భారత జట్టులో చాలా మంది క్రికెటర్లు విడాకులు తీసుకున్నారు. ఈ లిస్టులో మరో ఇద్దరు ప్లేయర్లు కూడా చేరనున్నారని పలు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. టీమిండియా విడాకుల XI లిస్టును లో మనీష్ పాండే, యజువేంద్ర చాహల్ కొత్తగా చేరనున్నారని సమాచారం. అధికారికంగా వీళ్ళ నుంచి విడాకుల వార్త రాలేదు కానీ, వీళ్ళ వ్యక్తిగత జీవితంలో విడాకులు తథ్యం అనేలా ఉంది. అయితే, ఇప్పటివరకు విడాకులు తీసుకున్న భారత స్టార్ ప్లేయర్ల వివరాలు ఇలా ఉన్నాయి..
శిఖర్ ధావన్: టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్.. ఆయేషా ముఖర్జీకి 2021లో విడాకులు ఇచ్చాడు. దీంతో 8 ఏళ్ళ పెళ్లి బంధం ముగిసింది. పరస్పర ఒప్పందంతో విడిపోయామని చెప్పినా, వీళ్ళ మధ్య గొడవలు జరిగిన విషయాలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
మొహమ్మద్ అజారుద్దీన్: మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కి రెండు విడాకులయ్యాయి. మొదట నౌరీన్ ని పెళ్లి చేసుకుని, ఆమెకు విడాకులిచ్చి, సినీనటి సంగీత బిజ్లానీని 1996లో పెళ్లి చేసుకున్నాడు. బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తాతో సంబంధం వార్తలు రావడంతో 2010లో సంగీత బిజ్లానీ అజారుద్దీన్ కి విడాకులిచ్చింది.
వినోద్ కాంబ్లీ: మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ 2005లో తన చిన్ననాటి స్నేహితురాలు నియోల్లా లెవిస్ కి విడాకులిచ్చాడు. ఆ తర్వాత ఆండ్రియా హెవిట్ ని పెళ్లి చేసుకుని క్రిస్టియానిటీకి మారాడు.
రవిశాస్త్రి: టీమ్ ఇండియా ఆటగాడు, మాజీ కోచ్ రవిశాస్త్రి చిన్ననాటి స్నేహితురాలు రీతు సింగ్ ని పెళ్లి చేసుకున్నాడు. అలేఖా శాస్త్రి అనే కూతురు ఉంది. 22 ఏళ్ళ తర్వాత 2012లో విడాకులు తీసుకున్నారు.
హార్దిక్ పాండ్యా: ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా నటి నతాషా స్టాంకోవిక్ ని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరికీ అగస్త్య అనే కొడుకు ఉన్నాడు. గత ఏడాది వీళ్ళు విడాకులు తీసుకున్నారు.
దినేష్ కార్తీక్: వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ దినేష్ కార్తీక్ 2007లో నికితా వాంజారాను పెళ్లి చేసుకున్నాడు. 2012లో విడాకులయ్యాయి. నికితా ఆ తర్వాత దినేష్ కార్తీక్ టీమ్ మేట్ మురళీ విజయ్ ని పెళ్లి చేసుకుంది.
మనీష్ పాండే: కర్ణాటక బ్యాట్స్ మెన్ మనీష్ పాండే 2019లో ఆశ్రిత శెట్టిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరూ విడాకుల దిశగా వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇద్దరూ ఇన్ స్టాగ్రామ్ లో పెళ్లి ఫోటోలు తీసేశారు. అయితే, అధికారికంగా వీరి నుంచి విడాకులపై ప్రకటన రాలేదు.
మనోజ్ ప్రభాకర్: మాజీ క్రికెటర్ మనోజ్ ప్రభాకర్ 2013లో తన భార్య సంధ్యకు విడాకులిచ్చాడు. సంధ్య, మనోజ్ పై వేధింపులు, వరకట్న వేధింపుల ఆరోపణలు చేసింది. విడాకుల తర్వాత మనోజ్ ప్రభాకర్ నటి ఫర్హీన్ ని పెళ్లి చేసుకున్నాడు.
యజువేంద్ర చాహల్: స్పిన్నర్ చాహల్ కూడా విడాకుల బాటలో ఉన్నారని పలు మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. 2020లో సోషల్ మీడియా స్టార్ ధనశ్రీ వర్మని పెళ్లి చేసుకున్నాడు. అయితే, స్టార్ జోడీ అధికారికంగా విడాకులపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
జావగల్ శ్రీనాథ్: మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీనాథ్ 1999లో జ్యోత్స్నని పెళ్లి చేసుకున్నాడు. విడాకుల తర్వాత జర్నలిస్ట్ మాధవి పత్రవల్లిని 2008లో పెళ్లి చేసుకున్నాడు.