Published : Oct 20, 2021, 08:31 PM ISTUpdated : Oct 20, 2021, 08:33 PM IST
టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో టీమిండియాను వెంటాడుతున్న సమస్య ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్... హార్ధిక్ పాండ్యా బౌలింగ్ చేయడానికి ఫిట్‌గా లేకపోవడంతో ఆరో బౌలింగ్ ఆప్షన్ కోసం వెతుకుతోంది భారత జట్టు...
T20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో టీమిండియాను వెంటాడుతున్న సమస్య ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్... హార్ధిక్ పాండ్యా బౌలింగ్ చేయడానికి ఫిట్‌గా లేకపోవడంతో ఆరో బౌలింగ్ ఆప్షన్ కోసం వెతుకుతోంది భారత జట్టు...
211
ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో అందరికీ సడెన్ సర్‌ప్రైజ్‌గా అనిపించిన విషయం విరాట్ కోహ్లీ బౌలింగ్... రెండో వార్మప్ మ్యాచ్‌లో విరాట్ విశ్రాంతి తీసుకోవడంతో రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించాడు..
311
అయితే రిషబ్ పంత్, మాహీతో వికెట్ కీపింగ్ మెలకువలు నేర్చుకోవడంలో బిజీగా ఉండడం, భువీ కూడా బౌలింగ్ చేస్తున్న సమయంలో గాయపడడంతో సబ్‌స్టిట్యూట్‌గా క్రీజులోకి వచ్చాడు విరాట్ కోహ్లీ...
411
క్రీజులోకి వస్తూనే రెండు బౌండరీలను ఆపి, తన స్టైల్ మెరుపు ఫీల్డింగ్ విన్యాసాలు చూపించిన విరాట్ కోహ్లీ, ఆ వెంటనే బౌలింగ్ చేయాలని భావించాడు..
511
కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీతో బౌలింగ్ చేయించాడంటూ ఐసీసీ... విరాట్ బౌలింగ్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడం విశేషం...
611
మొదటి ఓవర్‌లో 4 పరుగులు మాత్రమే ఇచ్చిన విరాట్ కోహ్లీ, రెండో ఓవర్‌లో ఓ ఫోర్ ఇచ్చినా, 8 పరుగులు మాత్రమే ఇచ్చి ఆకట్టుకున్నాడు...
711
విరాట్ కోహ్లీ వేసిన స్వింగ్ బౌలింగ్‌కి వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్ అయిన స్టీవ్ స్మిత్ ఆశ్చర్యపోయి, అలా చూస్తూ ఉండడం టీవీల్లో స్పష్టంగా కనిపించింది...
811
టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆల్‌రౌండర్‌గా ఆడతాడని సోషల్ మీడియాలో ప్రచారం కూడా మొదలైపోయింది...
911
శార్దూల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి, జడేజా, భువనేశ్వర్ కంటే మెరుగైన ఎకానమీతో బౌలింగ్ చేసిన విరాట్ కోహ్లీ... ఐసీసీ టీ20 ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో 15వ స్థానంలో ఉన్నాడు...
1011
యువరాజ్ సింగ్, సురేష్ రైనా వంటి మాజీ ప్లేయర్ల తర్వాత టీమిండియా తరుపున టీ20ల్లో అత్యుత్తమ ర్యాంకులో కొనసాగుతున్న భారత ఆల్‌రౌండర్ విరాట్ కోహ్లీయే కావడం విశేషం...
1111
కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ఓ పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్‌గా విరాట్ కోహ్లీ సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం మొదలైపోయింది...