Image Credit: Getty Images
india women vs ireland women: ఐర్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శనతో దుమ్మురేపింది. 3వ వన్డేలో భారత మహిళలు 304 పరుగుల తేడాతో ఐర్లాండ్ మహిళలను ఓడించి 3-0తో వైట్‌వాష్ చేశారు.
స్మృతి మంధాన, ప్రతీకా రావల్ సెంచరీలతో చెలరేగడంతో భారత్ 435/5తో భారీ స్కోరు చేసింది. వన్డేల్లో భారత్ (పురుషుల జట్టు, మహిళల జట్టు) చేసిన అత్యధిక స్కోరు ఇదే. భారీ ఛేదనలో ఐర్లాండ్ 131 పరుగులకే ఆలౌటైంది.
ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన స్మృతి మంధాన
స్మృతి మంధాన వన్డే చరిత్రలో భారత మహిళా బ్యాటింగ్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును బుధవారం బద్దలుకొట్టింది. బుధవారం రాజ్‌కోట్‌లో ఐర్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో మంధాన 70 బంతుల్లో సెంచరీ చేసి హర్మన్‌ప్రీత్ కౌర్ పేరిట ఉన్న మునుపటి రికార్డును అధిగమించింది.
మహిళల వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రికార్డు ఆస్ట్రేలియా క్రీడాకారిణి మెగ్ లానింగ్ పేరిట ఉంది, ఈ మైలురాయిని చేరుకోవడానికి ఆమె 45 బంతులు ఆడింది.
Smriti Mandhana
కెప్టెన్ గా సూపర్ ఇన్నింగ్స్ ఆడిన స్మృతి మంధాన
రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ గైర్హాజరీలో మంధాన జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూనే ఈ సిరీస్‌లో అద్భుతమైన ఫామ్ ను కొనసాగించారు. కెప్టెన్ గా ఉంటూ ఫాస్టెస్ సెంచరీతో అదరగొట్టారు.
స్మృతి మంధాన 80 బంతుల్లో 12 ఫోర్లు, ఏడు సిక్సర్లతో 135 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ ఆడింది. టాస్ గెలిచి భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత ప్రతీకా రావల్‌తో కలిసి 233 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.
Smriti Mandhana, Pratika Rawal
హర్మన్ ప్రీత్ కౌర్ రికార్డు బ్రేక్ చేసిన స్మృతి మంధాన
గత ఏడాది బెంగళూరులో దక్షిణాఫ్రికాపై హర్మన్ ప్రీత్ కౌర్ 87 బంతుల్లో సెంచరీ చేసింది. అది భారత మహిళా వన్డే క్రికెట్ లో ఫాస్టెస్ట్ సెంచరీ. అయితే, బుధవారం స్మృతి మంధాన ధనాధన్ ఇన్నింగ్స్ హర్మత్ ప్రీత్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు బద్దలు అయింది. మహిళల వన్డే చరిత్రలో భారత బ్యాటింగ్‌లో అత్యంత వేగవంతమైనన సెంచరీని స్మృతి మంధాన సాధించింది.
మొత్తంమీద, మాజీ ఇంగ్లండ్ క్రికెటర్ షార్లెట్ ఎడ్వర్డ్స్‌తో కలిసి మహిళల వన్డే క్రికెట్ లో మంధాన చేసిన సెంచరీ ఉమ్మడి-ఏడవ వేగవంతమైన సెంచరీగా నిలిచింది.
Smriti Mandhana
కెరీర్ లో 10 సెంచరీ కొట్టిన స్మృతి మంధాన
స్మృతి మంధాన తన వన్డే క్రికెట్ కెరీర్ లో 10వ సెంచరీ సాధించారు. స్మృతి మంధాన ఇంగ్లండ్‌కు చెందిన టామీ బ్యూమాంట్‌తో పాటు మహిళల వన్డే క్రికెట్ లో అత్యధిక సెంచరీల ఆల్-టైమ్ జాబితాలో ఉమ్మడి మూడవ స్థానానికి చేరుకుంది.
ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మెగ్ లానింగ్ (15), న్యూజిలాండ్‌కు చెందిన సుజీ బేట్స్ (13) అత్యధిక సెంచరీల వన్డే ప్లేయర్ల జాబితాలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.
Smriti Mandhana
అద్భుతమైన ఫామ్ లో స్మృతి మంధాన
ఐర్లాండ్ తో జరిగిన సిరీస్ మొత్తంగా స్మృతి మంధాన మంచి ఇన్నింగ్స్ లను ఆడారు. 28 ఏళ్ల ఈ ప్లేయర్ భారత్-ఐర్లాండ్ వన్డే సిరీస్ లోని తొలి మ్యాచ్ లో 41 పరుగుల ఇన్నింగ్స్ ఆడారు. రెండో వన్డేలో 73 పరుగులు చేయడంతో భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది.
నిరంజన్ షా స్టేడియంలో జరిగిన మూడో మ్యాచ్ లో అద్భుత విజయంతో 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. భారత్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. స్మృతి మంధాన, ప్రతీకా రావల్ తొలి వికెట్‌కు డబుల్ సెంచరీతో కలిసి ఐరిష్ బౌలింగ్ ను చిత్తుచేశారు.