సూర్య‌కుమార్ యాద‌వ్ సూప‌ర్ ఇన్నింగ్స్.. కానీ, చెత్త రికార్డు

First Published | Jun 13, 2024, 8:17 AM IST

T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ 2024 25వ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో అమెరికాను ఓడించింది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య జ‌రిగిన ఈ మ్యాచ్ గెలుపుతో టీమిండియా సూప‌ర్-8కు చేరుకుంది. 
 

T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ 2024 25వ మ్యాచ్ లో భారత్-అమెరికాలు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ తో రాణించిన టీమిండియా 7 వికెట్ల తేడాతో అమెరికాను ఓడించింది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. 

ఈ విజయంతో భారత్ సూపర్-8లో స్థానం ఖాయం చేసుకుంది. గ్రూప్-ఏ నుంచి సూపర్-8కి చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఇంత‌కుముందు భార‌త జ‌ట్టు ఐర్లాండ్‌, పాకిస్థాన్‌లను ఓడించింది. మరోవైపు, టోర్నీలో సహ-ఆతిథ్య అమెరికా తొలి ఓటమిని చవిచూసింది. అంతకుముందు కెనడా, పాకిస్థాన్‌లను యూఎస్ఏ ఓడించింది. 


Suryakumar Yadav

భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.ఇక  గాయం కారణంగా ఈ మ్యాచ్‌లో అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ ఆడలేదు. అతని స్థానంలో ఆరోన్ జోన్స్ కెప్టెన్సీని తీసుకున్నాడు.

Suryakumar Yadav

20 ఓవర్లలో అమెరికా 8 వికెట్లకు 110 పరుగులు చేసింది. భారత్ తరఫున అర్ష్‌దీప్ సింగ్ 4 వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా 2 వికెట్టు ప‌డ‌గొట్టాడు. స్వ‌ల్ప టార్గెట్ తో బ‌రిలోకి దిగిన టీమిండియా మూడు వికెట్టు కోల్పోయి విజ‌యాన్ని అందుకుంది. 

ఈ మ్యాచ్‌లో భారత్ 18.2 ఓవర్లలో 3 వికెట్లకు 111 పరుగులు చేసి విజయం సాధించింది. టీమిండియా తరఫున సూర్యకుమార్ యాదవ్ అజేయంగా 50 పరుగులతో విజ‌యం అందించాడు. శివం దూబే 31 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. 18 పరుగుల వద్ద రిషబ్ పంత్, 3 పరుగుల వద్ద రోహిత్ శర్మ ఔటయ్యారు. విరాట్ కోహ్లీ ఖాతా తెరవలేకపోయాడు. అమెరికా బౌలర్లలో సౌరభ్ నేత్రవాల్కర్ 2 వికెట్లు తీశాడు.

సూర్య‌కుమార్ యాద‌వ్ భార‌త్ కు విజ‌యాన్ని అందించే ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, ఈ క్ర‌మంలోనే మ‌రో చెత్త రికార్డును న‌మోదుచేశాడు. టీ20 వరల్డ్ క‌ప్ లో అత్యంత నెమ్మదిగా అర్ధశతకం సాధించాడు. సూర్య హాఫ్ సెంచ‌రీ చేయ‌డానికి 49 బంతులు ఆడాడు.  

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో హాఫ్ సెంచ‌రీ ఇన్నింగ్స్ కోసం ఎక్కువ బంతులు తీసుకున్న ప్లేయ‌ర్ల టాప్-లిస్టులో వీరున్నారు..

52 - మహ్మద్ రిజ్వాన్ వర్సెస్ కెన‌డా, న్యూయార్క్, 2024
50 - డేవిడ్ మిల్లర్ వర్సెస్ నేద‌ర్లాండ్, న్యూయార్క్, 2024
49 - డెవాన్ స్మిత్ వర్సెస్ బంగ్లాదేశ్, జోహెన‌స్ బర్గ్, 2007
49 - డేవిడ్ హస్సీ వర్సెస్ ఇంగ్లాండ్, బార్బడోస్, 2010
49 - సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ యూఎస్ఏ, న్యూయార్క్, 2024*

Latest Videos

click me!