‘రాహుల్ ద్రావిడ్ ఆ! ఏమో నాకు తెలీదు...’ భారత తర్వాతి కోచ్ వార్తలపై విరాట్ కోహ్లీ స్పందన...

First Published Oct 17, 2021, 7:11 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ తర్వాత భారత హెడ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు చేపట్టబోతున్నట్టు జోరుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే భారత సారథి విరాట్ కోహ్లీ మాత్రం ఈ వార్తలపై భిన్నంగా స్పందించాడు...

భారత తర్వాతి కోచ్‌ల నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన కూడా విడుదల చేసింది బీసీసీఐ. అయితే ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ సన్నాహాల్లో ఉన్న విరాట్ కోహ్లీకి మాత్రం ఈ విషయం కూడా తెలియదట...

‘ప్రస్తుతం మేమంతా టీ20 వరల్డ్‌కప్ పైనే పూర్తి ఫోకస్ పెట్టాం. ఎలాగైనా ఈ టోర్నీ గెలవాలని పట్టుదలతో ఉన్నాం. తర్వాతి కోచ్ నియామకం విషయంలో ఏం జరుగుతుందో నాకు తెలీదు...

ఇప్పటిదాకా ఈ విషయం గురించి ఎవ్వరితోనూ చర్చించలేదు. ఎందుకంటే ఇప్పుడు భారత జట్టు లక్ష్యం ఒక్కటే టీ20 వరల్డ్ కప్ టైటిల్ నెగ్గడం...

గత ఐదారేళ్లుగా ఐసీసీ టైటిల్ గెలవలేకపోయాం. ఈసారి ఆ లోటు తీర్చుకోవాలని అనుకుంటున్నాం... ఇప్పుడున్న లక్ష్యం అదొక్కటే’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...

‘భారత జట్టులోకి రావాలంటే అత్యుత్తమ టాలెంట్ ఉన్నవారికి అవకాశం ఉండాలనే ఉద్దేశంతో టీమిండియా కల్చర్‌ను మార్చాలని మేం అనుకున్నాం...

ఫిట్‌గా ఉంటే, పరుగులు సాధించడమే కాకుండా ఫీల్డింగ్ నాణ్యతా ప్రమాణాలు కూడా మెరుగవుతాయి. అందుకే ఫిట్‌నెస్ పరీక్షలను కఠినతరం చేశాం... 

కెప్టెన్‌గా నేను ఎన్నో సాధించా, అయితే ఐసీసీ టైటిల్ గెలవడమనేది ఓ ప్రత్యేకమైన అనుభూతి. అదో అద్భుతమైన అఛీవ్‌మెంట్... ఈసారి టైటిల్ గెలవడానికి నూటికి నూరు శాతం ఇస్తాం... 

2007 టీ20 వరల్డ్ కప్ సమయానికి ఈ ఫార్మాట్ గురించి ఎవ్వరికీ పెద్దగా అవగాహన లేదు. 2008లో ఐపీఎల్ ఎంట్రీ తర్వాత టీ20లకు క్రేజ్ పెరిగింది... 

చిన్న వయసులోనే ఐపీఎల్‌లోకి వచ్చి, యువకులు అదరగొడుతున్నారు. ఇది వారికి అంతర్జాతీయ వేదికలపై భయం లేకుండా పర్ఫామ్ చేయడానికి కావాల్సిన ధైర్యాన్ని, నమ్మకాన్ని నింపుతోంది.’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ..

click me!