సానియా మీర్జా భ‌ర్త షోయబ్ మాలిక్ మూడో పెళ్లి.. ఎవ‌రీ స‌నా జావేద్?

First Published | Jan 20, 2024, 2:34 PM IST

Sana Javed-Shoaib Malik marriage: పాకిస్థాన్ మాజీ కెప్టెన్, బ్యాట్స్ మన్ షోయబ్ మాలిక్ పాకిస్తాన్ కు చెందిన స్టార్ స‌నా జాద‌వ్ ను  రెండో పెళ్లి చేసుకున్నాడు. షోయ‌బ్ మాలిక్ ఇప్ప‌టికే, భారత టెన్నిస్ సూపర్ స్టార్ సానియా మీర్జాను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. 
 

Sana Javed, Shoaib Malik

Sana Javed, Shoaib Malik marriage: పాకిస్థాన్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్ మన్ షోయబ్ మాలిక్ మరో వివాహం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు.

SANA JAVED

అయితే, ఇప్ప‌టికే  భార‌త స్టార్ టెన్నిస్ ప్లేయ‌ర్ సానియా మీర్జాను వివాహం చేసుకున్న షోయ‌బ్ మాలిక్ కు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే, సానియా-షోయబ్ ల వివాహం బంధం సాఫీగా లేద‌ని ప‌లుమార్లు వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టాయి. విడాకులు తీసుకోబోతున్నార‌ని కూడా చ‌ర్చ‌సాగింది. ఈ క్ర‌మంలోనే పాకిస్తాన్ కు చెందిన స‌నా జావేద్ ను మరో వివాహం చేసుకున్న‌ట్టు షోయ‌బ్ మాలిక్ ప్ర‌క‌టించి అంద‌రీని ఆశ్చ‌ర్చానికి గురిచేశాడు.


Sana Javed

సానియా మీర్జాను కాద‌ని స‌నా జావేద్ ను వివాహాం చేసుకున్న సోయబ్ మాలిక్ పెండ్లి ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇదే స‌మ‌యంలో స‌నా జావేద్ ఎవ‌రు?  షోయ‌బ్ మాలిక్ తో ప‌రిచ‌య ఎలా ఏర్ప‌డింది? అనే ప్ర‌శ్న‌లతో కామెంట్లు చేస్తున్నారు. 

Sana Javed

ఎవ‌రీ స‌నా  జావేద్?  షోయ‌బ్ మాలిక్-స‌నా జావేద్ కు ఎలా ప‌రిచ‌యం ఏర్ప‌డింది? అనే విష‌యాలు గ‌మ‌నిస్తే.. పాకిస్తాన్ న‌టిగా మంచి గుర్తింపు సాధించిన స‌నా జాద‌వ్.. 2012లో షెహర్-ఎ-జాత్‌తో అరంగేట్రం చేసింది.

Sana Javed-Shoaib Malik

షెహర్-ఎ-జాత్‌తో తెర‌పై క‌నింపించిన స‌నా జాద‌వ్ త‌ర్వాత అనేక సీరియల్స్‌లో న‌టించారు. రొమాంటిక్ డ్రామా ఖానీలో టైటిల్ రోల్ పోషించిన తర్వాత ఆమె మంచి గుర్తింపు పొందింది. 

Sana Javed

సనా జావేద్, సౌదీ అరేబియాలోని జెడ్డాలో 25 మార్చి 1993న జన్మించారు. ఉర్దూ టెలివిజన్‌లో తన పాత్రలకు పేరుగాంచిన పాకిస్తానీ నటి. త‌న అందం, అభినయంతో మంచి గుర్తింపు సాధించారు. 

Sana Javed-Shoaib Malik

స‌నా జావేద్ యూనివర్శిటీ ఆఫ్ కరాచీ నుండి పట్టభద్రురాలైంది. ఆమె 2012లో "షెహర్-ఎ-జాత్ష‌తో సినీరంగం ప్రవేశం చేసింది. అప్పటి నుండి "ఖానీ, రుస్వాయి,డంక్" వంటి  సీరియ‌ల్స్ లో న‌టించి స్టార్ గా గుర్తింపు సంపాదించారు.

Latest Videos

click me!