వరల్డ్ కప్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ని ప్రకటించిన ఐసీసీ... టీమిండియా నుంచి కోహ్లీ, రోహిత్‌తో పాటు..

First Published | Nov 20, 2023, 1:51 PM IST

10 జట్లతో ప్రారంభమైన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ, ఆస్ట్రేలియా- ఇండియా మధ్య జరిగిన ఫైనల్‌తో ముగిసింది. టీమిండియాని ఫైనల్‌లో ఓడించిన ఆస్ట్రేలియా, ఆరోసారి వరల్డ్ కప్ గెలిచింది. టోర్నీ ముగియడంతో ఐసీసీ, వరల్డ్ కప్ టీమ్ ఆఫ్ టోర్నమెంట్‌ని ప్రకటించింది..
 

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీతో వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకున్న సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డి కాక్‌కి ఐసీసీ టీమ్‌లో చోటు దక్కింది. 10 మ్యాచులు ఆడిన క్వింటన్ డి కాక్ 594 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు ఉన్నాయి.
 

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఐసీసీ వరల్డ్ కప్ టీమ్‌కి కూడా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 11 మ్యాచులు ఆడిన రోహిత్ శర్మ, 597 పరుగులు చేశాడు. 125.95 స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేసిన రోహిత్, అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.


విరాట్ కోహ్లీ 11 మ్యాచుల్లో 95.62 సగటుతో 765 పరుగులు చేశాడు. 3 సెంచరీలు, 9 సార్లు 50+ స్కోర్లు చేసి రికార్డు క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ, ‘మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు కూడా గెలిచాడు...

Daryl Mitchell

10 మ్యాచుల్లో 552 పరుగులు చేసిన న్యూజిలాండ్ బ్యాటర్ డార్ల్ మిచెల్, 11 మ్యాచుల్లో 452 పరుగులు చేసిన కెఎల్ రాహుల్‌కి ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌లో చోటు దక్కింది...

Glenn Maxwell

అలాగే ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, 11 మ్యాచుల్లో 16 వికెట్లు తీసిన భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాలకు కూడా ఐసీసీ టీమ్‌లో ప్లేస్ లభించింది..

11 మ్యాచుల్లో 20 వికెట్లు తీసిన జస్ప్రిత్ బుమ్రా, 9 మ్యాచుల్లో 21 వికెట్లు తీసిన శ్రీలంక యంగ్ బౌలర్ దిల్షాన్ మధుశంక, 11 మ్యాచుల్లో 23 వికెట్లు తీసిన ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా, 7 మ్యాచుల్లో 24 వికెట్లు తీసిన భారత బౌలర్ మహ్మద్ షమీలకు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌లో ప్లేస్‌ దక్కింది..

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌: క్వింటన్ డి కాక్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, డార్ల్ మిచెల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), గ్లెన్ మ్యాక్స్‌వెల్, రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రా, దిల్షాన్ మధుశంక, ఆడమ్ జంపా, మహ్మద్ షమీ
 

ఐసీసీ వరల్డ్ కప్ టీమ్‌లో టీమిండియా నుంచి ఆరుగురు ప్లేయర్లు సెలక్ట్ కాగా సౌతాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్ నుంచి చెరో ప్లేయర్‌కి చోటు దక్కింది. వరల్డ్ కప్ విన్నర్ ఆస్ట్రేలియా నుంచి గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపా మాత్రమే ఐసీసీ ప్రపంచ కప్ టీమ్‌లో చోటు దక్కించుకోగలిగారు.

Latest Videos

click me!