జస్ప్రీత్ బుమ్రా క్రికెట్ ఆడుతూ ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా?

First Published Jun 12, 2024, 9:15 PM IST

Jasprit Bumrah Net Worth : గ్రౌండ్ లో ఏ స్థాయిలో తన బౌలింగ్ తో దుమ్మురేపుతాడో అంతకుమించి జస్ప్రీత్ బుమ్రా ఆర్థిక పోర్ట్ఫోలియో క్రికెట్ పిచ్ ను దాటి విస్తరించింది. బుమ్రా బ్రాండ్ ఎండార్స్మెంట్లలో డ్రీమ్ 11, ఏఎస్ఐసిఎస్,  ఒక స్పోర్ట్స్ దుస్తుల కంపెనీ, వన్ ప్లస్ వేరబుల్స్, జాగిల్, సీగ్రామ్, రాయల్ స్టాగ్ ఇలా చాలా పెద్ద బ్రాండ్లు ఉన్నాయి.
 

Jasprit Bumrah

Jasprit Bumrah Net Worth : టీమిండియా స్టార్ బౌల‌ర్ జస్ప్రీత్ బుమ్రా క్రికెట్ ఆడుతూ ఇత‌ర క్రికెట‌ర్ల‌తో పోలిస్తే భారీగానే సంపాదిస్తున్నాడు. అహ్మదాబాద్‌లో డిసెంబరు 6, 1993న జన్మించిన ఈ స్టార్ బౌల‌ర్ చిన్న‌తనంలో చాలా క‌ష్టాలే ప‌డ్డాడు. ఐదేళ్ల వయస్సులో తన తండ్రిని కోల్పోయాడు. దీంతో కుటుంబ ఆర్థిక ప‌రిస్థితి దారుణంగా మారింది. కుటుంబ కష్టాలు ఉన్నప్పటికీ, బుమ్రా క్రికెట్‌పై తన ప్రేమను, అభిరుచిని తగ్గించలేదు. ఎంతో క‌ష్ట‌ప‌డి ఇప్పుడు ప్ర‌పంచంలోనే ఒక అద్భుతమైన బౌలర్ గా కెరీర్ కొన‌సాగిస్తున్నాడు. 

Jasprit Bumrah

క్రికెట్ గ్రౌండ్ లో దుమ్మురేపే బౌలింగ్ తో అద‌ర‌గొడుతున్న ఈ స్టార్ బౌల‌ర్ సంపాద‌న గురించి తెలిస్తే మీరు షాక్ అవ్వ‌కుండా ఉండ‌లేరు. జస్ప్రీత్ బుమ్రా 2024 నికర విలువ ప‌లు రిపోర్టుల ప్ర‌కారం రూ. 55 కోట్లు. బుమ్రా సంపాద‌న‌లో అధికం ఐపీఎల్ లో ముంబై ఇండియ‌న్స్ తో ఒప్పందాలు, అలాగే, బీసీసీఐతో ఒప్పందం నుంచి వ‌స్తోంది. 

Jasprit Bumrah

అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు బీసీసీఐ కాంట్రాక్టుల నుంచి జస్ప్రీత్ బుమ్రా జీతం రూ. 7 కోట్లు. బుమ్రా భారత్‌కు ప్రాతినిధ్యం వహించే ప్రతి గేమ్‌కు మ్యాచ్ ఫీజును కూడా సంపాదిస్తాడు. అతనికి రూ. ఒక్కో టెస్టు మ్యాచ్‌కు 15 లక్షలు, రూ. ఒక్కో వన్డేకు 6 లక్షలు, రూ. ప్రతి టీ20కి 3 లక్షలు రూపాయ‌లు వ‌స్తాయి. 

Jasprit Bumrah, Bumrah

గ్రౌండ్ లో ఏ స్థాయిలో తన బౌలింగ్ తో దుమ్మురేపుతాడో అంతకుమించి జస్ప్రీత్ బుమ్రా ఆర్థిక పోర్ట్ఫోలియో క్రికెట్ పిచ్ ను దాటి విస్తరించి. బుమ్రా బ్రాండ్ ఎండార్స్మెంట్లలో డ్రీమ్ 11, ఏఎస్ఐసిఎస్,  ఒక స్పోర్ట్స్ దుస్తుల కంపెనీ, వన్ ప్లస్ వేరబుల్స్, జాగిల్, సీగ్రామ్, రాయల్ స్టాగ్ ఇలా చాలా పెద్ద బ్రాండ్లు ఉన్నాయి. అలాగే, స్వ‌స్థలం అహ్మ‌దాబాద్, ముంబై స‌హా ప‌లు న‌గ‌రాల్లో ఆస్తులు కూడా ఉన్నాయి. 

మోడల్, టీవీ ప్రెజెంటర్ సంజనా గణేసనిన్‌ను 2021లో వివాహం చేసుకున్న తర్వాత, బుమ్రా ముంబైలో విలాసవంతమైన బంగ్లాను కొనుగోలు చేశాడు. జస్ప్రీత్ బుమ్రా కార్ల క‌లెక్ష‌న్ లో  లగ్జరీ, స్పోర్ట్స్, అద్భుత‌మైన‌ ప్రాక్టికల్ వెహికల్స్ ఉన్నాయి. ఇందులో రూ. 2.54 కోట్లు విలువైన Mercedes -Maybach S560, అదే రేంజీలో ఉండే రేంజ్ రోవ‌ర్ వెలార్, నిస్సాన్ జీటీఆర్, టోయోటా ఇన్నోవా క్రిస్టా, స్టైలిష్ మిడ్-సైజ్ సెడాన్ స‌హా మొద‌లైన సూప‌ర్ కార్లు ఉన్నాయి. 

క్రికెట్ ఆడుతూ భారీగానే సంపాదిస్తున్న జస్ప్రీత్ బుమ్రా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల కోసం భారీగానే ఖ‌ర్చు చేస్తున్నాడు. భారత పేసర్ అణగారిన పిల్లల విద్యను స్పాన్సర్ చేయడంలో సహాయం చేస్తున్నాడు. దీని కోసం పెద్ద‌మొత్తంలో డబ్బును విరాళంగా అందిస్తున్నాడు.

Latest Videos

click me!