టీ20 వరల్డ్‌కప్ 2021: ఇంగ్లాండ్‌తో వార్మప్ మ్యాచ్, ఓపెనర్‌గా ఇషాన్ కిషన్... కెఎల్ రాహుల్, పాండ్యాలకి...

First Published Oct 17, 2021, 6:03 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 సందడి మొదలైపోయింది. ఈ పొట్టి ప్రపంచకప్‌లో భారత జట్టు మ్యాచులు అక్టోబర్ 24 నుంచి ప్రారంభం అవుతున్నా, దానికి ముందు రెండు వార్మప్ మ్యాచులు ఆడనుంది టీమిండియా. ఇంగ్లాండ్‌తో సోమవారం జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌లో కొన్ని ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతోంది టీమిండియా...

టీమిండియా ఆల్‌రౌండర్ హర్ధిక్ పాండ్యా బౌలింగ్ చేయడానికి ఫిట్‌గా లేడని ప్రకటించింది బీసీసీఐ. దీంతో అతను తుదిజట్టులో ఉండడం అనుమానంగానే మారింది. 

డెత్ ఓవర్లలో, మిడిల్ ఆర్డర్‌లో వేగంగా పరుగులు చేసే హార్ధిక్ పాండ్యా లేకపోతే... ఆ బాధ్యతను తీసుకునే మరో బ్యాట్స్‌మెన్‌ను ఆ ప్లేస్‌లో ఆడించాల్సి ఉంటుంది...

దీంతో కెఎల్ రాహుల్‌ను మిడిల్ ఆర్డర్‌లో ఆడించి, ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా ఆడించి ప్రయోగం చేయాలని భావిస్తోంది భారత జట్టు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో మెరుపు ఆరంభం ఇచ్చి, ఫామ్‌లోకి వచ్చాడు ఇషాన్ కిషన్.

కాబట్టి రోహిత్ శర్మ‌తో అతన్ని ఓపెనర్‌గా పంపించి, ఐపీఎల్‌లో అదరగొట్టిన కెఎల్ రాహుల్‌ను మిడిల్ ఆర్డర్‌లో ఆడిస్తే రిజల్ట్ ఎలా ఉంటుందా? అని వార్మప్ మ్యాచుల్లో ప్రయోగం చేయనున్నారు...

సోమవారం ఇంగ్లాండ్‌తో వార్మప్ మ్యాచ్ ఆడే టీమిండియా, ఆ తర్వాత బుధవారం ఆస్ట్రేలియాతో రెండో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. మెగా టోర్నీ ఆరంభానికి ముందు జరిగే ఈ  రెండు మ్యాచుల్లో ప్రయోగాలు చేసి సక్సెస్‌ఫుల్ ఓపెనింగ్ జోడిని డిసైడ్ చేయనుంది...

ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందే తాను ఓపెనింగ్ చేస్తానని ప్రకటించాడు విరాట్ కోహ్లీ. అయితే ఐపీఎల్ 2021 సీజన్‌లో 400+ పరుగులు చేసినా, పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు విరాట్. దాంతో ఆ ఆలోచనను విరమించుకునే అవకాశం ఉండొచ్చు...

అలాగే స్పిన్నర్లను కూడా ఈ వార్మప్ మ్యాచుల్లోనే పరీక్షించనున్నారు. టీ20 వరల్డ్ ‌కప్ టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో వరుణ్ చక్రవర్తి, రవిచంద్రన్ అశ్విన్, రాహుల్ చాహార్ రూపంలో ముగ్గురు నాణ్యమైన స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు...

స్పిన్ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా స్థానం ఎలాగే జట్టులో ఫిక్స్. కాబట్టి అతనితో పాటు ఆడే మరో స్పిన్నర్ ఎవరనేది ఈ రెండు వార్మప్ మ్యాచుల్లో తేలిపోనుంది...

యూఏఈలో మంచి పర్ఫామెన్స్ ఇచ్చిన అక్షర్ పటేల్‌ను జట్టు నుంచి తొలగించి, స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపిక చేశారు సెలక్టర్లు. కాబట్టి శార్దూల్ ఠాకూర్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్‌లతో ముగ్గురికి తుదిజట్టులో చోటు దక్కడం ఖాయం...

ఇంగ్లాండ్‌తో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌కి భారత జట్టు (అంచనా): రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రాహుల్ చాహార్/వరుణ్ చక్రవర్తి, భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రిత్ బుమ్రా

click me!