బౌండరీకి వెళుతున్న బంతిని ఆపడానికి, సూర్య వేగంగా పరుగెత్తాడు. ఈ సమయంలో అతను క్రిందికి వంగి బంతిని తీయడానికి ప్రయత్నించిన సమయంలోనే అతని చీలమండ మెలితిరిగింది. గాయం తీవ్రంగా కావడంతో అక్కడే పడిపోయాడు. జట్టు వైద్య, ఇతర సిబ్బంది వచ్చి గ్రౌండ్ నుంచి తీసుకెళ్లారు. వెంటనే ఫిజియో, వైద్య బృందం రంగంలోకి దిగి చికిత్స అందించారు. దీనికి సంబంధించిన చాలా ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.