస్ఏ.. అక్కడి తగు భద్రతా చర్యలు తీసుకుంటుంది. హోటల్ సిబ్బందికి రెగ్యూలర్ గా  పరీక్షలు, బయట వ్యక్తులను లోపలికి అనుమతించకపోవడం.. వంటివి చేస్తున్నది. ఒకవేళ ఆటగాళ్లు ఎవరైనా గాయాలపాలైతే వారికి ప్రత్యేకంగా చికిత్స అందించడానికి కూడా అవసరమైన ఏర్పాట్లను కూడా సీఎస్ఏ పూర్తి చేసింది. 

Read more Photos on
click me!

Recommended Stories