రోహిత్ శర్మ భారీ రికార్డును బద్దలుకొట్ట‌నున్న సూర్యకుమార్ యాదవ్

Published : Jul 25, 2024, 01:29 PM IST

Suryakumar Yadav : రోహిత్ శర్మ రిటైర్మెంట్ తో హార్దిక్ పాండ్యా కు కెప్టెన్సీ ద‌క్కుతుంద‌ని భావించారు కానీ, అనూహ్యంగా సూర్య‌కుమార్ యాద‌వ్ భార‌త టీ20 జ‌ట్టుకు కెప్టెన్ గా ఎంపిక‌య్యాడు. 2026 టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియాను ముందుకు న‌డిపించే అవకాశ‌ముంది.   

PREV
17
రోహిత్ శర్మ భారీ రికార్డును బద్దలుకొట్ట‌నున్న సూర్యకుమార్ యాదవ్
Rohit Sharma, Suryakumar Yadav,

Suryakumar Yadav : జూలై 27న ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టీ20I సిరీస్‌లో శ్రీలంకతో భారత్ తలపడ‌నుంది. పూర్తిస్థాయి టీ20 కెప్టెన్‌గా ప్రకటించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ తొలిసారిగా సిరీస్‌లో భార‌త జ‌ట్టు నాయ‌క‌త్వ‌ బాధ్యతలు చేపట్టనున్నాడు.

27
Rohit Sharma-Suryakumar Yadav


శ్రీలంక ప‌ర్య‌ట‌న‌లో భార‌త జ‌ట్టు మూడు వ‌న్డేలు, మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ల‌ను ఆడ‌నుంది. వ‌న్డే జ‌ట్టుకు రోహిత్ శ‌ర్మ కెప్టెన్ కాగా, టీ20 భార‌త జ‌ట్టును సూర్య‌కుమార్ ముందుకు న‌డిపించ‌నున్నాడు. 

37

శ్రీలంక సిరీస్ లో సూర్య‌కుమార్ యాద‌వ్ ఛాంపియ‌న్ ప్లేయ‌ర్, హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ భారీ రికార్డును బ‌ద్ద‌లు కొట్ట‌నున్నాడు. 

47

జూలై 27 నుంచి శ్రీలంకతో భారత్  మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడ‌నుండ‌గా, ఇక్క‌డ సూర్య‌కుమార్ యాద‌వ్ కెప్టెన్ గానే కాకుండా ప్లేయ‌ర్ గా మంచి ఫామ్ ను కొన‌సాగించాల‌ని చూస్తున్నాడు. 

57
Suryakumar Yadav

టీ20 క్రికెట్ లో శ్రీలంక పై అత్య‌ధిక ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్ రోహిత్ శ‌ర్మ‌. 411 పరుగులతో ఈ ఫార్మాట్‌లో శ్రీలంకపై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ గా ఉన్నాడు. 

67
Suryakumar Yadav

శ్రీలంక సిరీస్ లో రోహిత్ శ‌ర్మ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాల‌ని సూర్య‌కుమార్ యాద‌వ్ టార్గెట్ గా పెట్టుకున్నాడు. హిట్ మ్యాన్ రికార్డును బద్దలు కొట్టాలంటే సూర్యకుమార్ యాదవ్ ఇంకా 158 పరుగులు చేయాలి. 

 

77
Virat Kohli-Rohit Sharma

శ్రీలంక పై టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ఆటగాళ్లలో రోహిత్ శర్మ- 411, శిఖర్ ధావన్- 375, విరాట్ కోహ్లీ- 339, కేఎల్ రాహుల్- 301, శ్రేయాస్ అయ్యర్- 296 లు ఉన్నాడు. 

Read more Photos on
click me!

Recommended Stories