నటి సనా జావేద్ తో షోయబ్ మాలిక్ మూడో పెళ్లి.. సానియా మీర్జా సంగ‌తేంటి? ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ !

First Published | Jan 20, 2024, 12:58 PM IST

Sana Javed-Shoaib Malik second marriage: పాకిస్తాన్ స్టార్ క్రికెట‌ర్ షోయబ్ మాలిక్ పాకిస్థాన్ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేయ‌డంతో వైర‌ల్ గా మారాయి. అంత‌కుముందు, భారత టెన్నిస్ సూపర్ స్టార్ సానియా మీర్జాను వివాహం చేసుకున్న సోయ‌బ్ మాలిక్.. వీరి వివాహ జీవితం, విడాకుల అంశంతో వార్త‌ల్లో నిలిచారు.
 

Shoaib Malik Sania Mirza

Sana Javed, Shoaib Malik marriage: పాకిస్థాన్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్ మన్ షోయబ్ మాలిక్.. సానియా మీర్జాను కాద‌ని శనివారం (జనవరి 20) ప్రముఖ పాకిస్థానీ నటి సనా జావేద్ ను వివాహం చేసుకున్న‌ట్టు ప్ర‌క‌టించారు. 

షోయబ్ మాలిక్-స‌నా జావేద్  వివాహానికి సంబంధించి ఫొటోల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను పెళ్లాడిన ఈ కుడిచేతి వాటం బ్యాట్స్ మన్.. జావేద్ తో తన పెళ్లి ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నాడు.


షోయబ్ మాలిక్-స‌నా జావేద్  వివాహా ఫొటోల‌ను పంచుకుంటూ..  "అల్హమ్‌దుల్లిలాహ్.. మేము మిమ్మల్ని జంటలుగా సృష్టించామ" అని క్యాప్ష‌న్ తో సోయ‌బ్ మాలిక్ పేర్కొన్నాడు.

సోయ‌బ్ మాలిక్ త‌న రెండో పెండ్లి గురించి ప్ర‌క‌టించ‌డానికి ఒక రోజు ముందు, శుక్ర‌వారం నాడు సానియా మీర్జా ఇన్ స్టాగ్రామ్ లో చేసిన పోస్టు వైర‌ల్ గా మారిన సంగ‌తి తెలిసిందే. త‌న పోస్టులో 'పెళ్లి కష్టమే. విడాకులు కష్టమే.. మీ కష్టాన్ని ఎంచుకోండి. ఊబకాయం కష్టం. ఫిట్ గా ఉండటం కష్టం. మీ కష్టాన్ని ఎంచుకోండి. అప్పుల ఊబిలో కూరుకుపోవడం కష్టం. ఆర్థికంగా క్రమశిక్షణతో ఉండటం కష్టం. మీ కష్టాన్ని ఎంచుకోండి. కమ్యూనికేషన్ చాలా కష్టం. కమ్యూనికేట్ చేయకపోవడం కష్టం. మీ కష్టాన్ని ఎంచుకోండి. జీవితం ఎప్పటికీ సులభం కాదు. ఇది ఎల్లప్పుడూ కష్టంగా ఉంటుంది. కానీ మన కష్టాన్ని మనం ఎంచుకోవచ్చు' అని పేర్కొన్నారు. 

కాగా, 2007 టీ20 ప్రపంచకప్ లో ఫైనల్ కు చేరిన పాకిస్థాన్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన షోయ‌బ్ మాలిక్ 2010 ఏప్రిల్ 12న సానియా మీర్జాను వివాహం చేసుకున్నాడు. అప్ప‌ట్లో ఇది సంచ‌ల‌నం సృష్టించింది. 

షోయ‌బ్ మాలిక్-సానియా మీర్జా దంప‌తుల‌కు 2018 అక్టోబర్ లో ఇజాన్ మీర్జా మాలిక్ అనే మగబిడ్డ పుట్టాడు. గత కొన్నేళ్లుగా వీరి వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తాయని వార్తలు వచ్చినప్పటికీ వారెవరూ ఈ విషయంపై నేరుగా మాట్లాడలేదు.

అయితే శనివారం తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ తో మూడో పెళ్లిని ప్రకటిస్తూ షోయ‌బ్ మాలిక్ అంద‌రినీ ఆశ్చర్యపరిచాడు. 2010లో అయేషాతో విడాకులు షోయబ్.. అదే ఏడాది సానియా మీర్జాను పెండ్లి చేసుకున్నాడు. 41 ఏళ్ల ఈ క్రికెటర్ ఇప్పటికీ ఆటగాడిగా యాక్టివ్ గా ఉన్నాడు. చివరిసారిగా 2021 నవంబర్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఆడాడు.

2023 డిసెంబర్ 8న కరాచీలో జరిగిన జాతీయ టీ20 కప్ మ్యాచ్ లో లాహోర్ రీజియన్ వైట్స్ తో జరిగిన మ్యాచ్ లో సాయిల్కోట్ రీజియన్ తరఫున ఆడాడు.

Latest Videos

click me!