ఆ ముగ్గురి కోసం ఈవెంట్‌నే క్యాన్సిల్ చేసిన ఎమ్మెస్ ధోనీ... అందుకే మాహీ అంటే వారికి...

Published : Dec 21, 2021, 04:47 PM IST

టీమిండియా కెప్టెన్‌గా, ఐపీఎల్‌‌లో సీఎస్‌కే కెప్టెన్‌గా కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ. ముఖ్యంగా టీమ్‌లోనే మాహీకి అభిమానులు ఉండేవాళ్లు... 

PREV
18
ఆ ముగ్గురి కోసం ఈవెంట్‌నే క్యాన్సిల్ చేసిన ఎమ్మెస్ ధోనీ... అందుకే మాహీ అంటే వారికి...

సురేష్ రైనా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. ఆర్‌పీ సింగ్, చాహాల్, కుల్దీప్ యాదవ్... ఇలా మాహీ అంటే ప్రత్యేకమైన అభిమానం పెంచుకున్నవాళ్లు ఎందరో..

28

మాహీ అంటే ప్లేయర్లకు ఎందుకింత అభిమానం? విరాట్ కోహ్లీ సంపాదించుకోలేకపోయిన స్థానాన్ని, మాహీ ఎలా దక్కించుకున్నాడు... దీనికి ఓ పర్ఫెక్ట్ సమాధానం చెప్పాడు భారత మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టన్...

38

‘2011 వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి ముందు భారత జట్టుని బెంగళూరులోని ఓ ప్లైట్ స్కూల్‌కి ఆహ్వానించారు... అందరూ ఆ ఈవెంట్‌కి వెళ్లాం...

48

అక్కడికి వెళ్లిన తర్వాత విదేశీయులకు ఫ్లైట్ స్కూల్‌కి అనుమతి లేదని తెలిసింది. అప్పటికే మా గ్రూప్‌లో ముగ్గురం ఫారినర్స్ ఉన్నాం...

58

నాతో పాటు పాడీ అప్టన్, ఎరిక్ సిమ్మన్స్...  భద్రతా కారణాల దృష్ట్యా మమ్మల్ని ప్లైట్ స్కూల్‌కి అనుమతించలేమని నిర్వహకులు చెప్పారు...

68

వెంటనే మాహీ, వాళ్లు రాకపోతే మేం కూడా రాలేమంటూ మొత్తం ఈవెంట్‌నే క్యాన్సిల్ చేసేశాడు. వాళ్లు మాతో ఉన్నన్ని రోజులు, మా వాళ్లే. వాళ్లను వేరు చేసి చూడలేము... అని మాహీ చెప్పిన మాటలు ఎప్పటికీ మరిచిపోలేను...

78

నేను కోచ్‌గా, ప్లేయర్‌గా ఎంతో మంది కెప్టెన్లను చూశాను. అయితే మహీ, ప్లేయర్లకు, టీమ్‌కి ఇచ్చే గౌరవం, ప్రాధాన్యం మాత్రం ఎక్కడా చూడలేదు...’ అంటూ చెప్పుకొచ్చాడు గ్యారీ కిర్‌స్టన్...

88

మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో టీమిండియా 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన సమయంలో భారత జట్టు హెడ్ కోచ్‌గా ఉన్నాడు గ్యారీ కిర్‌స్టన్...

Read more Photos on
click me!

Recommended Stories