హార్దిక్ పండ్యా-జాన్వీ కపూర్ డేటింగ్ లో ఉన్నారా?
హార్దిక్ పాండ్యా, జాన్వీ కపూర్ లు కలిసి వున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే పుకార్లు వ్యాపించాయి. అయితే, ఫ్యాక్ట్ చెక్ లో ఈ ఫోటోలను పరిశీలించగా అవి నకిలీవని, వీళ్లిద్దరూ డేటింగ్ చేయడం లేదని తేలింది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా, జాన్వీ కపూర్ డేటింగ్ చేస్తున్నారనేందుకు నిజమైన ఆధారాలు దొరకలేదు. ఇంకా వీరిద్దరి ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ పేజీలను పరిశీలించినప్పుడు వాళ్లు మాల్దీవులకు వెళ్లినట్లు ఎలాంటి ఫోటోలు, వీడియోలు షేర్ చేయలేదు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన మాల్దీవుల్లో వీళ్లిద్దరూ డేటింగ్ చేస్తున్న ఫోటోకు సంబంధించిన ఇతర ఫోటోలు ఎక్కడా కనిపించలేదు. దీంతో హార్దిక్ పాండ్యా, జాన్వీ కపూర్ మాల్దీవుల్లో కలిసి తిరుగుతున్నారని చెబుతూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి, నకిలీ ఫోటోలను ఇంటర్నెట్‌లో ప్రచారం చేసినట్లు తేలింది.