బుమ్రా కాదు గిల్ కాదు.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ ఎవ‌రు?

First Published | Jan 16, 2025, 5:04 PM IST

Team India: రోహిత్ శ‌ర్మ ఇప్ప‌టికే టీ20 క్రికెట్ కు వీడ్కోలు ప‌లికాడు. వ‌న్డే  క్రికెట్, టెస్టు క్రికెట్ కు కూడా వీడ్కోలు అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. అయితే, రోహిత్ శ‌ర్మ త‌ర్వాత భార‌త క్రికెట్ జ‌ట్టుకు కాబోయే కెప్టెన్ ఎవ‌రు?  రేసులో ఉన్న‌ది ఎవ‌రు? 
 

Team India: భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఎక్కువ కాలం కొనసాగే అవకాశం లేదు. ఇప్ప‌టికే టీ20 క్రికెట్ కు వీడ్కోలు ప‌లికాడు. ప్ర‌స్తుతం వ‌న్డే, టెస్టు క్రికెట్ లో భార‌త జ‌ట్టుకు కెప్టెన్ గా కొన‌సాగుతున్నాడు. అయితే, కొన్ని నివేదికల ప్రకారం రోహిత్ శ‌ర్మ ఇంకా కొంతకాలం భారత కెప్టెన్‌గా కొనసాగాలని తన కోరికను వ్యక్తం చేశాడు. అంత‌లోపు భారత జ‌ట్టును న‌డిపించే నాయ‌కుడిని గుర్తించ‌మ‌ని బీసీసీఐని కోరాడు. 

రోహిత్ శర్మ తర్వాత, జస్ప్రీత్ బుమ్రా టీమ్ ఇండియాకు మెరుగైన కెప్టెన్‌గా నిరూపించగలడని చాలా మంది అనుభవజ్ఞులు భావిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో యంగ్ ప్లేయ‌ర్ శుభ్ మ‌న్ గిల్ బెస్ట్ ఆప్షన్ అని కొందరు అంటున్నారు. వీరితో పాటు మ‌రో ఇద్ద‌రు ప్లేయ‌ర్లు భారత జ‌ట్టు కెప్టెన్సీ రేసులోకి వ‌చ్చారు.

భార‌త జ‌ట్టు కెప్టెన్సీ రేసులో ముందున్న బుమ్రా

రోహిత్ శర్మ తర్వాత టీమ్ ఇండియా కెప్టెన్ రేసులో ఎవరైనా ముందు వరుసలో ఉంటే అది స్టార్ బౌల‌ర్ జస్ప్రీత్ బుమ్రా అని చెప్పాలి. కానీ పనిభారం కారణంగా పేసర్ అనేక సిరీస్‌లకు దూరమయ్యే అవకాశం ఉందని, అతను భారత్‌కు నాయకత్వం వహించడానికి మంచి ఎంపిక విష‌యంలో కొత్త చ‌ర్చ‌కు తెర‌లేపాడు. 

ఇదే స‌మ‌యంలో శుభ్ మ‌న్ గిల్ గురించి కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి. వీరిద్ద‌రినీ కాద‌ని ఇప్పుడు భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మరో ఇద్దరి పేర్లను తీసుకున్నాడు. రోహిత్ శర్మ స్థానంలో బుమ్రా లేదా గిల్ లేదా యశస్వి జైస్వాల్ లేదా రిషబ్ పంత్ భారత కెప్టెన్‌గా చూసే అంశాల‌ను ప్ర‌స్తావించారు.


Yashasvi Jaiswal-Jasprit Bumrah

రోహిత్ శ‌ర్మ లాగా ఉండ‌లేరు !

కొత్త‌గా ఇప్పుడు ఏ ప్లేయ‌ర్ కెప్టెన్ గా వ‌చ్చిన రోహిత్ శ‌ర్మ లాగా ఉండ‌లేర‌ని అకాశ్ చోప్రా అభిప్రాయ‌ప‌డ్డారు. చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో..  'యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ - ఎవరు కెప్టెన్ కావచ్చు? ఇది మంచి ప్రశ్న, ఎందుకంటే మూలాల ప్రకారం, అతను కొన్ని నెలల పాటు జట్టును నిర్వహిస్తానని రోహిత్ చెప్పాడు, కానీ ఆ తర్వాత, మీరు (BCCI) మీకు కావలసిన వారిని కనుగొనవచ్చు. బుమ్రాతో గాయం సమస్యలు ఉండవచ్చు కాబట్టి, ఇది పెద్ద విష‌యమే' అని చెప్పారు.

Virat Kohli-Jasprit Bumrah

ఇంగ్లాండ్ పర్యటనకు జస్ప్రీత్ బుమ్రాను కెప్టెన్ !

బీసీసీఐకి సలహా ఇస్తూ, ఇంగ్లాండ్ పర్యటనకు జస్ప్రీత్ బుమ్రాను కెప్టెన్‌గా నియమించాలని ఆకాశ్ చోప్రా చెప్పాడు. అలాగే, బుమ్రా వైస్ కెప్టెన్‌గా టూర్‌కు దీర్ఘకాలిక కెప్టెన్‌గా ఉండాలనుకునే ఆటగాడిని ఎంచుకోవాలి. 'నా దగ్గర ఒక పరిష్కారం ఉంది, దానిని మనం 6 నెలల తర్వాత చూడాలి. ఒకవేళ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్ పర్యటన మొత్తానికి కెప్టెన్‌గా ఉంటే, సరిగ్గా వైస్ కెప్టెన్‌ని నియమించండి, ఎందుకంటే మీరు అతనిని కెప్టెన్ గా తీర్చిదిద్దాలి' అని చెప్పాడు.

Image Credit: Getty Images

రోహిత్ రిటైర్మెంట్ కానున్నారా? 

గ‌తేడాది రోహిత్ శ‌ర్మ ప‌రుగులు చేయ‌డంలో తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. వ‌న్డే, టెస్టు క్రికెట్ లో అత‌ని ప్ర‌ద‌ర్శ‌న నుంచి భారీ ప‌రుగులు రావ‌డం లేదు. కీల‌క‌మైన బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో ఘోరంగా విఫ‌లం కావ‌డంతో చివ‌రి మ్యాచ్ కూడా ఆలేక‌పోయాడు.

ఆసీస్ తో సిరీస్ ముగిసిన త‌ర్వాత రోహిత్ శ‌ర్మ టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తార‌ని క్రిక‌ట్ స‌ర్కిల్ లో చ‌ర్చ సాగింది. మాజీ క్రికెట‌ర్లు సైతం జ‌ట్టు నుంచి త‌ప్పించ‌క‌ముందే రిటైర్మెంట్ తీసుకోవాలంటూ స‌ల‌హాలు ఇచ్చారు. కానీ, రోహిత్ శ‌ర్మ ఎవ‌రూ ఊహించ‌ని విధంగా త‌నకు ఎవ‌రూ ఊరికే కెప్టెన్సీని ఇవ్వ‌లేద‌నీ, త‌న స‌త్తాను చూసి అక్క‌డ కూర్చోబెట్టారంటూ త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు ఘాటుగానే స్పందించారు. రిటైర్మెంట్ ఇప్పుడే తీసుకోవ‌డం లేదంటూ సూచ‌న‌లు పంపారు.

Latest Videos

click me!