మ్యాచ్ ఆరంభంలోనే ఇంగ్లాండ్ ఓపెనర్లు టామీ బ్యూమాంట్ (5), అమీ జోన్స్ (1)ను వరుసగా పెవిలియన్ చేర్చిన క్రాంతి గౌడ్ భారత్‌కు శుభారంభం అందించింది. అనంతరం ఎమ్మా లాంబ్ (39), నాట్ సీవర్ (41) కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే స్నేహ్ రాణా ఇద్దరినీ ఔట్ చేయడంతో ఇంగ్లాండ్ 97/4తో ఇబ్బందుల్లో పడింది.
ఈ దశలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు సోఫీ డంక్లీ (83; 92 బంతుల్లో 9 ఫోర్లు), ఆలిస్ డేవిడ్సన్ రిచర్డ్స్ (53; 74 బంతుల్లో 2 ఫోర్లు) జాగ్రత్తగా ఆడి 106 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జట్టు స్కోరు 200 దాటిన తర్వాత కీలక సమయంలో రిచర్డ్స్‌ని ఔట్ చేసి భాగస్వామ్యానికి బ్రేక్ వేసింది శ్రీ చరణి.