నటి నగ్మా, గంగూలీ రహస్యంగా వివాహం చేసుకోబోతున్నారనీ, వీరిద్దరూ చాలాసార్లు దేవాలయాలలో కలిసి కనిపించారని వార్తలు కూడా వచ్చాయి. ఎప్పుడో ఒకప్పుడు సౌరవ్ గంగూలీకి డోనా గంగూలీ విడాకులు ఇవ్వనుందనే వార్తలు కూడా అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ క్రమంలోనే సుమారు 24 ఏళ్ల క్రితం ఓ ప్రముఖ వార్తా సంస్థకు నగ్మా ఇంటర్వ్యూ ఇచ్చింది.