Rohit Sharma: ఎందుకంత క్రూరంగా ఉన్నావ్..? రోహిత్ శర్మపై భార్య రితికా ఘాటు కామెంట్స్

Published : Jan 12, 2022, 07:44 PM IST

Rohit Sharma Wife Hilarious Comment On Him: పరిమిత ఓవర్ల క్రికెట్ లో భారత జట్టు సారథి రోహిత్ శర్మ భార్య రితికా.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఆమె తన భర్త షేర్ చేసిన ఓ పోస్టుపై ట్రోల్ చేస్తూ...   

PREV
16
Rohit Sharma: ఎందుకంత క్రూరంగా ఉన్నావ్..? రోహిత్ శర్మపై భార్య రితికా ఘాటు కామెంట్స్

టీమిండియా పరిమిత ఓవర్ల సారథి రోహిత్ శర్మ  ప్రస్తుతం ఖాళీ సమయాన్ని ఫిట్నెస్ మీద దృష్టి సారించాడు. దక్షిణాఫ్రికా తో పర్యటనకు ముందు గాయపడ్డ రోహిత్.. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో రిహాబిటేషన్ గడుపుతున్నాడు.

26

ఈ క్రమంలో అతడు తన సోషల్ మీడియా ఖాతాల వేదికగా కొత్త లుక్ కు సంబంధించిన ఫోటోను షేర్ చేశాడు. ఫోటోలో అతడు  తీక్షణంగా చూస్తున్నట్టు  ఫోజ్ పెట్టాడు. 
 

36

ఈ ఫోటోలో రోహిత్ శర్మ  క్లీన్ షేవ్ తో యువకుడిగా మారిపోయాడు. ఎప్పుడూ తన ముఖంపై లైట్ గా గడ్డంతో కనిపించే  ఈ హిట్ మ్యాన్.. క్లీన్ షేవ్ తో యంగ్ రోహిత్ శర్మగా మారిపోయాడు.  

46

ఇక ఈ ఫోటోపై రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే ఓ ఫన్నీ కామెంట్ చేసింది. రితికా స్పందిస్తూ... ‘ఎందుకంత క్రూరంగా చూస్తున్నావ్..?’ అని  రాసుకొచ్చింది. 

56

రోహిత్ పోస్టుపై టీమిండియా యువ లెఫ్టార్మ్ బౌలర్ ఖలీల్ అహ్మద్ స్పందిస్తూ.. ‘ఇది అండర్-19 లుక్’ అని కామెంట్ పెట్టాడు. 
 

66

కాగా.. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు దూరమైన రోహిత్ శర్మ ఫిబ్రవరిలో వెస్టిండీస్, శ్రీలంక లతో జరిగే పరిమిత ఓవర్ల  సిరీస్ లకు అందుబాటులో ఉండనున్నాడని సమాచారం. 
 

Read more Photos on
click me!

Recommended Stories