Rohit Sharma-Yashasvi Jaiswal
T20 World Cup 2024: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ జట్టు టీ20 ప్రపంచ కప్ 2024లో హ్యాట్రిక్ విజయాలు అందుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 10 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో అమెరికా (యూఎస్ఏ)పై విజయం సాధించింది. దీంతో భారత జట్టు సూపర్-8కు అర్హత సాధించింది. కానీ, భారత జట్టుకు ఇప్పుడు ఓపెనింగ్ జోడీ శుభారంభం అందించడంలో విఫలమవుతూనే ఉంది. అతిపెద్ద బలహీనతల్లో ఒకటిగా ఇది భవిష్యత్ మ్యాచ్ లలో భారీ ముల్యంచెల్లించే అవకాశముంది. అయితే, దీనిని పరిష్కరించడానికి మార్గాలు ఉన్నా రోహిత్ శర్మ ఒక యంగ్ ప్లేయర్ ను బెంచ్ కు పరిమితం చేస్తున్నారు.
Rohit Sharma DRS
కేవలం బెంచ్‌పై కూర్చొని భారత జట్టులోని ఓ ఆటగాడి ప్రతిభ వృథా అవుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటివరకు టీ20 ప్రపంచ కప్ 2024లో ఆడిన మూడు మ్యాచ్‌లలో టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఈ యంగ్ స్టార్ ప్లేయర్ ను తీసుకోలేదు. అతనే టీమిండియా సునామీ ఓపెనర్ యశస్వి జైస్వాల్. అతను మొదటి 6 ఓవర్లలోనే మ్యాచ్‌ని మలుపు తిప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ అతనికి ప్లేయింగ్ ఎలెవన్‌లో ఇంకా అవకాశం ఇవ్వలేదు.
టీ20 ప్రపంచ కప్ 2024లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో, వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్‌కు వచ్చాడు. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఓపెనింగ్‌లో రాణించలేకపోయాడు. టీ20 ప్రపంచకప్ 2024లో ఇప్పటివరకు విరాట్ కోహ్లీ 1, 4, 0 పరుగులు చేశాడు. అంతగా కలిసిరాని ఓపెనింగ్ నుంచి విరాట్ కోహ్లీని మళ్లీ తన మూడో స్థానంలోకి తీసుకురావాల్సిన అవసరముందని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎందుకంటే సూపర్-8లో కెప్టెన్ రోహిత్ శర్మ, పెద్ద జట్లతో జరిగే మ్యాచ్‌ల్లో యశస్వి జైస్వాల్‌ను ఓపెనింగ్‌లో దించాల్సి ఉంటుంది, లేకుంటే టీమిండియా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు.
Yashasvi Jaiswal, Virat Kohli, Jaiswal, Kohli
సూపర్-8లో పెద్ద జట్లతో జరిగే మ్యాచ్‌లో ఓపెనింగ్‌లో యశస్వి జైస్వాల్‌ను ఓపెనింగ్ కు తీసుకోవడంతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి విరాట్ కోహ్లీకి నంబర్-3లో అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. అదే సమయంలో, శివమ్ దూబే లేదా రవీంద్ర జడేజాలను టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్ నుండి తొలగించాల్సి ఉంటుంది. అక్షర్ పటేల్ స్పిన్ ఆల్ రౌండర్ పాత్రను పోషించగలడు. యశస్వి జైస్వాల్ ఓపెనర్‌కు వస్తే తొలి బంతికే అటాక్ చేస్తాడు. అటువంటి పరిస్థితిలో రోహిత్ శర్మకు మరో ఎండ్‌లో సెట్ చేసే అవకాశం లభిస్తుంది.
ഗവാസ്കറെ വീഴ്ത്തുമോ
ఓపెనింగ్‌లో రోహిత్ శర్మ నుండి ప్రారంభ బంతుల ఒత్తిడిని యశస్వి జైస్వాల్ తొలగిస్తాడు. అదే సమయంలో, విరాట్ కోహ్లీ కూడా మళ్లీ 3వ నంబర్‌లో బ్యాటింగ్ చేయడం ద్వారా ఫామ్‌కి తిరిగి రావచ్చు. భారత్ తరఫున టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో, విరాట్ కోహ్లీ నంబర్-3లో బ్యాటింగ్ చేస్తూ చాలా పరుగులు చేశాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ భారత్ తరఫున 4042 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.