ధోనీకి అరుదైన గౌర‌వం.. ఏడో నంబ‌ర్ జెర్సీకి బీసీసీఐ గుడ్ బై

First Published | Dec 15, 2023, 11:41 AM IST

MS Dhoni's No.7 jersey: భార‌త క్రికెట్‌కు విశిష్ట సేవ‌లందించ‌డంతో పాటు అంత‌ర్జాతీయ క్రికెట్ లో దిగ్గ‌జ ఆట‌గాడిగా పేరు సంపాదించిన క్రికెట‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోని. భార‌త్ కు మూడు ఐసీసీ మెగా టోర్నీ ట్రోఫీలు అందించిన ధ‌న్ ధ‌న్ ప్లేయ‌ర్ ఎంఎస్ ధోనికి బీసీసీఐ అరుదైన గౌర‌వం క‌ల్పిస్తూ మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ సర‌స‌న నిలిపింది.
 

MS Dhoni

MS Dhoni's No.7 jersey retired by BCCI: టీం ఇండియా లెజెండరీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఐకానిక్ నెం.7 జెర్సీ ఇకపై మరే ఇతర భారత ఆటగాడికీ అందుబాటులో ఉండదు. ధోనీ అంతర్జాతీయ రిటైర్మెంట్ తీసుకున్న మూడేళ్ల తర్వాత బీసీసీఐ మ‌రో కీల‌క నిర్ణయం తీసుకుంది. ధోనీ తన కెరీర్ మొత్తంలో టీషర్టుపై ధరించిన నంబర్ 7ను  రిటైర్ చేయాలని నిర్ణయించుకున్నట్లు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. 
 

MS Dhoni

ఇప్ప‌టికే ఈ నెంబ‌ర్ ను జెర్సీల‌పై ఉంచ‌డానికి అందుబాటులో ఉండ‌ద‌ని కొత్త ప్లేయ‌ర్ల‌కు బీసీసీఐ తెలిపిన‌ట్టు స‌మాచారం. బీసీసీఐ ఇంత‌కుముందు క్రికెట్ గాడ్, మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ జెర్సీని కూడా వీడ్కోలు ప‌లికింది. ఈ నెంబ‌ర్ మ‌రే క్రికెట‌ర్ కు కేటాయించ‌లేదు. 2017లో సచిన్ సిగ్నేచర్ నంబర్ 10 జెర్సీని కూడా శాశ్వతంగా బీసీసీఐ వీడ్కోలు ప‌లికింది. 
 


MS Dhoni

ఇప్పుడు ధోని ఆ గౌర‌వం ద‌క్కింది. ధోనీ ప్రతిష్టాత్మక నెం.7 జెర్సీని మరే భారత క్రికెటర్ ధరించడని సమాచారం. అంతర్జాతీయ క్రికెటర్ గా రిటైర్ అయిన మూడేళ్ల తర్వాత క్రికెట్ కు తను చేసిన సేవలకు గుర్తింపుగా తాను ధరించిన నంబర్ కు 'రిటైర్మెంట్' ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. ధోనీ కెప్టెన్సీలో టీమ్ఇండియా 2007లో టీ20 వరల్డ్ క‌ప్, 2011లో వన్డే వరల్డ్ క‌ప్, 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. ఇలా మూడు ఫార్మ‌ట్ ల‌లో భార‌త్ కు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఎకైక సార‌థి మ‌హేంద్ర సింగ్ ధోని. 
 

MS Dhoni

మహేంద్ర సింగ్ ధోనీ 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ పలికాడు. అయితే, 2014లో టెస్టు ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు. ధోని జెర్సీ నెంబ‌ర్ 7 గురించి అరంగేట్ర ఆటగాళ్లకు బీసీసీఐ సమాచారం అందించిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. టెండూల్కర్, ధోనీలకు సంబంధించిన నంబర్ల ఆప్షన్ తమ వద్ద లేదని టీమ్ ఇండియా ఆటగాళ్లకు, ముఖ్యంగా అరంగేట్ర ఆటగాళ్లకు బీసీసీఐ తెలియజేసినట్లు ఈ నివేదిక పేర్కొంది. 
 

MS Dhoni

ఎంఎస్ ధోనీ 7వ నంబర్ జెర్సీని ఎంచుకోవద్దని కొత్త ఆటగాళ్లకు చెప్పినట్లు బీసీసీఐ అధికారి కూడా తెలిపారు. ఆటకు చేసిన సేవలకు గాను టీషర్టులను రిటైర్ చేయాలని బోర్డు నిర్ణయించింది. కొత్త అరంగేట్ర ఆటగాడు నెం.7 ను పొంద‌లేడు.  ఇక నెం.10  ఇప్పటికే అందుబాటులో ఉన్న నంబర్ల జాబితా నుండి వీడ్కోలు ప‌లికిన సంగ‌తి తెలిసిందే.
 

Latest Videos

click me!