T20 World Cup: సూప‌ర్ 8కి ముందు కీల‌క మార్పులు.. ప్లేయింగ్ ఎలెవ‌న్‌లోకి స్టార్ ప్లేయ‌ర్‌.?

Published : Feb 21, 2026, 03:35 PM IST

T20 World Cup: మెన్స్‌ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో టీమిండియా దుమ్మురేపుతోంది. కాగా సూప‌ర్ 8 మ్యాచ్‌లు మొద‌లుకానున్న నేపథ్యంలో టీమిండియాలో కీల‌క మార్పులు జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు  ఇప్పుడు తెలుసుకుందాం.  

PREV
15
సూపర్ 8కు ముందు కీలక సంకేతాలు

టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 8 మ్యాచ్‌లు మొదలుకానున్నాయి. దక్షిణాఫ్రికాతో జరిగే కీలక పోరుకు ముందు భారత జట్టులో మార్పులు ఉండొచ్చన్న చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా కేరళ స్టార్ సంజు శాంసన్ మళ్లీ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి రావచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

25
అహ్మదాబాద్ ప్రాక్టీస్‌లో సంజూకు ప్రత్యేక ఫోకస్

అహ్మదాబాద్‌లో జరిగిన మొదటి ప్రాక్టీస్ సెషన్‌లో సంజూ ఎక్కువ సేపు నెట్స్‌లో బ్యాటింగ్ చేశాడు. వేర్వేరు బౌలింగ్ కాంబినేషన్లను ఎదుర్కొన్నాడు. మ్యాచ్ సిమ్యులేషన్ డ్రిల్స్ కూడా చేశాడు. కోచ్‌లు, సెలెక్టర్లు అతని ఆటను జాగ్రత్తగా గమనించారు. సాధారణంగా రిజర్వ్ ప్లేయర్లకు లభించని సమయం సంజూకు ఇవ్వడం అతడిని తుది జట్టులోకి తీసుకునే ఆలోచన ఉందన్న సంకేతంగా భావిస్తున్నారు.

35
అభిషేక్ స్థానంపై సందేహాలు

ఈ టోర్నమెంట్‌లో సంజూకు పెద్దగా అవకాశాలు రాలేదు. నమీబియాతో మ్యాచ్‌లో అనారోగ్యంతో బయటకు వెళ్లిన అభిషేక్ శ‌ర్మ స్థానంలో ఒక్కసారి మాత్రమే ఆడాడు. అభిషేక్ కోలుకున్న తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చాడు. ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాటర్‌గా ఉన్న అభిషేక్‌ను తక్షణమే తప్పించే అవకాశం తక్కువగా కనిపిస్తోంది.

45
తిలక్ వర్మపై ఒత్తిడి

పరుగు తీయడంలో ఇబ్బంది పడుతున్న మరో ఆటగాడు తిల‌క్ వ‌ర్మ‌. ముఖ్యంగా స్పిన్నర్లపై అతని స్ట్రైక్ రేట్ ఆశించిన స్థాయిలో లేదు. గ్రూప్ దశలో అమెరికా (16 బంతుల్లో 25), నమీబియా (21 బంతుల్లో 25), పాకిస్తాన్ (24 బంతుల్లో 25), నెదర్లాండ్స్ (27 బంతుల్లో 31) మ్యాచ్‌ల్లో అతను స్థిరంగా ఆడినా వేగం తక్కువగా ఉందన్న విమర్శలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తిలక్ స్థానంలో సంజూను తీసుకురావడం సులభ నిర్ణయంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

55
తుది నిర్ణయం టాస్ సమయానికే

రింకు సింగ్ స్థానంలో మార్పు చేసే అవకాశం చాలా తక్కువ. అయితే గ్రూప్ దశలో బాగా ఆడిన జట్టులో మార్పులు చేయకుండా అదే కాంబినేషన్‌తో దక్షిణాఫ్రికాను ఎదుర్కొనే అవకాశమూ ఉంది. ఎవరికి అవకాశం దక్కుతుందో తుది నిర్ణయం మ్యాచ్ రోజు టాస్ సమయంలోనే స్పష్టమవుతుంది. సూపర్ 8 దశలో ప్రతి మ్యాచ్ కీలకం కావడంతో జట్టు మేనేజ్‌మెంట్ జాగ్రత్తగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories