India-W vs Ireland-W: ప్ర‌తీకా రావ‌ల్ సూప‌ర్ సెంచ‌రీ.. ఐర్లాండ్ కు దిమ్మ‌దిరిగిపోయింది !

First Published | Jan 15, 2025, 4:31 PM IST

india women vs ireland women: భారత మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధానతో పాటు యంగ్ ప్లేయ‌ర్ ప్ర‌తీకా రావ‌ల్ అద్భుత‌మైన సెంచ‌రీతో ఐర్లాండ్ బౌలింగ్ ను చిత్తుచేశారు. 
 

Pratika Rawal

india women vs ireland women: పండ‌గ రోజు భార‌త మహిళల జట్టు ప్లేయ‌ర్లు ఐర్లాండ్ ను బౌలింగ్ ను దంచి కొట్టారు. రాజ్ కోట్ లో ప‌రుగుల వ‌ర‌ద‌పారించారు. రికార్డు సెంచ‌రీల‌తో చ‌రిత్ర సృష్టించారు. ప్రస్తుతం ఐర్లాండ్ మహిళల జట్టుతో భార‌త మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టు వన్డే సిరీస్ ఆడుతోంది. తొలి రెండు మ్యాచ్ ల‌లో అద్భుత‌మైన ఆట‌తో ఐర్లాండ్ కు షాకిచ్చిన భార‌త మహిళ‌ల జ‌ట్టు మూడో వ‌న్డేలోనూ ఐర్లాండ్ బౌలింగ్ ను చిత్తు చేసింది.

Smriti Mandhana, Pratika Rawal

ఐర్లాండ్ పై సెంచ‌రీల మోత మోగించిన స్మృతి మంధాన, ప్ర‌తీకా రావ‌ల్

రాజ్ కోట్ వేదిక‌గా జ‌రిగిన మూడో వ‌న్డే లో భార‌త మహిళా ప్లేయ‌ర్లు ధ‌నాధ‌న్ బ్యాటింగ్ తో అద‌ర‌గొట్టారు. స్మృతి మంధాన, ప్ర‌తీకా రావ‌ల్ సెంచ‌రీల‌తో అద‌ర‌గొట్టారు. వీరిద్ద‌రి అద్భుత ఇన్నింగ్స్ ల‌తో 50 ఓవ‌ర్ల‌లో భార‌త జ‌ట్టు 5 వికెట్లు కోల్పోయి 435 ప‌రుగులు చేసింది. 

ఐర్లాండ్ తో జ‌రిగిన మూడో వ‌న్డే మ్యాచ్ లో భారత మహిళల జ‌ట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భార‌త్ కు అద్భుత‌మైన ఆరంభం ల‌భించింది. భార‌త ఓపెనింగ్ బ్యాట‌ర్లు ప్రతీకా రావల్, స్మృతి మంధానలు సెంచ‌రీలు సాధించారు. స్మృతి మంధాన 80 బంతుల్లోనే 135 ప‌రుగుల ఇన్నింగ్స్ ఆడారు. త‌న ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు, 7 సిక్స‌ర్లు కొట్టారు.


Pratika Rawal

బ్యాట్ తో అద‌ర‌గొట్టిన ప్ర‌తీకా రావ‌ల్

అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో స్మృతి మంధానకు బలమైన భాగస్వామి దొరికారు. పరిస్థితికి తగ్గట్టుగా బ్యాటింగ్ చేస్తూ పరుగులు చేస్తున్న ఆ ప్లేయ‌ర్ మ‌రెవ‌రో కాదు ప్రతీకా రావల్. జనవరి 15 బుధవారం ఆమె త‌న వ‌న్డే అంతర్జాతీయ కెరీర్‌లో మొదటి సెంచరీని సాధించారు. ఐర్లాండ్ బౌలింగ్ పై విరుచుకుప‌డుతూ 154 ప‌రుగులు ఇన్నింగ్స్ ఆడారు. త‌న ఇన్నింగ్స్ లో ప్ర‌తీకా రావ‌ల్ 20 ఫోర్లు, ఒక సిక్స‌ర్ బాదారు. 

ప్ర‌తీకా రావ‌ల్ త‌న కెరీర్‌లో తొలి 6 మ్యాచ్‌ల్లో అద్భుత‌మైన ఇన్నింగ్స్ ల‌తో చాలా పరుగులు చేశాడు. రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో ఐర్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో ప్రతీకా రావల్ 100 బంతుల్లో సెంచరీ సాధించింది. ఈ స‌మ‌యంలో 14 ఫోర్లు బాదాడు. ఆ త‌ర్వాత కూడా ఆమె బ్యాట్ నుంచి ప‌రుగులు వ‌చ్చ‌యి. 

India Women, cricket,

ఒక ఎండ్ లో స్మృతి మంధాన.. మ‌రో ఎండ్ లో ప్ర‌తీకా రావ‌ల్ 

ఐర్లాండ్ తో జ‌రిగిన మూడో వ‌న్డే మ్యాచ్ లో భార‌త ప్లేయ‌ర్లు స్మృతి మంధాన, ప్ర‌తీకా రావ‌ల్ పోటీ ప‌డుతూ ప‌రుగులు రాబ‌ట్టారు. ఒక ఎండ్ లో ఫోర్లు,  సిక్స‌ర్లు బాదుతూ స్మృతి మంధాన ప‌రుగుల సునామీ సృష్టించ‌గా, మ‌రో ఎండ్ లో ప్ర‌తీకా రావ‌ల్ క్లాసిక్ ఇన్నింగ్స్ తో అద‌ర‌గొట్టారు. 

ఈ ఇన్నింగ్స్‌లో స్మృతి మంధాన బ్యాట్‌ నుంచి తుఫాను సెంచరీ వచ్చింది. మంధాన ఒక ఎండ్‌ నుంచి వేగంగా బ్యాటింగ్‌ చేస్తుండగా, రావల్‌ ఒక ఎండ్‌లో నిలబడి స్ట్రైక్‌ను తిప్పుతూ స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించారు. మంధాన వికెట్ పడిన వెంటనే ప్రతీక తన వేగం పెంచి తన వన్డే అంతర్జాతీయ కెరీర్‌లో తొలి సెంచరీని పూర్తి చేసింది.

India Women, cricket,

అద్భుతంగా కెరీర్ ప్రారంభించిన ప్ర‌తీకా రావ‌ల్

24 ఏళ్ల ప్రతీకా రావల్ ఇంతకు ముందు 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడింది. ఆ ఐదు మ్యాచ్‌లలో ఆమె 290 పరుగులు చేయగలిగింది. త‌న ఆరో మ్యాచ్ లో సెంచ‌రీ బాది తన మొదటి 6 మ్యాచ్‌లలో 400 పరుగుల మార్కును దాటింది.

ఐర్లాండ్‌తో జరిగిన మూడవ వ‌న్డేలో ప్ర‌తీకా రావ‌ల్ 154 ప‌రుగులు ఇన్నింగ్స్ ఆడారు. త‌న క్లాసీ సెంచ‌రీ ఇన్నింగ్స్ తో 20 ఫోర్లు, ఒక సిక్స‌ర్ బాదారు. ఆమె 119 స్ట్రైక్ రేటుతో ప‌రుగులు రాబ‌ట్టారు. ఇక త‌న అరంగేట్రం మ్యాచ్‌లో కూడా తన బ్యాట్‌తో 40 పరుగులు చేశాడు. తర్వాతి మ్యాచ్‌లో ప్రతీక 76 పరుగుల ఇన్నింగ్స్ ఆడింది. ఐర్లాండ్ తో జ‌రిగిన మూడు వ‌న్డేల సిరీస్ లో ఆమె రెండు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ సాధించారు.

Latest Videos

click me!