Published : Oct 17, 2021, 08:05 PM ISTUpdated : Oct 17, 2021, 08:07 PM IST
మిగిలిన జట్లతో పోలిస్తే, ఈసారి ఎలాంటి అంచనాలు లేకుండా ఐపీఎల్ 2021 సీజన్ బరిలో దిగింది చెన్నై సూపర్ కింగ్స్... అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, ఐపీఎల్ టైటిల్ గెలిచి... నాలుగు టైటిళ్ళతో ముంబై ఇండియన్స్ తర్వాతి స్థానంలో నిలిచింది...
ఐపీఎల్ 2021 సీజన్‌లో 12 మ్యాచులు ఆడిన సురేష్ రైనా, 17.77 సగటుతో 160 పరుగులు చేసి నిరాశపరిచాడు. పర్ఫామెన్స్‌తో పాటు ఫామ్ బాగోలేకపోవడంతో రైనాను కీలక మ్యాచుల్లో పక్కనబెట్టింది సీఎస్‌కే...
210
ప్లేఆఫ్ మ్యాచుల్లో ఘనమైన రికార్డు ఉన్న సురేష్ రైనా... ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మొదటి క్వాలిఫైయర్‌లో, కేకేఆర్‌తో జరిగిన ఫైనల్ మ్యాచులో అవకాశం దక్కలేదు...
310
‘వచ్చే ఏడాది మెగా వేలం ఉంది. జట్టులో కచ్చితంగా మార్పులు ఉంటాయి. మేం అన్ని ఫైనల్స్ కలిసి ఆడాం. నాలుగుసార్లు టైటిల్ గెలిచాం..
410
ఈసారి కూడా ఓ మంచి విజయంతో ముగించాం. గత ఏడాది ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించలేకపోయిన మేం, ఈసారి అక్కడే ఏకంగా టైటిల్ గెలిచాం...
510
బయో బబుల్‌ను వీడుతున్నప్పుడు తెలియకుండానే అందరం ఎమోషనల్ అయ్యాం. ఎందుకంటే వచ్చే ఏడాది ఏ జట్టులో ఉంటామో తెలీదు, కలిసి ఆడే అవకాశం వస్తుందో రాదో కూడా తెలీదు..
610
ఈ సారి ట్రోఫీ గెలిచామనే ఆనందం మా గుండెల్లో నిండిపోయింది. అయినా ఇన్ని రోజులు కలిసి ఉండడంతో ఒకరినొకరం బాగా మిస్ అవుతాం...
710
ఎమ్మెస్ బ్యాటింగ్ పర్ఫామెన్స్ బాగోలేదని చాలామంది విమర్శించారు. అయితే ప్లేఆఫ్స్‌లో ధోనీ కొట్టిన బౌండరీలు చూశారుగా... ఆ ఇన్నింగ్స్ చూస్తుంటే ఆ ఫీలింగ్ వేరేగా ఉండింది...
810
రుతురాజ్, డుప్లిసిస్ చాలా బాగా ఆడారు. కీలక మ్యాచుల్లో కూడా ఒత్తిడి మొత్తం వాళ్లే మోశారు. ముఖ్యంగా రుతురాజ్‌లో నాకు మాహీ భాయ్ లక్షణాలు కనిపిస్తున్నాయి....
910
ఆ పిల్లాడు చాలా కష్టపడతాడు... మంచిగా పర్ఫామ్ కూడా చేస్తున్నాడు. కానీ చాలా కామ్ పర్సన్. సైలెంట్‌గా తన పనేదో తాను చేసుకుంటూ పోతాడు...’ అంటూ కామెంట్ చేశాడు సురేష్ రైనా...
1010
ఐపీఎల్ కెరీర్లో 11 సీజన్ల పాటు సీఎస్‌కే ఆడిన సురేష్ రైనాను ఈసారి వేలానికి విడుదల చేసే అవకాశమే ఎక్కువగా ఉంది. వేలంలో రైనాను కొనుగోలు చేసేందుకు వేరే జట్లు ఆసక్తి చూపిస్తే, సీన్ ఇంట్రెస్టింగ్గా మారుతుంది.