Rohit Sharma: రోహిత్ శర్మ అలా చేసి ఉండాల్సింది కాదు... హిట్‌మ్యాన్ పై సునీల్ గవాస్కర్ కామెంట్స్

First Published | Nov 21, 2023, 1:06 AM IST

ICC Cricket World Cup: ఐసీసీ క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ 2023 ఫైన‌ల్ లో ఇండియా ఆస్ట్రేలియా చేతిలో చిత్తుకావ‌డంపై భార‌త మాజీ దిగ్గ‌జ క్రికెట‌ర్లు స్పందిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ గురించి భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. ఫైనల్‌లో రోహిత్ చేయకూడని పనిని ఎత్తిచూపారు.
 

Sunil Gavaskar's comments on Rohit Sharma: ఐసీసీ క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఇండియాను శక్తివంతమైన జ‌ట్టుగా ముందుకు నడిపించినా భారత్‌కు ప్రపంచకప్‌ను అందించలేకపోయాడు హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌. ఈ క్ర‌మంలోనే ఐసీసీ క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ 2023 ఫైన‌ల్ మ్యాచ్, రోహిత్ శర్మపై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కీల‌క వ్యాఖ్యలు చేశాడు. ఫైన‌ల్ మ్యాచ్ లో రోహిత్ కొన్నిపొర‌పాట్లు చేశాడ‌నీ, అవి చేసి ఉండాల్సింది కాదని పేర్కొన్నారు.
 

వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ లో రోహిత్ శర్మ భారత్ కు మంచి శుభారంభం అందించాడు. రోహిత్ దూకుడుగా ఓపెనింగ్ చేయడంతో టీమిండియా 300 పరుగులు ఈజీగానే సాధిస్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ రోహిత్ శర్మ భారీ షాట్ కొట్ట‌బోయి ఔటవ్వడంతో అతని ఇన్నింగ్స్ 47 పరుగుల వద్ద ముగిసింది. ఆస్ట్రేలియా జ‌ట్టుముందు భారీ ల‌క్ష్యాన్ని ఉంచ‌లేక పోయింది. 240 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కాపాడుకోవ‌డానికి, ఆ తర్వాత రోహిత్ శర్మ మైదానాన్ని సమర్ధవంతంగా నడిపించాడు. కానీ ఆ రోజు భార‌త్ ది కాదు.. ఎందుకంటే రోహిత్ చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. 
 


ఈ ఫైనల్ మ్యాచ్ గురించి సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ రోహిత్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. "రోహిత్ శర్మ మంచి లయతో బ్యాటింగ్ చేస్తున్నాడు.. గ్లెన్ మ్యాక్స్ వెల్ వేసిన ఓవర్ లో రోహిత్ ఫోర్, ఒక సిక్సర్ కొట్టాడు. దీంతో రెండు బంతుల్లో 10 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత రోహిత్ కు పెద్ద హిట్ కొట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ సమయంలో చేయాల్సిన పరుగులు వచ్చాయి. కాబట్టి రోహిత్ గట్టిగా కొట్టాల్సిన అవసరం లేదు.. కానీ రోహిత్ మాత్రం పెద్ద హిట్ కోసం వెళ్లి పెద్ద తప్పు చేశాడు. ఎందుకంటే రోహిత్ వికెట్ కోల్పోయాడని" అన్నారు. 
 

Rohit Sharma

అలాగే, "రోహిత్ శ‌ర్మ ఈ షాట్ ను కరెక్ట్ గా కొట్టి ఉండి ఉంటే సిక్సర్ అయ్యేది. అందరూ చప్పట్లు కొట్టేవారు. కానీ అలా జరగలేదు. ఇంకా చాలా ఓవ‌ర్లు ఆడాల్సింది. రోహిత్ ఔటు కావ‌డంతో భార‌త జ‌ట్టుపై ప్ర‌భావం ప‌డింది. అప్పుడు రోహిత్ తన వికెట్ ను కాపాడుకుని ఉంటే మ్యాచ్ లో ఫ‌లితం ఇంకోలా ఉండేదని అనుకుంటున్నాను. కాబట్టి రోహిత్ శర్మ ఆ షాట్ కొట్టాల్సింది కాదు..." అని సునీల్ గ‌వాస్క‌ర్ అన్నారు.

Rohit

కాగా, ఐసీసీ క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ 2023 ఫైన‌ల్ మ్యాచ్ లో రోహిత్ శ‌ర్మ భార‌త్ కు మంచి శుభారంభం అందించాడు. అయితే, వ‌రుస బౌండ‌రీలు బాదిన‌ త‌ర్వాత‌.. గ్లెన్ మ్యాక్స్ వెల్ బౌలింగ్ లో భారీ హిట్ కొట్ట‌బోయే వికెట్ స‌మ‌ర్పించుకున్నాడు. ట్రావిస్ హెడ్ అద్భుతమైన క్యాచ్ అందుకోవ‌డంతో హిట్ మ్యాన్ ఔట్ అయ్యాడు. రోహిత్ ఆ టైమ్ లో ఔట్ కాకుంటే ఫ‌లితం వేరేలా ఉండేద‌ని క్రికెట్ ప్రియులు, విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు.
 

Latest Videos

click me!