Yearender 2023: ఈ ఏడాది టాప్-10 టీ20 బ్యాట్స్మన్ ఎవ‌రో తెలుసా..?

First Published | Dec 14, 2023, 1:39 PM IST

Top-10 T20 cricketers in 2023: భార‌త క్రికెట్ ప్లేయ‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్ 2023లో అత్యుత్త‌మ‌మైన, టాప్ టీ20 క్రికెట‌ర్ గా నిలిచాడు. ఆ త‌ర్వాతి స్థానంలో పాక్ ప్లేయ‌ర్ రిజ్వాన్ ఉన్నాడు.
 

Aiden Markram, Suryakumar Yadav, Mohammad Rizwan,

Yearender 2023: 2023లో క్రికెట్ ప్ర‌పంచంలో ప‌లువురు ఆట‌గాళ్లు త‌మ‌దైన స్టైల్లో అద‌ర‌గొట్టారు. ఈ ఏడాదిలో ఉత్త‌మ ఆట‌గాళ్లుగా పేరు సంపాదించారు. టీ20 క్రికెట్ లో టాప్-10 ప్లేయ‌ర్స్ లిస్టు లో భార‌త ఇద్ద‌రు భార‌త ఆట‌గాళ్లు సూర్య‌కుమార్ యాద‌వ్,  రుతురాజ్ గ్వైకాడ్ లు ఉన్నారు. 

Suryakumar Yadav

సూర్య‌కుమార్ యాద‌వ్ : 

సూర్య కుమార్ యాదవ్ 14 సెప్టెంబరు 1990లో జ‌న్మించాడు. వన్డే, టీ 20 ఫార్మాట్లలో భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. టీ20ల్లో భారత జాతీయ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న అతను భారత దేశవాళీ క్రికెట్ లో ముంబై జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ గా కొనసాగుతున్నాడు.
 


rizwan

మహ్మద్ రిజ్వాన్:

మహ్మ‌ద్ రిజ్వాన్ పాకిస్తానీ క్రికెటర్. 2015 నుండి అంతర్జాతీయ క్రికెట్‌లో పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో టీ20ల్లో 2000 పరుగులు చేసిన ఏకైక బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు. టెస్టులు, వన్డే ఇంటర్నేషనల్స్, ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్ లలో కుడిచేతి వాటం బ్యాటర్ గా, వికెట్ కీపర్ గా మూడు అంతర్జాతీయ ఫార్మాట్లలో సెంచరీలు సాధించాడు. ప్ర‌స్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో ఉన్నాడు. 
 

Aiden Markram

ఐడెన్ మార్క్రమ్: 

ఐడెన్  మార్క్రమ్ దక్షిణాఫ్రికా క్రికెటర్. ట్వంటీ 20 అంతర్జాతీయ క్రికెట్‌లో దక్షిణాఫ్రికా జాతీయ క్రికెట్ జట్టుకు ప్రస్తుత కెప్టెన్.  అత‌ని నాయ‌క‌త్వంలోని ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు అండర్-19 క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుచుకుంది. ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో మూడో స్థానంలో ఉన్నాడు.
 

Babar Azam

బాబార్ ఆజం: 

ఈ పాకిస్థానీ ప్లేయ‌ర్ 42 విజయాలతో టీ20ల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా ఉన్నాడు. అన్ని ఫార్మాట్లలో పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుకు సార‌థ్యం వ‌హించాడు. ప్ర‌స్తుత క్రికెట్ ప్ర‌పంచంలో అత్యుత్త‌మ‌మైన బ్యాట్స్ మ‌న్ ల‌లో ఒక‌డిగా గుర్తింపు సాధించాడు. ప్రస్తుతం అతను అన్ని ఫార్మాట్లలో టాప్ 5 ర్యాంకింగ్స్ లో ఉన్న ఏకైక క్రికెటర్. ప్రస్తుతం వన్డేలలో నంబర్ 2 బ్యాట‌ర్ గా, టీ20-టెస్టుల్లో నాల్గవ స్థానంలో ఉన్నాడు.
 

Image credit: Getty

రిలీ రోసౌ: 

రిలీ రోసౌ దక్షిణాఫ్రికా క్రికెటర్. 2014లో అంత‌ర్జాతీయ‌ క్రికెట్ లోకి ప్ర‌వేశించాడు. ఎడమచేతి బ్యాట్స్ మన్, కుడి చేతి ఆఫ్ స్పిన్ బౌలర్. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ చరిత్రలో 2022 టోర్నమెంట్ లో బంగ్లాదేశ్ పై 109 పరుగులతో సెంచరీ చేసిన తొలి దక్షిణాఫ్రికా ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ప్ర‌స్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో ఐదో స్థానంలో ఉన్నాడు. 
 

Image credit: PTI

టీ20 ర్యాంకింగ్స్ టాప్ ఐదు స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్, ఇండియా, మహ్మద్ రిజ్వాన్,  ఐడెన్ మార్క్రమ్, బాబర్ ఆజం, రిలీ రోసౌ ఉండ‌గా, ఆ త‌ర్వాతి స్థానంలో డేవిడ్ మలన్ (ఇంగ్లాండ్), రుతురాజ్ గైక్వాడ్ (ఇండియా), రీజా హెండ్రిక్స్ (సౌతాఫ్రికా),     జోస్ బట్లర్ (ఇంగ్లాండ్) గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్) లు ఉన్నారు. 
 

Latest Videos

click me!